Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Anukoni Prayanam Telugu Review

Anukoni Prayanam Telugu Review : అనుకోని ప్రయాణం

Published Date :October 28, 2022 , 1:58 pm
By Subbarao N
Anukoni Prayanam Telugu Review :  అనుకోని ప్రయాణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 2.25 / 5

  • MAIN CAST: Rajendra Prasad, Prema, Tulasi, Narasimha Raju, Prabhas Sreenu, Subhalekha Sudhakar , Ravi Babu,
  • DIRECTOR: Venkatesh Pediredla
  • MUSIC: S Siva Dinavahi
  • PRODUCER: Dr Jagan Mohan D Y

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరో నుండి ‘ఆ నలుగురు’ తర్వాత ట్రాక్ మార్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు చేస్తూ, కథాబలం ఉన్న సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలా ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఓనమాలు’, ‘టామి’ వంటి చిత్రాలను చేసిన ఆయన లేటెస్ట్ మూవీ ‘అనుకోని ప్రయాణం’ శుక్రవారం విడుదలైంది. సీనియర్ నటుడు నరసింహరాజు సైతం ఇందులో కీలక పాత్ర పోషించడం విశేషం. డాక్టర్ డీవై జగన్ మోహన్ కథను అందించి, నిర్మించిన ఈ మూవీని వెంకటేశ్ పెదిరెడ్ల డైరెక్ట్ చేశారు.

ఇది రెండేళ్ళ క్రితం కథ. సరిగ్గా జనతా కర్ఫ్యూ పెట్టడానికి మూడు రోజుల ముందు మొదలయ్యే కథ. రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు భువనేశ్వర్ లో ఓ కాంట్రాక్టర్ దగ్గర రోజు కూలీలుగా పని చేస్తుంటారు. అక్కడ తెలుగు వాళ్ళైన కూలీలు చాలామందే ఉంటారు. కుటుంబాలకు దూరంగా ఉండే ఆ కూలీలంతా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసి మెలిసి జీవిస్తుంటారు. ఇంతలో కరోనా కేసులు పెరిగిపోవడంతో కొద్ది రోజుల పాటు కన్ స్ట్రక్షన్ పనికి ఫుల్ స్టాప్ పెట్టి, కూలీలందరినీ సొంత వూళ్ళకు పంపేస్తారు. రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు సైతం తమ ఊళ్ళకు బయలు దేరతారు. పెళ్ళి పెటాకులు లేని రాజేంద్ర ప్రసాద్ ను కూడా తన ఊరికే రమ్మని నరసింహరాజు ఒత్తిడి చేస్తాడు. ముందు ససేమిరా అన్నా… తర్వాత అతనూ మనసు మార్చుకుని రాజమండ్రి సమీపంలోని నరసింహారాజు ఊరికి బయలుదేరతాడు. ఇంతలో ఊహించని విధంగా మార్గం మధ్యలో రాజు గుండెపోటుతో చనిపోతాడు. అతని చివరి కోరికను నెరవేర్చడానికి ఆ శవాన్ని తీసుకుని రాజేంద్ర ప్రసాద్ రాజమండ్రికి బయలుదేరతాడు. దేశ వ్యాప్తంగా కర్ప్యూ విధించిన ఆ సమయంలో ఈ ‘అనుకోని ప్రయాణం’లో అతను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? చివరకు ఆ గ్రామానికి ఎలా చేరాడు? కరోనా నేపథ్యంలో ఆ గ్రామస్తులు ఎలా స్పందించారు? అనేది మిగతా కథ.

కరోనా సమయంలోని అనుభవాలను నిర్మాత డాక్టర్ జగన్ మోహన్ ఓ కథగా మలుచుకుని ఈ సినిమా నిర్మించారు. దాంతో చాలా సంఘటనలు మన కళ్ళ ముందు జరిగిన, మన అనుభవంలోకి వచ్చినవి గానే ఉంటాయి. పైగా కరోనా కాలంలో ప్రజలు పడిన ఇబ్బందులు, వలస కూలీలు ఎదుర్కొన్న సమస్యలు తెలిసిన వారు ఈ మూవీతో బాగానే కనెక్ట్ అవుతారు. అయితే… ఓ శవాన్ని తీసుకుని భువనేశ్వర్ నుండి రాజమండ్రి చేరే క్రమంలో కథానాయకుడికి తారసపడి వ్యక్తులు, వారి ప్రవర్తన, దాని పర్యవసానం అనేది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేదిగా ఉంది.

చావు పుట్టుకలను పెద్దంతగా పట్టించుకోని రాజేంద్ర ప్రసాద్ ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ప్రవర్తించడంతో అతని క్యారెక్టరైజేషన్ పలచబడిపోయింది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ రకరకాల పాత్రలు వస్తూ వెళుతూ ఉంటాయి. అందరూ కొద్దోగొప్పో గుర్తింపు ఉన్న నటీనటులే! కానీ వాళ్ళను సక్రమంగా దర్శకుడు ఉపయోగించుకోలేదు. పేరుకు బోలెడుమంది నటించినా… ఏ పాత్ర కూడా ప్రేక్షకుల హృదయాలపై బలమైన ముద్రను వేయదు. రాజేంద్ర ప్రసాద్… తన ఫ్రెండ్ శవాన్ని వీపు మీద పెట్టుకుని మైళ్ళ కొద్దీ నడుస్తూ ఉంటే… ఆ బరువును థియేటర్ లోని ప్రేక్షకుడు ఫీలవుతుంటాడు. అంత భారంగా ఈ కథ సాగుతుంది. మధ్య మధ్యలో రాజేంద్ర ప్రసాద్ మార్క్ కామెడీని చొప్పించే ప్రయత్నం చేసినా… ప్రేక్షకులు దాన్ని ఆస్వాదించలేని పరిస్థితి. కరోనా సమయంలో తల్లిదండ్రుల శవాలను దహనం చేయడానికే కొడుకులు వెనకాడిన పరిస్థితి. ఆ టైమ్ లో ఊరికి స్నేహితుడి శవాన్ని నానా కష్టాలు పడి తీసుకొచ్చి…. జనం దాన్ని పట్టించుకోలేదని రాజేంద్ర ప్రసాద్ పాత్ర మొత్తుకోవడంలో అర్థం లేదనిపిస్తుంది! సినిమా మొత్తంగా సాగే ఈ శవయాత్రను భరించడం కష్టమే!

ఈ కాన్సెప్ట్ నచ్చి రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు, నారాయణరావు, ‘శుభలేఖ’ సుధాకర్, తులసి వంటి నటీనటుల ఇందులో నటించారు. కానీ వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరు చందాన మారిపోయింది. కాస్తంత గ్యాప్ తర్వాత టాలీవుడ్ లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన ప్రేమ పాత్ర కూడా ఏమంత గొప్పగా లేదు! అయితే.. ఎస్. శివ దినవహి సమకూర్చిన బాణీలు, వాటి సాహిత్యం సన్నివేశాలకు అనుగుణంగా ఉండి ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు. అక్కడక్కడ వారి మెరుపులు కనిపించాయి. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ఓటీటీలకు ఓకే గానీ… థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించడం కష్టం.

రేటింగ్ : 2.25 /5

ప్ల‌స్ పాయింట్స్:
పేరున్న నటీనటులు ఉండటం
చెప్పాలనుకున్న పాయింట్
శివ దినవహి సంగీతం

మైనెస్ పాయింట్స్:
ఆకట్టుకోని కథనం
నీరసం తెప్పించే సన్నివేశాలు
మూవీ రన్ టైమ్

ట్యాగ్ లైన్: శవయాత్ర!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Narasimha Raju
  • Prabhas Sreenu
  • prema
  • rajendra prasad
  • Ravi Babu

తాజావార్తలు

  • Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్..

  • Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్‌పైరీ డేట్ వస్తువుల సరఫరా..!

  • Tamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం..

  • KKR vs RR: రాజస్థాన్ పై విరుచుకుపడిన స్పిన్నర్లు.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

  • CSK: సీఎస్‌కు బిగ్ షాక్.. టీమ్ నుంచి మరో బిగ్ ప్లేయర్ ఔట్..

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions