NTV Telugu Site icon

Dil Ruba Review: దిల్ రుబా రివ్యూ

Dilruba

Dilruba

క సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం దిల్ రూబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ దర్శకత్వంలో ఈ సినిమాని సరిగమప మ్యూజిక్ లేబుల్ ఏర్పాటుచేసిన కొత్త నిర్మాణ సంస్థ నిర్మించింది. రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పుడు నుంచి ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఈ సినిమాలో ఫైట్స్ విషయంలో ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉన్న సక్సెస్ మీట్ లో తనని కొట్టొచ్చు అని సినిమా నిర్మాత ప్రకటించడంతో అందరి దృష్టి సినిమా మీద పడింది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించింది సినిమా యూనిట్. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం

దిల్ రుబా కథ:
సిద్ధార్థ రెడ్డి!కిరణ్ అబ్బవరం) మ్యాగీ(నజియా డేవిసన్)ను ప్రాణంగా ప్రేమిస్తే బ్రేకప్ చెప్పి అమెరికా వెళ్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో అమ్మాయిలు అంటేనే అసహ్యం పెంచుకున్న సిద్ధార్థ తన తండ్రి మరణంతో థాంక్స్, సారీ అనే పదాలు జీవితంలో అసలు వాడకూడదు అని ఫిక్స్ అవుతాడు. అలాంటి సిద్ధార్థ జీవితంలోకి అంజలి(రుక్సార్) ప్రవేశిస్తుంది. మొదట అసలు ఆమె మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినా ఆమె వెంటపడి ప్రేమలో పడేలా చేస్తుంది. ప్రేమలో పడిన తర్వాత అదే కాలేజీలో చదివే విక్కీ (క్రాంతి కిల్లి) చేసిన ఒక గొడవ కారణంగా అంజలి, సిద్ధార్థ విడిపోతారు. సిద్దూకి బ్రేకప్ చెప్పినందుకు గిల్టీ ఫీల్ అవుతున్న మ్యాగీ వీరిద్దరినీ కలిపేందుకు అమెరికా నుంచి వస్తుంది. అలా వచ్చిన మ్యాగీ సిద్ధార్థ, అంజలి కలిసేలా చేసిందా? చివరికి వీరిద్దరూ కలిశారా? మధ్యలో ఎంటర్ అయిన లోకల్ డాన్ జోకర్(జాన్ విజయ్) కారణంగా ఏర్పడిన ఇబ్బందులు ఏంటి? అసలు జాన్ విజయ్ ఎందుకు సిద్దు అండ్ బ్యాచ్ని టార్గెట్ చేశాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ
సినిమా మొదలైన కొద్దిసేపటికి సినిమా కథ ఏమిటి అని స్థూలంగా అర్థమయిపోయేలా రాసుకున్నాడు దర్శకుడు. ఇది ఎంత మాత్రం కొత్త కథ కాదు. ఇప్పటికే మనం చూసిన ఎన్నో రొటీన్ లవ్ స్టోరీస్ లో ఇది కూడా ఒకటి. తండ్రి మరణం, ప్రియురాలి బ్రేకప్ తో మూర్ఖంగా తయారైన ఒక యువకుడు మరో యువతి జీవితంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోవాల్సిన సందర్భంలో కూడా తన గత అనుభవాల దృష్ట్యా ఏ మాత్రం మారకుండా చాలా స్తబ్దుగా ఉండిపోతాడు. అంటే మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. నిజానికి హీరో క్యారెక్టర్ ను బేస్ చేసుకుని ఈ సినిమా కథని అల్లుకున్నారు కానీ అలా అల్లుకున్న సమయంలో అర్జున్ రెడ్డి లాగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా పెట్టుకుని ఉంటే బాగుండేది కానీ హీరో క్యారెక్టర్ ను బాగా రాసుకున్నారు కానీ దాన్ని తెరమీదకు తీసుకొచ్చే విషయంలో తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. హీరో క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న తీరు బావుంది కానీ దాని కోసం అల్లుకున్న కథ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా లేదని చెప్పాలి. ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు ఇతర అంశాలు కొన్ని గత సినిమాలను గుర్తుచేస్తాయి. అలా అని వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేశారు అనుకుంటే వాటికి పూర్తి భిన్నంగా రాసుకోవడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఈ సినిమాలో అక్కడక్కడ మంచి సీన్స్ పడ్డాయి ముఖ్యంగా సత్యా ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. అయితే హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో అతనికి పెట్టిన ఫైట్స్ సినిమా కథ గమనాన్ని కాస్త దెబ్బ తీశాయేమో అనిపిస్తుంది. ఇక ఫస్ట్ ఆఫ్ మొదలైనప్పటి నుంచి కథ ఊహకు అందేలా రాసుకోవడం కాస్త మైనస్ అయ్యే అంశమే. కానీ లవ్ స్టోరీస్ అనగానే ఈజీగా అర్థం చేసుకునే మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని కూడా ఈజీగా పసిగట్టెయ్యగలరు. ఇక హీరో క్యారెక్టర్ ను ప్రేక్షకులలో మరింత ఎస్టాబ్లిష్ చేసేందుకు మధ్య మధ్యలో పూరీ జగన్నాథ్ పాడ్ క్యాస్ట్ వింటున్నట్టు చూపిస్తారు. ఆయన భావజాలాన్నే హీరో ఫాలో అవుతున్నట్లు చూపించడం కూడా హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నమే అనిపిస్తుంది.. కథ గతంలో మనం చూసిన ఎన్నో సినిమాల్లో ఉండడం ఊహకు అందేలా ఉండడంతో ఈ సినిమా రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన కిరణ్ అబ్బవరం ఆకట్టుకున్నాడు. కిరణ్ అబ్బవరం స్టైలింగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఫైట్ సీక్వెన్స్ లలో అయితే అదరగొట్టాడు. కొన్ని కొన్ని సీన్స్ లో కిరణ్ అబ్బవరం నటన ప్రేక్షకులను అబ్బుర పరిచేలా ఉంది. రుక్సార్ పాత్ర పరిమితమే, అయినా ఎందుకో బొమ్మరిల్లు హాసిని పాత్రను అనుకరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక నజియా ఉన్నంతలో ఆకట్టుకుంది. సత్యకి ఫుల్ లెంత్ రోల్ పడకపోయినా కనిపించిన ప్రతిసారి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక ఆడుకాలం నరేన్, క్రాంతి, జాన్ విజయ్, తులసి, విజయ్ రంగరాజు వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా అభినందించాల్సింది సంగీత దర్శకుడిని. ఆయన ఇచ్చిన పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి అసలైన ప్రాణంగా నిలిచాయి. ఫైట్స్ కంపోజ్ చేసిన తీరు కూడా ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ క్యారీ చేసింది. నిడివి విషయంలో ఇంకా కత్తెరకు పనిచేపితే బాగుండేది అనిపిస్తుంది.

ఫైనల్లీ ఈ దిల్ రూబా ఓ రొటీన్ కాంప్లెక్ లవ్ స్టోరీ