Harudu Review : హరుడు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 1.5 / 5
- MAIN CAST: Harudu, Natasha Singh, Sri Hari Paila and Others
- DIRECTOR: Raj Talluri
- MUSIC: Mani Zenna
- PRODUCER: Dikkala Laxmana Rao, Praveen Reddy V, and Raj Thallur
‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’తో అప్పట్లో అమ్మాయిల గుండెల్లో లవర్ బాయ్‌గా గూడుకట్టుకున్న నటుడు వెంకట్ గుర్తుండే ఉంటాడు. ‘ఆనందం’, ‘అన్నయ్య’, ‘శివరామరాజు’ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారాయన. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ లాంటి భారీ ప్రాజెక్టులో నటించినా.. సోలో హీరోగా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘హరుడు’ అనే యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, వెంకట్ సెకండ్ ఇన్నింగ్స్‌కు బూస్ట్ ఇచ్చిందా? లేక ఉన్న పేరుని చెడగొట్టిందా? చూద్దాం..
హరుడు కథా కమామిషు:
ముంబైలో రౌడీల గుండెల్లో వణుకు పుట్టించే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ డీసీపీ శంకర్ (వెంకట్) హైదరాబాద్‌కు బదిలీ అవుతాడు. ఇక్కడ అడుగుపెట్టగానే సిటీలో తనదైన స్టైల్లో క్రైమ్ క్లీనింగ్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో.. లోకల్ గా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవర్ఫుల్ ఎమ్మెల్యే వరదరాజులు (శ్రీహరి పైలా)తో ఒక ఆటో డ్రైవర్ కేసు విషయంలో గొడవ పడతాడు. మరోపక్క ఫుడ్ కోర్ట్ పెట్టుకోవాలనే కలలతో ఒక కుర్ర బ్యాచ్ కార్ల ఇంజిన్లు దొంగలిస్తుంటారు. అనుకోకుండా పోలీసులకు చిక్కిన వాళ్ళను ఎమ్మెల్యే వరదరాజులు విడిపిస్తాడు. కానీ ఆ తర్వాత వాళ్ల పైనే దాడి చేయిస్తాడు. అసలు ఆ కుర్రాళ్లు దొంగిలించిన ఇంజిన్లకు, ఎమ్మెల్యే రాజకీయాలకు ఉన్న లింక్ ఏంటి? బయటకు మంచివాడిగా కనిపించే వరదరాజులు వెనుక ఉన్న క్రూరత్వం ఏమిటి? శంకర్ భార్య ప్రియ (నటాషా సింగ్) హత్యకు గురికావడం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? అనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
ఇప్పటి జెన్-జీ (Gen-Z) ఆడియన్స్ కి ఏం కావాలో తెలుసుకుని, రియాలిటీకి దగ్గరగా ఉండే పాత్రలను సీనియర్ నటులు ఎంచుకుంటున్నారు. కానీ, వెంకట్ మాత్రం ఆ ట్రెండ్ ను ఫాలో అవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. సస్పెన్స్ లేదా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న పోలీస్ స్టోరీని ఎంచుకుని ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ఇలాంటి అవుట్ డేటెడ్ కథతో తన సెకండ్ ఇన్నింగ్స్ సమయాన్ని వృథా చేసుకున్నాడనే చెప్పాలి.దర్శకుడు రాజ్ తళ్ళూరి ఎప్పుడో దశాబ్దాల కిందటి అవుట్ డేటెడ్ పోలీస్ కథను తీసుకున్నారు, ట్రీట్మెంట్ అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. సినిమా మొదటి సీన్ నుంచి ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే పెట్టాడు. ఫస్ట్ సీన్ చూడగానే “ఇది పక్కా రొటీన్ సినిమా” అని ఆడియన్స్ కి అర్థమైపోతుంది. కార్ ఇంజిన్ల దొంగతనం అనే పాయింట్ కాస్త కొత్తగా అనిపించినా, దాని చుట్టూ అల్లిన ఎమోషన్స్ ఏమాత్రం లాజిక్ కు అందవు. ఫస్ట్ హాఫ్ లో అసలు మెయిన్ పాయింట్ ఏంటో క్లారిటీ రాదు. ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ అయితే వెంకటేష్ ‘ఘర్షణ’ సినిమాకి స్పూఫ్ తీసినట్లుంటుంది. సెకండాఫ్ కూడా సాగదీతతో విసిగిస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లుక్స్ పరంగా చూసుకుంటే వెంకట్ వయసు పెరిగినా ఇంకా ఫిట్ గానే ఉన్నాడు. పోలీస్ యూనిఫామ్‌లో సెటిల్డ్ డైలాగ్స్ డెలివరీతో బాగానే ఆకట్టుకున్నాడు.
హీరోయిన్ నటాషా సింగ్ కు పెద్దగా స్కోప్ లేకపోయినా, ఉన్నంతలో తన గ్లామర్ తో నెట్టుకొచ్చింది. అయితే, ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం హెబ్బా పటేల్. ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న ఆమె, ఇప్పుడు ఇలాంటి ‘బి-గ్రేడ్’ క్యారెక్టర్లు ఎందుకు ఎంచుకుంటుందో. ఇక విలన్ గా చేసిన శ్రీహరి పైలా క్యారెక్టరైజేషన్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. అలీ కామెడీ అస్సలు వర్కౌట్ కాలేదు. సలోని తన ఐటెం సాంగ్ తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది.
టెక్నికల్ గా.. చూసుకున్నా సినిమా పూర్తి ఔట్ డేటెడ్ అనిపిస్తుంది. లౌడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఏమీ వర్కౌట్ కాలేదు. ఇక సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మరీ దారుణం. హీరో గన్ తో కాల్పులు జరుపుతుంటాడు, కానీ విలన్ గ్యాంగ్ కు బుల్లెట్లు తగిలినట్లు కనీస ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక సినిమా నిడివి (రన్ టైం) తక్కువ ఉండటం ఒక్కటే ఇందులో కాస్త ఊరటనిచ్చే విషయం.
ఫైనల్లీ : ‘హరుడు’.. రొటీన్ మూవీ
తాజావార్తలు
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
ట్రెండింగ్
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!