Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Keerty Suresh Chinni Movie Review

Chinni Movie Review: చిన్ని (తమిళ డబ్బింగ్) (అమెజాన్ ప్రైమ్)

Published Date :May 6, 2022 , 5:44 pm
By Subbarao N
Chinni Movie Review: చిన్ని (తమిళ డబ్బింగ్) (అమెజాన్ ప్రైమ్)
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 2.5 / 5

  • MAIN CAST: Keerty Suresh,selvaraghavan
  • DIRECTOR: Arun Matheswaran
  • MUSIC: sam c. s
  • PRODUCER: Screen Scene Media Entertainment Pvt. Ltd

కోలీవుడ్ లో కొంత కాలంగా దళితవాద చిత్రాల హవా సాగుతోంది. టాప్ డైరెక్టర్స్ మాత్రమే కాదు నవతరం దర్శకులు సైతం దళితవాదాన్ని తమ చిత్రాల ద్వారా గట్టిగా తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టించకుండా ఉండేందుకు మూడు నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు ఇవంటూ పేర్కొంటున్నారు. ఆ కోవకు చెందిన సినిమానే ‘సాని కాయిదం’. శుక్రవారం నుండి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో దీన్ని ‘చిన్ని’ పేరుతో అనువదించారు.

చిన్ని (కీర్తి సురేశ్‌) ఓ కానిస్టేబుల్. ఆమె భర్త మారెప్ప రైస్ మిల్ లో పనిచేస్తుంటాడు. వారికో పాప. రాజకీయ నేపథ్యం ఉన్న రైస్ మిల్ ఓనర్ కారణంగా మారప్ప తరచూ అవమానాలకు, కుల వివక్షకు గురవుతుంటాడు. ఒకానొక సంఘటనతో ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు. ప్రశాంతంగా చక్కటి కుటుంబ జీవితాన్ని గడపాలని భావించే చిన్ని ఆ విషయంలో భర్తనే తప్పు పడుతుంది. రైస్ మిల్ ఓనర్ ను క్షమాపణ కోరి, తిరిగి ఉద్యోగం పొందితే తప్పేమిటని అంటుంది. కానీ సమాజంలోని వ్యక్తులు, ఈ వ్యవస్థ ఆమె ఆలోచించే విధంగా లేదనే తత్త్వం ఆలస్యంగా బోధపడుతుంది. చిన్ని భర్త, బిడ్డ ఇద్దరూ కుల దురహంకారానికి, అధికార దాహానికి బలైపోతారు. ఆమె సైతం అత్యాచారానికి గురై జీవచ్చవంలా తయారవుతుంది. తమలాంటి బడుగు జీవులకు కోర్టులలోనూ న్యాయం దక్కదని తెలిసిన తర్వాత తన సోదర సమానుడైన రంగయ్య (సెల్వ రాఘవన్) సాయంతో చిన్ని ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే మిగతా కథ.

దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్ గతంలో ‘రాకీ’ అనే రివేంజ్ డ్రామాను తెరకెక్కించాడు. ఈ కథను ఎంచుకున్న తీరు, దాన్ని నడిపిన విధానం చూస్తే ‘రాకీ’ సీరిస్ లో ఇది రెండో సినిమా అనిపించక మానదు. ఎటువంటి ట్విస్టుల జోలికీ పోకుండా చిన్ని అనే ఓ అట్టడుగు వర్గానికి చెందిన మహిళకు జరిగిన అన్యాయం, దానికి ఆమె పగ తీర్చుకోవడం ఇందులో చూపించారు. అయితే ఆమెకు జరిగిన అన్యాయానికి కారణం కులోన్మాదం కావడంతో దాన్ని దర్శకుడు అడ్వాంటేజ్ గా తీసుకుని, దళిత వాదాన్ని బలంగా తెరపై చూపించాడు. ఆడది అబల ఎంత మాత్రం కాదని, తన కలలను ఎవరైనా భగ్నం చేస్తే పర్యవసానం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని దర్శకుడు చెప్పాలనుకున్నాడు. దానిని చాలా గాఢంగా చెప్పాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ను చూసిన వారికి వయలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో అవగాహన కలిగి ఉంటుంది. అయితే అది కేవలం శాంపిల్ మాత్రమే. అంతకు మించిన వయలెన్స్ సినిమాలో ఉంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది కదాని ఇంటిల్లిపాది కలిసి ఈ మూవీని చూద్దామనుకుంటే తట్టుకోవడం కష్టమే. బట్… చిన్ని ఆవేశంలోనూ, ఆక్రోశంలోనూ అర్థం ఉందనే విషయాన్ని దర్శకుడు విడమర్చి చూపడంతో ఆ వయెలెన్స్ ను ఆడియెన్స్ యాక్సెప్ట్ చేసే ఆస్కారం ఉంది.

నటీనటుల విషయానికి వస్తే… గత కొంత కాలంగా కీర్తి సురేశ్ కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. ‘మహానటి’తో జాతీయ అవార్డును అందుకున్న తర్వాత ఆమె నటించిన ఏ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. దానికి తోడు ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఓటీటీలోనూ వాటికి సరైన ఆదరణ దక్కలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్ ఆమెతో ఈ సినిమా తీయడం గొప్ప విషయమే. అయితే అరుణ్ పెట్టుకున్న నమ్మకాన్ని కీర్తి సురేశ్ వమ్ము చేయలేదు. చిన్ని పాత్రకు సంపూర్ణ న్యాయం చేసింది. ఆమెపై ప్రేక్షకులకు ఉండే సాఫ్ట్ కార్నర్ ఇందులోని పాత్రకు బాగా ఉపయోగపడింది. దాంతో ఆమె రివేంజ్ లో భారీ వయొలెన్స్ చోటు చేసుకున్నా వారి నుండి వ్యతిరేకత కనిపించలేదు. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి సెల్వ రాఘవన్. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వ రాఘవన్ ఇప్పుడిప్పుడే నటుడిగానూ తనదైన ముద్రను వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన విజయ్ ‘బీస్ట్’లోనూ మాజీ పోలీస్ అధికారి పాత్రను పోషించాడు. మిగిలిన నటీనటులు తెలుగు వారికి అంతగా చిరపరిచితులు కాదు. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం, యామిని యజ్ఞమూర్తి సినిమాటోగ్రఫీ మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. కీర్తి సురేశ్ అభిమానులకు, దళితవాదాన్ని గౌరవించేవారికి ‘చిన్న’ సినిమా నచ్చుతుంది. అయితే వయొలెన్స్ అధికంగా ఉన్న కారణంగా సాధారణ ప్రేక్షకులు పెదవి విరిచే ఆస్కారం లేకపోలేదు.

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్ :
కీర్తి సురేశ్, సెల్వ రాఘవన్ నటన
సామ్ సిఎస్ నేపథ్య సంగీతం
ఎంచుకున్న కథ

మెనెస్ పాయింట్:
పాత కలహాలను తిరిగి రేపడం
సుదీర్ఘమైన సన్నివేశాలు

ట్యాగ్ లైన్: వయొలెంట్ క్యాస్ట్ వార్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chinni
  • Keerty Suresh
  • movie review
  • selvaraghavan

తాజావార్తలు

  • TCL C8L Mini LED TV: టీసీఎల్ 98, 85-అంగుళాల, మోడళ్లలో కొత్త హై-ఎండ్ మినీ LED టీవీ సిరీస్‌ విడుదల

  • NATO: సంచలన నిర్ణయం దిశగా డొనాల్డ్ ట్రంప్..

  • Shreyas Iyer Record: ‘కింగ్ ఎక్కడన్నా కింగే’ రా.. పీబీకేఎస్, కేకేఆర్ చరిత్రలోనే శ్రేయస్ అయ్యర్ టాప్‌!

  • Iran War: అమెరికాకు మద్దతుగా రంగంలోకి రెండు దేశాలు.!

  • Jurala Project : ఎండిన జూరాల.. నీళ్లు లేక విలవిల.. పాలమూరు ఆయకట్టుకు తప్పని జలకష్టం.!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions