Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Katha Kanchiki Manam Intiki Review

రివ్యూ: కథ కంచికి మనం ఇంటికి

Published Date :April 8, 2022 , 7:46 am
By Subbarao N
రివ్యూ: కథ కంచికి మనం ఇంటికి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 2 / 5

  • MAIN CAST: త్రిగుణ్ (అదిత్ అరుణ్), పూజిత పొన్నాడ, ఆర్జే హేమంత్, గెటెప్ శ్రీను, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, సాహితి తదితరులు
  • DIRECTOR: చాణక్య చిన్న
  • MUSIC: బీమ్స్ సిసిరోలియో
  • PRODUCER: మోనిష్ పత్తిపాటి

నటీనటులు: త్రిగుణ్ (అదిత్ అరుణ్), పూజిత పొన్నాడ, ఆర్జే హేమంత్, గెటెప్ శ్రీను, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, సాహితి తదితరులు

మ్యూజిక్: బీమ్స్ సిసిరోలియో
డి.ఓ.పి: వైయస్ కృష్ణ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: శ్రీనివాస్ తేజ
ఫైట్స్: షావోలిన్ మల్లేష్
ప్రొడ్యూసర్: మోనిష్ పత్తిపాటి
డైరెక్టర్: చాణక్య చిన్న

యంగ్ హీరో అదిత్ అరుణ్ అప్పుడెప్పుడో ‘కథ’ సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు. ఇప్పటికిఎన్నో సినిమాల్లో నటించాడు, కానీ సరైన బ్రేక్ రాలేదు. దాంతో న్యూమరాలజీ ప్రకారంగా ఇటీవలే తన పేరును త్రిగుణ్‌గా మార్చుకున్నాడు. పేరునైతే మార్చుకున్నాడు కానీ అతని ఫేట్ ను మార్చాల్సింది ఎంచుకునే కథ అనే విషయం తెలుసుకోలేకపోయాడు. రొట్ట కొట్టుడు కథతో మరోసారి ‘కథ కంచికి మనం ఇంటికి’ మూవీతో శుక్రవారం జనం ముందుకొచ్చాడు. చాణక్య చిన్నా దర్శకత్వంలో మోనిష్ పత్తిపాటి తీసిన ఈ సినిమా కథా కమామీషు తెలుసుకుందాం.

‘మా తాతలు నేతులు తాగారూ మీరు మా మూతుల వాసన చూడండీ’ అనే టైపు కుర్రాడు ప్రేమ్ (త్రిగుణ్‌). శృంగార జీవితాన్ని గడిపిన తాత చనిపోయి చాలా కాలం అయినా… అలాంటి జీవితం తనకు దక్కడం లేదని తెగ బాధపడుతుంటాడు. ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకోవాలనే తాపత్రయంలో అతను చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇక బెట్టింగ్ పిచ్చి ఉన్న దీక్ష (పూజిత పొన్నాడ) తాను గెలవడం కోసం ఎలాంటి పనైనా చేసేస్తుంది. దొంగతనం కోసం ఇళ్ళకు వెళ్ళి అక్కడవారి కష్టాలు గమనించి తన జేబులో డబ్బులు, చేతి వేళ్ళకు ఉన్న ఉంగరాలు ఎదురు ఇచ్చి వచ్చే టైపు వ్యక్తి దొంగేష్ (గెటప్ శ్రీను). మరో వైపు నంది (ఆర్జే హేమంత్) సినిమాలకు కథలు రాసి లక్షలు సంపాదించాలనే కోరికతో తపించి పోతుంటాడు. ఇలా వివిధ రకరకాల బలహీనతలతో జీవితాన్ని గడుపుతున్న ఈ నలుగురు ఒకరోజు రాత్రి అనుకోకుండా శ్మశానంలో తారసపడతారు. ఒకరిని చూసి ఒకరు దెయ్యమని భ్రమ పడతారు. ఆ తర్వాత అందరూ మనుషులే అనే విషయం తెలుసుకున్నాక అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అదేమిటో ధైర్యం ఉంటే తెర మీద చూడాల్సిందే!

నిజానికి ఏ కథనైనా ముగించే ముందు ‘కథ కంచికి మనం ఇంటికి’ అని చెప్పడం పాతకాలంలో పెద్దలకు అలవాటు. కానీ ఈ కథ కంచికి కాదు… అసలు ఎటు వెళుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఓ హీరోను పరమ బేవర్స్ గాడుగా ఇలా కూడా చూపించవచ్చా! అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. అలానే హీరోయిన్ కు ఉన్న బెట్టింగ్ పిచ్చికి పరాకాష్టగా చిత్రమైన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. గెటప్ శ్రీను దొంగతనం చేసే సన్నివేశాలు పరమ రొటీన్ గా సాగాయి. నెక్ట్స్ సీనులో ఏం జరుగబోతోందనేది థియేటర్ లో కూర్చున్న ఏ ప్రేక్షకుడైనా ఠక్కున ఊహించగలడు. అయితే ఈ మూడు పాత్రలకు కాస్తంత భిన్నంగా ఉంది రైటర్ గా వేసిన ఆర్జే హేమంత్ పాత్రే. మొత్తం ఈ నలుగురు క్యారెక్టర్స్ లో కాస్తంత సెన్సిబుల్ గా ఉంది ఆ ఒక్క పాత్ర మాత్రమే. ఇక క్లయిమాక్స్ లో వచ్చిన సప్తగిరి నోటి వెంట ఎలాంటి దరిద్రమైన మాటలు పలికించారో తెలియదు, ఎందుకంటే చాలా వరకూ మ్యూట్ అయిపోయాయి. దాంతో ప్రేక్షకులు బతికి పోయారు. అలానే సినిమాలో చాలా సన్నివేశాలలో వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించినట్టు మ్యూట్ చేసిన దాన్ని బట్టి అర్థమైపోయింది. అయితే కొన్ని సన్నివేశాలలో శ్రీనివాస్ తేజ రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. తెర మీద నటిస్తున్న పాత్రల గత చిత్రాలను, వారికి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని లైవ్లీగా కొన్ని డైలాగ్స్ రాశాడు. మొన్నటి వరకూ అనాధ ఆశ్రమాలను కాపాడుకోవడానికి కొందరు ఎలాంటి పోరాటం చేశారనే అంశాల మీద సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అనాధ శరణాలయాల ముసుగులో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయనే అంశాల మీద వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఇది ఆ కోవకు చెందిందే. అయితే… ఆ సున్నితమైన, తీవ్రమైన అంశాన్ని హారర్ కామెడీగా మలిచాడు దర్శకుడు చాణక్య చిన్నా. అవసరానికి మించిన హంగామా, ఓవర్ గా ఉన్న యాక్షన్ సీన్స్ కారణంగా చెప్పాలనుకున్న అంశం వెనక్కి వెళ్ళిపోయింది. అర్థంపర్థం లేకుండా కథ ముందుకు సాగింది. సినిమా ప్రారంభంలో వినోద్ కుమార్ పై చిత్రీకరించిన పాట సాహిత్యపరంగా, సంగీత పరంగా బాగుంది. ఆ తర్వాత వచ్చిన ఐటమ్ సాంగ్ కుర్రకారుని ఆకట్టుకునేలా ఉంది. కానీ హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ను సరిగా ప్రెజెంట్ చేయకపోవడంతో ఆ తర్వాత పాటలకే ఆస్కారం లేకుండా పోయింది. క్లయిమాక్స్ లో వచ్చే థీమ్ సాంగ్ ఓకే. భీమ్స్ సిసిరోలియో సమకూర్చిన బాణీలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమా అంతా ఒక ఎత్తు కాగా పతాక సన్నివేశం మరో ఎత్తు. చాలా ఓవర్ గా తీశారు. ఈ కథకు అంత సీన్ అవసరం లేదు!

నటీనటుల విషయానికి వస్తే… హీరో పాత్రలో అస్సలు డిగ్నిటీ లేదు. ఓ రకంగా హీరోయిన్ దీ అలాంటి పాత్రే! ఏ రకంగానూ అవి ఆకట్టుకోవు. అయినా ఉన్నంతలో త్రిగుణ్‌ తన పాత్రకు న్యాయం చేకూర్చే ప్రయత్నం చేశాడు. పూజిత పొన్నాడ కొన్ని సన్నివేశాల్లో బాగుంది, మరికొన్ని సన్నివేశాల్లో తేలిపోయింది. ఈ సినిమాకు కాస్తంత రిలీఫ్ ఇచ్చింది గెటప్ శ్రీను మాత్రమే. ఆర్జే హేమంత్ కూడా కాస్తంత హుందాగా తనకిచ్చిన పాత్ర చేసి మెప్పించాడు. అతని భార్యగా శ్యామల నటించింది. ఇక ప్రతినాయకుడిగా మహేశ్ మంజ్రేకర్ చేశారు. ఆయన ఏరకంగానూ ఆ పాత్రకు సూట్ కాలేదు. మనిషిలో అస్సలు గ్రేస్ లేదు. ఇతర పాత్రల్లో సూర్య, సప్తగిరి, సాహితి, అనంత్, అశోక్ కుమార్ తదితరులు కనిపిస్తారు. మొత్తం మీద కథ, కథనాలపై దర్శకుడు శ్రద్ధ పెట్టకపోవడంతో… నటీనటులు, సాంకేతిక నిపుణుల శ్రమ వృధా అయినట్టైపోయింది. పైగా ఈ తరహా హారర్ కామెడీ సినిమాలు చూసి చూసి జనాలకు మొహం మొత్తేసింది. ఈ విషయం మన దర్శకులు ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో!!

రేటింగ్: 2 / 5

ప్లస్ పాయింట్స్
హారర్ కామెడీ కావడం
భీమ్స్ సంగీతం
శ్రీనివాస్ తేజ మాటలు

మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథ, కథనాలు
పేలవమైన సన్నివేశాలు
ఊహకందే ముగింపు

ట్యాగ్ లైన్: కంచికి చేరిన సినిమా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adith Arun
  • Chanakya Chinna
  • Katha Kanchiki Manam Intiki Movie Review
  • Katha Kanchiki Manam Intiki Review
  • Pujita Ponnada

తాజావార్తలు

  • Japan: 50 ఏళ్ల తర్వాత ప్రపంచ ఆయుధ మార్కెట్లోకి ‘జపాన్’ ఎంట్రీ.. డ్రాగన్‌కు చెక్ పెట్టేందుకేనా ?

  • Kerala: కేరళలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం..

  • Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!

  • Casting Couch : మంచం కింద ఇద్దరు హీరోలు.. పైన హీరోయిన్’తో ముసలి ప్రొడ్యూసర్ లీలలు! షాకింగ్ నిజాలు బయటపెట్టిన జేడీ!

  • Tragedy: ప్రాణం తీసిన సోషల్ మీడియా క్రేజ్.. మైనర్ బాలుడి మృతి.!

ట్రెండింగ్‌

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions