Sathi Leelavathi Movie Review : లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 1.75 / 5
- MAIN CAST: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్, నరేష్, పవిత్ర లోకేష్, మొట్టా రాజేంద్రన్, వి.టి.వి గణేష్, సప్తగిరి, జాఫర్ తదితరులు.
- DIRECTOR: తాతినేని సత్య
- MUSIC: మిక్కీ జే మేయర్
- PRODUCER: నాగమోహన్
మెగా కోడలు లావణ్య త్రిపాఠికి పెళ్లి జరిగి, బాబు పుట్టిన తర్వాత విడుదలవుతున్న తొలి మూవీ కావడం, దానికి తోడు ఇదొక కామెడీ ఎంటర్‌టైనర్ అని ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ‘సతీ లీలావతి’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే నేడు (మే 8) థియేటర్లలోకి వచ్చిన ఈ భార్యాభర్తల కథ, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం.
‘సతీ లీలావతి’ కథ:
లీలావతి (లావణ్య త్రిపాఠి) సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ డైరెక్టర్. తన వృత్తిలో బిజీగా ఉండి భర్త రామ్ సేతు (దేవ్ మోహన్)కు సరైన సమయం కేటాయించలేకపోతుంది. దీంతో విసిగిపోయిన రామ్ సేతు.. తనకు విడాకులు కావాలని, తాను నికోలా (మడోన్నా సెబాస్టియన్) అనే మరో అమ్మాయిని ఇష్టపడుతున్నానని లీలావతికి చెబుతాడు. భర్త మాటలకు షాక్ అయిన లీలావతి, అతన్ని వదులుకోలేక కొట్టి, ఇంట్లోనే ఓ కుర్చీకి కట్టేస్తుంది. తమ ప్రేమ, పెళ్లి జ్ఞాపకాలను గుర్తుచేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు సేతు ఓ నిజం చెబుతాడు. అసలు లీలావతి అంటే తనకు ఇష్టం లేదని, ఆమె తండ్రి (నరేష్), బావ (జాఫర్) బెదిరిస్తేనే బలవంతంగా పెళ్లి చేసుకున్నానని అసలు విషయం బయటపెడతాడు. సరిగ్గా అదే సమయంలో అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయలేదనే కోపంతో ఓ నిర్మాత (మొట్టా రాజేంద్రన్) లీలావతిని కిడ్నాప్ చేస్తాడు. అదే సమయానికి ఓ దొంగ (సప్తగిరి) వాళ్ల ఇంట్లో పడతాడు. మరి లీలావతి భర్తను కట్టేసిన విషయం అందరికీ తెలిసిందా? కిడ్నాపర్ బారి నుంచి లీలావతిని ఎవరు కాపాడారు? ఇంట్లో సేతును చూసిన దొంగ ఏం చేశాడు? చివరికి లీలావతి, రామ్ సేతు కలిశారా? లేదా నికోలాతో సేతు వెళ్లిపోయాడా? అన్నది మిగిలిన కథ.
Also Read
విశ్లేషణ:
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, విడాకుల దాకా వెళ్లిన బంధాన్ని కాపాడుకునే క్రమంలో జరిగే సంఘటనలతో ఇప్పటిదాకా ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. వాటిని కామెడీగా డీల్ చేసి చివరికి ఎమోషనల్ టచ్ ఇచ్చి క్లోజ్ చేయడం ఒక టెంప్లేట్. ఈ సినిమాను కూడా అలానే చెప్పాలన్నది దర్శకుడి ఆలోచన. కానీ, అది తెరపై ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా విడాకులు అడగడం, భర్తను కట్టేయడం, ఇంటికి వచ్చే వాళ్ల నుంచి అతన్ని దాచడం అంటూ సాగుతుంది. ఈ క్రమంలో దర్శకుడు రాసుకున్న కామెడీ సీన్స్ పేపర్ మీద బాగున్నా స్క్రీన్ మీద మాత్రం ఏవీ నవ్వించలేకపోయాయి. పైగా, ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే లవ్ స్టోరీ కూడా మరీ సిల్లీగా అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్‌లో కిడ్నాప్ డ్రామా, దొంగ ఎంట్రీ, ఎమోషనల్ సీన్స్‌తో కథను బాగా సాగదీశారు. ఎలాంటి క్లారిటీ లేకుండా సాగే స్క్రీన్‌ప్లే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. చివర్లో ఇచ్చిన రెండు ట్విస్టులు కాస్త పర్వాలేదనిపిస్తాయి. సప్తగిరి, వి.టి.వి గణేష్, మొట్టా రాజేంద్రన్ లాంటి కమెడియన్లు ఉన్నా కూడా ఎక్కడా నవ్వు రాకపోవడం గమనార్హం. ఇక భార్యాభర్తల ఎమోషన్స్‌ను ఎలివేట్ చేస్తూ రాసిన డైలాగ్స్ చాలా అసహజంగా ఉన్నాయి. ఎలాంటి బలమైన ఎమోషన్ లేకుండానే హీరో మారిపోవడం లాజిక్‌కు అందదు. ఇకపోతే, కేవలం హీరోయిన్ పాత్ర పేరు కావడం మినహా ఈ సినిమాకు ‘సతీ లీలావతి’ అని టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. సినిమాలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వాడటం ఒక్కటే ఫ్యాన్స్‌కు కాస్త ఊరటనిచ్చే అంశం.
నటీనటుల పనితీరు:
స్టార్ డైరెక్టర్‌గా, భర్తను వదులుకోలేని భార్య పాత్రలో లావణ్య త్రిపాఠి బాగానే నటించింది. భర్తగా దేవ్ మోహన్ పర్వాలేదనిపించాడు. మడోన్నా సెబాస్టియన్ స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా, ఉన్నంతలో అందంగా కనిపించింది. సప్తగిరి, వి.టి.వి గణేష్, రాజేంద్రన్, జాఫర్ నవ్వించే ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వలేదు. నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ సినిమాకు ప్రధాన మైనస్ డబ్బింగ్. లీడ్ క్యారెక్టర్స్ డబ్బింగ్ చాలా నాసిరకంగా ఉంది, చాలా చోట్ల లిప్ సింక్ అవ్వలేదు. ఎడిటర్ అనవసరమైన ల్యాగ్ సీన్స్ కట్ చేసి ఉంటే బాగుండేది. సినిమాను దాదాపు ఒకే లొకేషన్‌లో చిత్రీకరించారు. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకపోయినా.. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్.ఎం.ఎస్’ లాంటి మంచి సినిమాలు తీసిన తాతినేని సత్య, ఈ చిత్రాన్ని ఇంత పేలవంగా ఎలా తీశాడో అని సందేహం రాకమానదు.
ఫైనల్తీలీ: నవ్వించలేక బోర్ కొట్టించిన భార్యాభర్తల డ్రామా!
తాజావార్తలు
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!