KKR vs RR: రాజస్థాన్ పై విరుచుకుపడిన స్పిన్నర్లు.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 లో భాగంగా 28వ మ్యాచ్ ఈరోజు, ఆదివారం, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల నష్టానికి 155 పరుగులు సాధించింది. కోల్ కతాకు 156 పరుగుల టార్గెట్ ను ఫిక్స్ చేసింది. కోల్ కతా స్పిన్నర్లు రాజస్థాన్ పై విరుచుకుపడడంతో భారీ స్కోర్ కు బ్రేక్ పడినట్లైంది.
Also Read:Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ప్రారంభించారు. ఇద్దరూ నిలకడగా ఆడుతూ ఆరో ఓవర్‌లో జట్టు స్కోరును 50 దాటించారు. తొమ్మిదో ఓవర్‌లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కోల్పోవడంతో రాజస్థాన్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. వరుణ్ తన స్పిన్‌తో వైభవ్‌ను బోల్తా కొట్టించడంతో, 28 బంతుల్లో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ తర్వాత వరుణ్ చక్రవర్తి, ధ్రువ్ జూరెల్‌ను ఔట్ చేశాడు. జూరెల్ 5 పరుగులకే ఔటయ్యాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు.
కెప్టెన్ రియాన్ పరాగ్ 12 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటవడంతో నాలుగో వికెట్‌ను కోల్పోయింది. సునీల్ నరైన్, డోనవన్ ఫెరీరాను 7 పరుగుల వద్ద ఔట్ చేశాడు. కార్తిక్ త్యాగి, రవీంద్ర జడేజాను 9 పరుగుల వద్ద ఔట్ చేశాడు. కార్తి త్యాగి బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మయర్ 15 పరుగుల వద్ద ఔటయ్యాడు. కార్తిక్ త్యాగి ఒకే ఓవర్‌లో రవీంద్ర జడేజా, షిమ్రాన్ హెట్మెయర్, రవి బిష్ణోయ్‌లను ఔట్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. బిష్ణోయ్ ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!