Hrudayam Murali Movie Review: హృదయం మురళి మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: అథర్వా మురళి, ప్రీతి ముకుందన్, కయాదు లోహర్, ఎస్.ఎస్. తమన్,
- DIRECTOR: ఆకాష్ బాస్కరన్.
- MUSIC: ఎస్.ఎస్. తమన్.
- PRODUCER: మైత్రి డిస్ట్రిబ్యూషన్
Hrudayam Murali Movie Review: 1991లో తమిళంలో రిలీజ్ అయిన ‘ఇదయం’ అనే సినిమాని ‘హృదయం’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. అది అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ సినిమా హీరో మురళి కుమారుడు అధర్వ మురళి ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో ‘గద్దలకొండ గణేష్’ పేరుతో వచ్చిన సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు ‘హృదయం’ సినిమాకి ట్రిబ్యూట్లాగా ‘హృదయం మురళి’ పేరుతో మరో సినిమా చేశారు. తమిళంలో ‘ఇదయం మురళి’గా రిలీజ్ అయిన ఈ సినిమాని తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చాలా కాలం తర్వాత నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ బాగా వర్కౌట్ అయింది. దానికి తోడు ట్రెండింగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటించడం మరో ప్లస్ పాయింట్. ఈ సినిమాని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
హృదయం మురళి కథ:
హృదయ (అథర్వ మురళి) ఒక ఇంట్రోవర్ట్. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు లేకపోవడంతో మామ (నట్టి) సంరక్షణలోనే పెరిగి పెద్దవుతాడు. బేసిగ్గా ఇంట్రోవర్ట్ కావడంతో ఏ విషయాన్ని నేరుగా ఎవరికీ చెప్పలేని మనస్తత్వం అతనిది. ఈ క్రమంలో చదువుకునే సమయంలో సమంత (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. కానీ ఆమెకు చెప్పేలోపే ఆమె దూరమవుతుంది. ఆ తర్వాత క్రమంలో తన స్నేహితుడైన సచిన్, తమన్ ప్రియురాలు (నిహారిక ఎన్ఎం) స్నేహితురాలైన అముద (కాయదు లోహర్)తో కూడా మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెకు చెప్పేలోపు ఆమె కూడా దూరం అవుతుంది. ఇక ఇవన్నీ సెట్ కావు అనుకుంటున్న సమయంలో సమంత మరోసారి తారసపడుతుంది. ఆమెకు మరోసారి ప్రొపోజ్ చేద్దామనుకునే లోపు ఆ అవకాశం కూడా చేజారిపోతుంది.
Also Read
ఈ క్రమంలో ఇవన్నీ సెట్ కావని హృదయ మామ అతనికి పెళ్లి సెట్ చేస్తాడు. అదితి (మాళవిక మోహనన్)తో పెళ్లికి సిద్ధమవుతున్న క్రమంలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇంట్రోవర్ట్ గా ఉన్న హృదయకి పెళ్లి ముందు ఎదురైన సంఘటనలు ఏమిటి? అతను ఎందుకు ఇంట్రోవర్ట్ గా ఉన్నాడు? అతని పెళ్లికి అతని స్నేహితులు చేసిన సహాయం ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా టైటిల్ చూసిన తర్వాత ఎవరైనా సరే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ‘హృదయం’ సినిమా కోవలోనే ఇది సాగుతుందని భావిస్తారు. కానీ దానికి పూర్తి భిన్నంగా ఈ సినిమా సాగుతుంది. కొంతవరకు ప్రేమ వ్యక్తపరచలేకపోవడం అనేది సిమిలర్ పాయింట్ అనుకోవచ్చు కానీ, పూర్తిస్థాయిలో నేటి యూత్ అట్రాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తోనే కథ రాసుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా 90స్ కిడ్స్ కనెక్ట్ అయ్యేలా కొన్ని నాస్టాల్జియా మూమెంట్స్ తో సినిమా ప్రారంభించిన దర్శకుడు, ఆ తర్వాత ఆ పిల్లలు పెరగడం, పెద్దవారు అవ్వడం.. ఇలాంటి స్టేజెస్ లో కూడా సున్నితమైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు.
ఇక ఆ తర్వాత స్కూల్ లవ్, కాలేజ్ లవ్ అంటూ వేర్వేరు ట్రాక్స్ నడిపించి చివరికి పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. అయితే ఈ క్రమంలోనే సుదీర్ఘంగా సినిమాని సాగదీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ రోజుల్లో ఏదో స్పెషల్ ఎఫెక్ట్స్ లేదా చూసి అబ్బురపడే సన్నివేశాలు లేకపోతే ఇంత స్క్రీన్ స్పేస్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు తట్టుకోవడం కష్టమే. కానీ కేవలం ఫన్ మూమెంట్స్, సింగిల్ వన్ లైనర్స్ లాంటి వాటితోనే సినిమాని నడిపించే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా ఒక ఇంట్రోవర్ట్ బయోపిక్ లాగా ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు నడిపించారు.
నటీనటులు & సాంకేతిక వర్గం:
హృదయ అనే ఇంట్రోవర్ట్ పాత్రలో అధర్వ మురళి ఒదిగిపోయాడు. అతనికి ఈ తరహా పాత్రలు చేయడం కొత్తేమీ కాదు, మరోసారి తనకు అలవాటైన పాత్రలోనే కనిపించాడు. ఇక హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ డ్యూయల్ రోల్ లో ఆకట్టుకుంది. ఒకపక్క అందచందాలతో ఆకట్టుకుంటూనే, నటనతో కూడా తన మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇక కాయదు లోహర్, తమన్, నిహారిక ద్రవిడ్ వంటి వాళ్లు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
ఒకపక్క నటుడిగా నటించిన తమన్, ఈ సినిమాకి సంగీతం కూడా అందించాడు. తనదైన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశాడు కానీ పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. తమిళంలో మాత్రం ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి, తెలుగులో పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి కానీ ఆడియన్స్ కి మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. ఇక బ్యాగ్రౌండ్ స్కోరు సినిమాకు తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ ని సెట్ చేసేలా ఉంది.
ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే రెండు గంటల 48 నిమిషాల నిడివి అనేది ఇలాంటి సినిమాకి చాలా ఎక్కువనే చెప్పాలి. ఆ ఒక్క విషయంలో కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.
ఫైనల్ వర్డిక్ట్: ‘హృదయం మురళి’ ఓ టైం పాస్ రొమాంటిక్ కామెడీ!
నటీనటులు: మరియు ఫహాద్ ఫాజిల్ (అతిథి పాత్ర).
దర్శకుడు:
సంగీతం:
విడుదల తేదీ:
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!