Balan The Boy Review : బాలన్ ది బాయ్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3.25 / 5
- MAIN CAST: Adhisheshan, Farzana Palathingalm Muhammad Zinaan, Tovino Thomas, Jean Paul Lal, Girish A. D., Beena Antony and others
- DIRECTOR: Chidambaram
- MUSIC: Sushin Shyam
- PRODUCER: Venkat K. Narayana (KVN)
‘మంజుమల్ బాయ్స్’ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకుడు చిదంబరం, తన మూడో సినిమాగా ‘బాలన్ ది బాయ్’ అనే సినిమాను రూపొందించారు. కేబీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో మనకు పెద్దగా తెలియని మలయాళ నటీనటులు నటించారు. అయితే, ఈ సినిమాలో ఒక స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అదేవిధంగా ఆ స్టార్ హీరో ఎవరు అనేదాన్ని చివరి వరకు సస్పెన్స్ గానే ఉంచింది చిత్ర యూనిట్. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
బాలన్ ది బాయ్ కథ
ఓ మహిళ (ఫర్జానా పాలత్గింగల్) ఆరేళ్ళ తన కొడుకు (ఆది శేషన్)తో కలిసి జైలు నుంచి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆమె తన పేరు సహా ఐడెంటిటీని మార్చుకుంటూ చాలాచోట్ల పనిచేస్తూ ఉంటుంది. అలాంటి ఆమె ఓ పెద్ద ఆవిడ ఇంట్లో హోమ్ నర్స్ గా పనిచేస్తూ ఉండగా, ఆమె కోరిక మేరకు… ఆమె చనిపోయిన తర్వాత అదే ఇంట్లోనే పాతిపెడుతుంది. ఈ విషయాన్ని తన కొడుకు దగ్గర చాలా కాలం దాస్తుంది. అయితే, ఆమె కొడుకు విదేశాల నుంచి వస్తున్నాడు అనే విషయం తెలిసి ఇంటికి వచ్చిన వారి మీద అటాక్ చేయడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు స్కూల్ కి వెళ్లి వచ్చిన సదరు మహిళ కుమారుడు ఆమెకు దూరమవుతాడు. పోలీసులు ఆ చిన్నారిని కూడా అదుపులోకి తీసుకుని, అతను ఎవరో ట్రేస్ చేసే పనిలో పడతారు. అయితే అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా ఆ బుడతడు తన విషయాలు ఏవీ పోలీసులకు చెప్పడు. పోలీసుల నుంచి తప్పించుకున్న ఆ బాలుడు తిరిగి తన తల్లిని ఎలా కలుసుకున్నాడు? పోలీసులు అరెస్ట్ చేసిన అతని తల్లిని చివరికి కలుసుకున్నాడా లేదా? మధ్యలో టొవినో థామస్ పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ
‘మంజుమల్ బాయ్స్’ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే అందరూ ఆ సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురుచూశారు. ‘మంజుమల్ బాయ్స్’ ఒక సర్వైవల్ థ్రిల్లర్ అయితే, దీన్ని ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించాడు దర్శకుడు. ప్రేమలో మోసపోయి, ఒక బిడ్డతో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఓ మహిళ… ఏ మనిషిని నమ్మకుండా, తనను తన కొడుకును ఎవరూ దూరం చేయకుండా తన చుట్టూ ఒక ప్రత్యేకమైన లక్ష్మణ రేఖను గీసుకుని బతుకుతున్న విధానాన్ని ఫస్ట్ హాఫ్ లో చూపించారు. ఆమె ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు చెబుతూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న తీరు ఒకింత షాక్ కలిగిస్తూనే, సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేస్తుంది.
వాస్తవానికి ఫస్ట్ హాఫ్ అంతా వీరిద్దరూ కొత్త కొత్త ఐడెంటిటీలతో కొత్త జీవితాలు ప్రారంభిస్తున్న తీరు ఆసక్తి కలిగిస్తుంది. ఇంటర్వెల్ కాస్త ఆసక్తి కలిగిస్తూనే, సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతోంది అనే విషయం మీద మరింత ఉత్సుకత పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యాక కథ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే సినిమా కథ ఎటు తిరుగుతుందో, అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం షాక్ ఫ్యాక్టర్ లాగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ట్విస్ట్ చుట్టూనే సినిమా కథ అంతా రాసుకున్నట్టు కూడా ఒకానొక సందర్భంలో అనిపిస్తుంది.
కథగా రాసుకున్నప్పుడు ఇది చాలా పెక్యూలియర్ కథ. దాన్ని తనదైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే అది మరీ సాగదీసిన ఫీలింగ్ కలగడం కొంత ఇబ్బంది పెట్టినా, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని ప్రెడిక్ట్ చేయనివ్వకుండా దర్శకుడు తన ప్రతిభను కనబరిచాడు.
నటీనటులు – సాంకేతిక విభాగం
ఇక ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో కనిపించిన ఆదిశేషంతో పాటు ఫర్జానా నటన ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. వీరిద్దరూ తమ నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన టొవినో థామస్ ఒక స్పెషల్ ప్యాకేజీలా కనిపించాడు. కొద్దిసేపైనా ఉన్నంతలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే… దర్శకుడు పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఇది సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి, థ్రిల్లర్ కథలు ఇష్టపడే ప్రేక్షకులు మాత్రమే దీనికి కనెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. డైలాగ్స్ బాగున్నాయి, తెలుగు డబ్బింగ్ విషయంలో కూడా కేర్ తీసుకున్నారు. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది, అప్పుడు సెకండ్ హాఫ్ కాస్త లాగ్ చేసిన ఫీలింగ్ తగ్గి ఉండేది.
ఓవరాల్ గా: ‘బాలన్ ది బాయ్’.. ఒక ఎంగేజింగ్ సైకలాజికల్ థ్రిల్లర్!
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!