NTV Telugu Site icon

Citadel Honey Bunny Review: సిటాడెల్: హనీ బన్నీ రివ్యూ.. సమంత స్పై థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Citadel

Citadel

సమంత స్క్రీన్ మీద కనపడి చాలా కాలమే అయింది. ఆమె అమెజాన్ కోసం సిటాడెల్ హనీ బన్నీ అనే ఒక సిరీస్ చేసింది. ఫ్యామిలీ మెన్ సిరీస్ సృష్టికర్తలు రాజ్ డీకే దర్శకత్వంలోనే ఈ సిరీస్ కూడా తెరకెక్కింది. ఈ దర్శక ద్వయంలో రాజ్ తో సమంత ప్రేమ పెళ్లి వార్తల నేపథ్యంలో ఈ సిరీస్ మీద ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి ఉండనే ఉంది. అయితే ఈ సిరీస్ కి పెద్దగా ప్రమోషన్స్ తెలుగులో చేయలేదు బాలీవుడ్ ప్రధానంగా ఈ సిరీస్ ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ లో సమంత హీరోయిన్గా నటించింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. 

కథ: హనీ (సమంత) సినిమాల్లో నటించాలనే కోరికతో ముంబయి వచ్చి చిన్నాచితక క్యారెక్టర్లు చేసుకుంటూ బతుకుతూ ఉంటుంది. మరోపక్క బన్నీ (వరుణ్ ధావన్) కూడా సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా ఉంటాడు. ఇద్దరూ సినిమా సెట్స్‌లో పరిచయమై ఒకరికొకరు లవ్‌లో పడతారు. బన్నీ స్టంట్ మాస్టర్‌ అయినా బాబా అలియాస్ గురు (కేకే మీనన్) స్థాపించిన ప్రైవేట్ ఎజెంట్స్ సంస్థలో నమ్మకమైన ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. హనీ కూడా ఒకానొక సందర్భంలో అదే సంస్థలో ఏజెంట్‌గా చేరుతుంది. ఇక బాబా శత్రువుగా భావించే సిటాడెల్ (రక్షణ సంస్థ) ప్రాజెక్ట్ తల్వార్‌ అనే మిషన్‌ని తెరపైకి తెస్తుంది. ఈ మిషన్‌ పూర్తి కాకుండా బాబా తన టీమ్‌లోని హనీ, బన్నీతో పాటు కేడీ (సాకిబ్ సలీమ్)తో కలిసి ఒక స్కెచ్ వేస్తాడు. ఈ క్రమంలో అసలు బాబా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?  హనీ ట్రాప్ చేయాల్సిన హనీ మనసు ఎందుకు మార్చుకుంది? సిటాడెల్‌కి హనీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అనేది సిరీస్‌ను చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ: నిజానికి కథగా చూసుకుంటే ఇదేదో కొత్త కథ అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే గతంలో మనం చూసిన ఎన్నో డిటెక్టివ్ థ్రిల్లర్స్ లాగానే ఈ సిరీస్ కూడా అనిపిస్తుంది. అయితే దాన్ని కాస్త భిన్నంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా చెప్పడంలో రాజ్ అండ్ డీకే టీం బాగానే కష్టపడ్డట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లకు భిన్నంగా ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ను రెండు భాగాలుగా విభజించారు. అందులో ఒకటి 90స్ లో జరుగుతున్నట్టు చూపిస్తే మరొకటి 2000 సంవత్సరంలో జరుగుతున్నట్టు చూపిస్తూ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో బండి నడిపించారు. ప్రస్తుతం జరిగే కథ అందులో పాత్రలకు 92లో జరిగే ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి కన్ఫ్యూజన్ లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే నిజానికి సిరీస్ కావడంతో ఎక్కువగా కీలక పాత్రలను పరిచయం చేస్తూ వారి నేపథ్యాన్ని వివరిస్తూ వారి క్యారెక్టర్ లని ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా కాలం తీసుకోవడంతో మనకు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకానొకప్పుడు ఇండియాలో ఎంతో ఇబ్బంది పెట్టిన చాలా అంశాలను ప్రస్తావించారు కానీ వాటికి సరైన ఎమోషన్ పండలేదు. మూడో ఎపిసోడ్ నుంచి కథలో ఆసక్తి పెరుగుతుంది. అయితే నిజానికి ఇది ఒక రకమైన యాక్షన్ థ్రిల్లర్ గా ముందు నుంచి చెబుతూ వచ్చారు కానీ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమీ కనిపించవు. ఒకరకంగా చెప్పాలంటే పెద్దగా ట్విస్టులు ఉండవు మనం ఊహకు తగ్గట్టుగానే ఉంటాయి అయితే చేజ్ సీక్వెన్స్లు ఫైట్ సీక్వెన్స్ లు మాత్రం రొటీన్ అనిపిస్తాయి. సమంత, వరుణ్ ధావన్ రొమాన్స్ మాత్రం కాస్త హద్దులు దాటింది అని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే బన్నీ పాత్రలో వరుణ్ ధావన్ హనీ పాత్రలో సమంత తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇద్దరికీ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. సమంత అయితే ముఖ్యంగా నటన విషయంలోనే కాదు యాక్షన్ సీక్వెన్స్ల విషయంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టు నటించింది. ఇక కేకే మీనన్, సిమ్రాన్ అలాగే బన్నీ టీంలో నటించిన మిగతా నటీనటులు ఆసక్తికరమైన నటన కనపరిచారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఎక్కడ వంక పెట్టడానికి వీలు లేకుండా ఉంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తీసుకోవడం ప్రేక్షకులకు కాస్త ఆసక్తి కలిగించే అంశం. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా ట్రిమ్ చేసి ఉండొచ్చు. సినిమాటోగ్రఫీ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సిరీస్ ని ముందుకు నడిపించడానికి బాగా ఉపయోగపడింది.

ఫైనల్లీ ఈ సిరీస్ ను ఎలాంటి అంచనాలు లేకుండా సమంత కోసం అయితే ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే పెద్దగా ఎక్సైట్ చేసే సన్నివేశాలు అయితే ఏమీ లేవు.

Show comments