Godari Gattupaina Movie Review : గోదారి గట్టుపైన మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతిబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, శ్రీవాణి, సుదర్శన్, రాజకుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ తదితరులు
- DIRECTOR: సుబాష్ చంద్ర
- MUSIC: నాగవంశీ
- PRODUCER: అభినవ్ రావు
‘మేం ఫేమస్’ అనే సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు సుమంత్ ప్రభాస్. ఆ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న మూడేళ్ల తర్వాత, ఆయన ‘గోదారి గట్టు పైన’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. సుమంత్ ప్రభాస్ హీరోగా, నిధి ప్రదీప్ హీరోయిన్‌గా ఈ సినిమా రూపొందింది. జగపతిబాబు, లైలా, దేవి ప్రసాద్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాలో సుదర్శన్, వైవా రాఘవ, రాజ్ కుమార్ కసిరెడ్డి వంటి వారు ఇతర పాత్రలలో నటించారు. సుమారు 100కు పైగా షార్ట్ ఫిలిమ్స్ నిర్మించిన సుభాష్ చంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. యూనిక్ ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
భీమవరం దగ్గర్లో ఓ పల్లెటూర్లో ఉండే ఆటో డ్రైవర్ రాజు (సుమంత్ ప్రభాస్), తన చెల్లి (శ్రీ లాస్య), అమ్మానాన్నలు (శ్రీవాణి, దేవి ప్రసాద్) లోకంగా బతుకుతూ ఉంటాడు. తన స్నేహితులు (సుదర్శన్, వైవా రాఘవ, రాజ్ కుమార్ కసిరెడ్డి) తో సరదాగా సాగిపోతున్న అతని జీవితంలోకి మాయ (నిధి ప్రదీప్) ఎంట్రీ ఇస్తుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిన రాజు, ఆమె ప్రేమ కోసం తహతహలాడుతూ ఉంటాడు. కొద్ది రోజులకు మాయ కూడా అతడిని ప్రేమిస్తుంది. అయితే మాయ తండ్రి శ్యాంబాబు (జగపతిబాబు)కు మాత్రం వీరి ప్రేమ నచ్చదు. మరి శ్యాంబాబు తన కుమార్తె మీద ఉన్న ప్రేమతో ఈ ప్రేమను ఒప్పుకున్నాడా? మాయ, రాజు ఒకటయ్యారా లేదా? రాజు తన మరదలిని పెళ్లి చేసుకున్నాడా లేక మాయని పెళ్లి చేసుకున్నాడా? చివరికి ఏం జరిగింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
ఈ సినిమాని ముందు నుంచి ఒక ‘కూల్ సమ్మర్ బ్రీజ్ మూవీ’ అంటూ ప్రమోట్ చేస్తూ వచ్చింది చిత్ర బృందం. అంటే ఈ మండు వేసవిలో తమ సినిమాని చూస్తే ఖచ్చితంగా రిఫ్రెషింగ్‌గా ఫీల్ అవుతారని చెబుతూ వచ్చింది. అయితే సినిమా చూస్తున్నంత సేపు కొంచెం అలాంటి ఫీలింగే కలగడం గమనార్హం. నిజానికి దర్శకుడు సుభాష్ చంద్ర నేల విడిచి సాము చేయలేదు. కథగా చెప్పాలంటే ఇదేమీ కొత్తది కాదు. పల్లెటూరిలో ఒక ఆటో కుర్రాడు, ఇంజనీరింగ్ చదువుతున్న వేరే మతం అమ్మాయితో ప్రేమలో పడితే, ఆ ప్రేమ సఫలీకృతం అయిందా లేదా అనే రొటీన్ లైన్లోనే ఉంటుంది.
కానీ సాధారణంగా మనం బయట చూస్తున్న పరిస్థితులలో, ఆటో డ్రైవర్ ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అంటే కచ్చితంగా ఆ ఆటో డ్రైవర్ మీద ఎన్నో రకాల నిందలు వస్తాయి. కానీ ఆ ఆటో డ్రైవర్ కూడా మనిషే, అతనికి మానవత్వం ఉంటుంది అనే యాంగిల్ లో చూపిన సినిమా ఇది. వాస్తవానికి ‘ఇంటర్ అమ్మాయిలను ఆటో డ్రైవర్లు పడేస్తారు’ అనే మీమ్స్ ఇప్పుడు మనం ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తూ వస్తున్నాం. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ కలుగదు.
నిజానికి ఫస్టాఫ్ అంతా అసలైన కాన్ఫ్లిక్ట్ కోసమే రాసుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్ వరకు ఈ సినిమాలో అసలైన కాన్ఫ్లిక్ట్ మొదలవ్వదు. ఫస్టాఫ్ అంతా వీరిద్దరి ప్రేమలో పడటం, రాజు స్నేహితులతో చేసే సరదా అల్లరితో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ మొదలైన చాలాసేపటికి గానీ అసలైన కాన్ఫ్లిక్ట్ మొదలవ్వదు.
అది మొదలైన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అందరికీ, అక్కడ కూడా రొటీన్ ట్రీట్‌మెంట్ తోనే కథను డీల్ చేశాడు దర్శకుడు. నిజానికి ఈ సినిమాని ఇంకా మంచిగా ప్రెసెంట్ చేసే స్కోప్ ఉంది. కానీ దర్శకుడికి తాను తీసిన సీన్స్ మీద ఉన్న ప్రేమ ఏమో తెలియదు కానీ, నిడివి ఎక్కువైపోవడంతో సినిమా లాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కాస్త సీన్లు కత్తిరించి, పకడ్బందీగా రాసుకుని ఉంటే ప్రేక్షకులకు ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది. నిజానికి ఈ సినిమాలో కామెడీ చాలా వరకు వర్కవుట్ అయింది. ముఖ్యంగా సుదర్శన్ కనిపించిన అన్ని సీన్లలో నవ్వించాడు. అలాగే ఎమోషన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. అయితే నిడివి తగ్గించి ఉంటే ఈ కామెడీ, ఎమోషన్ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది.
నటీనటుల తీరు:
మొదటి సినిమాలో పూర్తిగా తెలంగాణ కుర్రాడిగా కనిపించిన సుమంత్ ప్రభాస్, ఈ సినిమాలో గోదావరి యాసలో నటించి ఆకట్టుకున్నాడు. ఇంకా కొంచెం యాస సూట్ కావాల్సి ఉన్నా, పూర్తిగా తనకు తెలియని యాసలోకి పరకాయ ప్రవేశం చేయడం అభినందించాల్సిన విషయం. ఇక నిధి ప్రదీప్ టాలీవుడ్‌కి దొరికిన మరో టాలెంటెడ్ నటి అని ఫస్ట్ సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది. చాలా సీన్స్‌లో ఈ అమ్మాయి అద్భుతంగా నటించింది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో కళ్ళతోనే నటించిన తీరు అభినందనీయం.
జగపతిబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, శ్రీవాణి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. చాలా సీన్స్ వీరి వల్ల ఎలివేట్ అయ్యాయి, ఎమోషనల్ గా వర్కవుట్ అయ్యాయి. హీరో చెల్లెలి పాత్రలో నటించిన శ్రీ లాస్య, మరదలి పాత్రలో నటించిన రేణు స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించారు, అంతే అందంగా నటించారు. సుదర్శన్ ట్రాక్ ఎక్కడ ఉన్నా వర్కవుట్ అయింది. రాజకుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ వంటి వాళ్లు చాలా కాలం తర్వాత మళ్లీ ఫుల్ లెన్త్ రోల్స్‌లో నవ్వించారు.
సాంకేతిక వర్గం:
దర్శకుడు సుభాష్ సింపుల్ కథని తీసుకున్నా, దాన్ని ఆసక్తికరంగా ప్రెసెంట్ చేశారు. అయితే దాన్ని ఇంకా ఆసక్తికరంగా ప్రెసెంట్ చేసే స్కోప్ ఉన్నా, ఎందుకో కొంచెం తడబాటు కనిపించింది. మాఘ వంశీ అందించిన సంగీతం బావుంది. నేపథ్య సంగీతం కరెక్ట్‌గా సెట్ అయింది. కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి, స్క్రీన్ మీద కూడా అంతే బాగున్నాయి. గోదావరి అందాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ కీలక పాత్ర పోషించాడు. ఎడిటింగ్ టేబుల్ మీద సినిమాని ఇంకాస్త సెట్ చేసి ఉండాల్సింది.
ఫైనల్ వర్డిక్ట్: ఈ ‘గోదారి గట్టు పైన’.. ఒక ఫన్ ఫిల్డ్ ఎమోషనల్ రైడ్!
తాజావార్తలు
-
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!