Vadde Naveen Transfer Trimurthulu Review: వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 1.75 / 5
- MAIN CAST: Vadde Naveen, Raashi Singh, Devi Prasad and Others
- DIRECTOR: Kamal Tej Narla
- MUSIC: Kalyan Nayak
- PRODUCER: Vadde Naveen
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ సంపాదించిన వడ్డే నవీన్, ఆ తర్వాత కాలంలో సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నాడు. అయితే, ఆయన రీ ఎంట్రీ ఇస్తూ ఒక సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో కొంత ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఆయనే స్వయంగా నిర్మాతగా వ్యవహరించడంతో పాటు, స్క్రీన్ ప్లే కూడా అందించడంతో సినిమా ఎలా ఉంటుందని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. రాశి సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని కమల్ తేజ్ నార్ల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ కథ
అమలాపురంలో కానిస్టేబుల్ గా పనిచేసే త్రిమూర్తులకి మరో పేరు ఉంటుంది, అదే ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ (వడ్డే నవీన్). డ్యూటీలో నిజాయితీగా ఉంటూ ప్రాణం కోల్పోయిన తన తండ్రి దేవి ప్రసాద్ నుంచి నిజాయితీని పునికి పుచ్చుకున్న త్రిమూర్తులు, పదేళ్లలోనే 55 ట్రాన్స్ఫర్లు పూర్తిచేసుకుని ట్రాన్స్ఫర్ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తాడు. అయితే అలాంటి అతను, ఒకరోజు సీఎం సభకు బందోబస్తుగా వెళ్లాల్సి వస్తుంది. ఆ సభలో సీఎం మీద అటాక్ చేయబోయిన కొంతమంది గుండాల నుంచి అతను సీఎంని రక్షిస్తాడు.
Also Read
అయితే, అలా రక్షించినందుకు ప్రమోషన్ రావాల్సింది పోయి, అతన్ని మళ్లీ ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా ఎందుకు చేశారు? ట్రాన్స్ఫర్ మీద అరకు పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత త్రిమూర్తులు ఏం చేశాడు? అసలు పనే చేయకుండా నిలువరించాలి అనుకున్న పోలీసులకు త్రిమూర్తులు ఎలాంటి తలనొప్పులు తీసుకొచ్చాడు? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని వెండితెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ
ఏళ్ల తర్వాత వడ్డే నవీన్ హీరోగా సినిమా చేస్తున్నాడు అనగానే అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి నెలకొంది. దానికి తోడు పోలీస్ కానిస్టేబుల్ పాత్ర అనగానే ఎలాంటి కథ ఉంటుందా అని అందరూ ఎదురుచూసినట్టుగానే, వడ్డే నవీన్ ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు రాసుకున్న కథ కొత్తగా ఉంది కానీ, ట్రీట్మెంట్ మాత్రం వర్కౌట్ కాలేదు. వాస్తవానికి తండ్రి న్యాయం చేయలేకపోయినా, ఓ అమ్మాయికి న్యాయం చేసే ఓ నిజాయితీ గల కానిస్టేబుల్ కథే ఈ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’.
కథపరంగా బానే రాసుకున్నప్పటికీ, దాన్ని స్క్రీన్ ప్లే పరంగా ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయాడు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచే తర్వాత ఏం జరగబోతోంది అనేది ఈజీ ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కథ ఎటు తిరుగుతుందో కొంత కన్ఫ్యూజింగ్ గా అనిపించినా, ఇంటర్వెల్ నుంచి కథ ఎటు నడుస్తుందనే విషయం మీద దర్శకుడు క్లారిటీ ఇచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత కథ మరింత ప్రెడిక్టబుల్ అయిపోయింది.
ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఎంగేజింగ్ అనిపించినా, సెకండ్ హాఫ్ మాత్రం డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు మధ్య మధ్యలో కమర్షియాలిటీ కోసం చూపించిన పాటలు తలనొప్పి తెప్పిస్తాయి. అయితే, ఫస్ట్ హాఫ్ లో సీఎం సభ సీక్వెన్స్ మినహాయించి పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీక్వెన్స్ లు వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా వడ్డే నవీన్ కి ఇది మంచి పొటెన్షియల్ కలిగిన కథ అనిపించినా, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.
నటీనటులు – సాంకేతిక విభాగం
నటీనటుల విషయానికి వస్తే, వడ్డే నవీన్ కానిస్టేబుల్ త్రిమూర్తులు పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో ఇమేజ్ తో సినిమాలు చేసిన ఆయన, ఈ వయసులో ఇలాంటి కథ ఎంచుకోవడం సహజమైనప్పటికీ, చాలావరకు ఆ విషయంలో నటన పరంగా సక్సెస్ అయ్యాడు. ఇక రాశి సింగ్ ఉన్నంతలో హోమ్లీ వైఫ్ పాత్రలో పర్వాలేదనిపించింది. దేవి ప్రసాద్, జ్వాలాకోటి, సీఎం పాత్రధారి వంటి వాళ్లు తమ నటనతో ఆకట్టుకున్నారు. మిగతా పాత్రధారులు అందరూ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, పాటలు సినిమా మధ్యలో స్పీడ్ బ్రేకర్లలా అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదనిపించినా, సినిమా అంతా రియల్ లొకేషన్స్ లో కాకుండా సెట్స్ లోనే చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకా కాస్త ట్రిమ్ చేసి ఉండొచ్చు.
ఓవరాల్ గా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ అనేది ఒక రొటీన్ ఇన్వెస్టిగేషన్ డ్రామా.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!