Drohi Movie Review:సందీప్ కుమార్, దీప్తి వర్మ హీరో హీరోయిన్లుగా విజయ్ పెందుర్తి దర్శకత్వంలో ‘ద్రోహి’ ద క్రిమినల్ అనే ఉపశీర్షికతో సినిమా తెరకెక్కింది. గుడ్ ఫెలో మీడియా సఫైరస్ మీడియా, వెడ్నెస్ డే ఎంటర్టైనమెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ద్రోహి అనే టైటిల్ తోనే ఆసక్తి పెంచేసిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ : అజయ్(సందీప్ ) తన ఇద్దరి స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. చేసే ప్రతి బిజినెస్ ఫెయిల్ అవుతూనే ఉన్నా అతని భార్య చంద్రిక(దీప్తి వర్మ ) ఎప్పుడూ కు సపోర్టుగా ఉంటుంది. చేసే ప్రతి బిజినెస్ ఫెయిల్ అవ్వడం రెండేళ్లుగా తన సక్సెస్ అవ్వకపోవడంతో అజయ్ బాగా ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటాడు. అయినా బతుకు బండిని లాగుతూనే ఉంటాడు. ఇలా సాగిపోతున్న క్రమంలో అనూహ్య పరిస్థితుల్లో చంద్రిక చనిపోతుంది. అయితే చంద్రికను చంపింది అజయ్ అనే అనుమానంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే అసలు చంద్రిక ఎలా చనిపోయింది? అజయ్ ఎలా ఇరుక్కున్నాడు? చివరికి ఆ కేసు నుంచి అజయ్ ఎలా పడ్డాడు బయట అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
ఈ సినిమా కథ కొత్తది ఏమీ కాదు. ప్రాణంగా ప్రేమించే భార్య అనుహ్యంగా చనిపోవడం ఆ కేసు భర్త మీదే పడడం, ఆ తరువాత ఆ కేసు నుంచి సదరు భర్త ఎలా తప్పించుకున్నాడు అనే కథతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా అలంటి కధనే ఎంచుకున్న దర్శకుడు స్కీన్ ప్లే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించింది. రొటీన్ కథను కూడా దర్శకుడు స్క్రీన్ ప్లేతో చాలా ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేసి చాలా వరకు సఫలం అయ్యాడు. అయితే నిజానికి నోటెడ్ ఫేస్ లు ఉన్న హీరోహీరోయిన్లతో కనుక సినిమా చేయించి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదని చెప్పక తప్పదు. అయితే ఈ సినిమా సస్పెన్స్ క్యారీ చేసే విషయంలో దర్శకుడు తడబడినట్టు అనిపించింది. కొంత కథనం ఊహకు అందే విధంగా ఉండడం కొంతవరకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో సందీప్ నటన, అతని పాత్ర చాలా బాగున్నాయి. హీరోయిన్ గా దీప్తి వర్మ కూడా అందంగా కనిపించింది. షకలక శంకర్ లో అయితే ఒక కొత్త నటుడిని చూపించే ప్రయత్నం చేశారు. హీరో ఫ్రెండ్స్ గా మహేష్ విట్ట, నీరోజ్ పుచ్చ కూడా తమ తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకునేలా నటించారు. చాందిని, మజిలీ శివ, దీప్తి వర్మ ఎవరికి వారు వారి క్యారెక్టర్లకి న్యాయం చేశారు. ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే మ్యూజిక్ కొన్ని చోట్ల బాగానే ఉంది, కొన్ని పాటలు బాగున్నాయి. కానీ పూర్తి స్థాయి ఎమోషన్స్ క్యారీ చేయడానికి మాత్రం ఉపయోగపడలేదు. ఇక ఎడిటింగ్ విషయంలో కూడా మరికొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా ఉంది. చిన్న సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించినట్లు అనిపించింది.
ఫైనల్లీ: సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి నచ్చే సినిమా ఇది.