Anakapalli Movie Review: అనకాపల్లి మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప, ఇంద్రజ, త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు
- DIRECTOR: ఖగేష్
- MUSIC:
- PRODUCER: కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మూవీ ‘అనకాపల్లి’. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాతలు రూపొందించిన ఈ సినిమాతో ఖగేష్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీని అక్టోబర్ 2న విడుదల చేశారు. మరి ఈ సినిమా ఆడియెన్స్‌ని ఏ మేరకు మెప్పించింది? అన్నది ఓ సారి రివ్యూలో చూద్దాం.
అనకాపల్లి కథ
అనకాపల్లిలో బుల్లెట్ (తారక్ పొన్నప్ప) ఎదురులేని రౌడీగా ముద్ర వేసుకుంటాడు. స్థానిక డ్రగ్ వ్యాపారి నాయుడు (కాండ్రేగుల నాయుడు)తో అతడికి ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. అదే ఊరిలో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా నిజాయితీగా బతికే సాంబశివరావు (త్రినాథరావు నక్కిన) కొడుకు సూర్య (విక్రమ్ సహిదేవ్) తండ్రి సాదాసీదా మధ్యతరగతి జీవన విధానం నచ్చక డాన్ బుల్లెట్ ను చూసి ముచ్చటపడి అతని గ్యాంగ్‌లో చేరుతాడు. అనతికాలంలోనే బుల్లెట్‌కు కుడిభుజంగా ఎదుగుతాడు. మరోవైపు విద్యుత్ మీటర్ సమస్య పరిష్కరించే క్రమంలో పరిచయమైన అమృత (సంధ్య వశిష్ట)తో సూర్య పీకల్లోతు ప్రేమలో పడతాడు. అయితే, కథ మలుపు తిరిగే సమయంలో తాను ఆరాధించే నాయకుడు బుల్లెట్, తాను ప్రాణంగా భావించిన అమృత మధ్య ఉన్న సంబంధం సూర్య కంటపడుతుంది. అమృత బుల్లెట్‌కు ఎందుకు దగ్గరైంది? వారి బంధం వెనుక ఉన్న అసలు నిజమేమిటి? ఆ తర్వాత సూర్య ఎం చేశాడు? అతని తల్లి జయంతి (ఇంద్రజ), స్థానిక ఎమ్మెల్యే (శ్రీనివాస్ వడ్లమాని) పాత్రలు ఈ కథను ఏ మలుపులు తిప్పాయి అనేదే మిగిలిన కథ.
Also Read
కథనం
తప్పుడు మార్గం ఎంచుకున్న ఒక యువకుడి జీవితం ఎలా పతనమవుతుంది, కక్షలు-కార్పణ్యాల మధ్య నలిగే తల్లిదండ్రుల వేదన, అలాగే నిజమైన ప్రేమకు, తాత్కాలిక ఆకర్షణకు మధ్య ఉండే తేడాను దర్శకుడు ఖగేష్ ఇందులో చొప్పించే ప్రయత్నం చేశారు. త్రినాథరావు నక్కిన అందించిన కథలో బలమైన ఎమోషన్స్ ఉన్నప్పటికీ, కథనంలో వేగం హెచ్చుతగ్గులకు లోనైంది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ భాగం రౌడీయిజం, ముఠా గొడవలు, హీరో గ్యాంగ్‌లో బలపడటం, రొటీన్ లవ్ ట్రాక్‌లతో రొటీన్‌గా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ వద్ద ఇచ్చే అనూహ్యమైన ట్విస్ట్ సినిమాపై కాస్త ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ త్రం పగ, ప్రతీకారం, భావోద్వేగాల మేళవింపుతో సాగుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా రాసుకున్నారు. సాధారణంగా ముగిసిపోతుందని భావించే క్షణంలో క్లైమాక్స్‌ను డిజైన్ చేసిన తీరు, చివర్లో ఇచ్చిన ముగింపు ఆకట్టుకుంటాయి.
నటీనటుల విషయానికి వస్తే విక్రమ్ సహిదేవ్ సూర్యగా విభిన్న కోణాలున్న పాత్రలో మెప్పించారు. ఆవేశం, యాక్షన్, ప్రేమ, నైరాశ్యం వంటి భావోద్వేగాలను బాగా పండించారు. కొన్ని క్లిష్టమైన సన్నివేశాల్లో మరింత పరిణితి కనబరిస్తే బాగుండేది. తారక్ పొన్నప్ప బుల్లెట్ పాత్రలో తన క్రూరమైన నటన, బాడీ లాంగ్వేజ్‌తో తెరపై భయపెట్టే విలనిజాన్ని సమర్థవంతంగా ప్రదర్శించారు. సంధ్య వశిష్ట అమృతగా నేటివిటీ ఉట్టిపడేలా చాలా సహజంగా నటించి మెప్పించారు. మధ్యతరగతి తల్లిదండ్రులుగా ఇంద్రజ, త్రినాథరావు నక్కినల నటన హుందాగా ఉండి సహజత్వాన్ని తెచ్చింది. డ్రగ్ వ్యాపారిగా కాండ్రేగుల నాయుడు, అలాగే ఎమ్మెల్యే, పోలీస్ ఆఫీసర్ పాత్రధారులు తమ పరిధి మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం సాంకేతిక విలువల రూపకల్పన. అనకాపల్లి నేటివిటీని తెరపైకి తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే కాస్ట్యూమ్స్ డిజైనింగ్ కథకు తగిన మూడ్‌ను అందించాయి. సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాలలోని బాధను, తీవ్రతను ఎలివేట్ చేయడంలో తోడ్పడ్డాయి. నూతన నిర్మాణ సంస్థ అయినప్పటికీ, నిర్మాతలు కథావసరానికి ఏమాత్రం తగ్గకుండా ఖర్చుపెట్టిన వైనం తెరపై స్పష్టంగా ప్రతిబింబించింది. నెమ్మదిగా సాగే కథనం, అంచనాలకు అందే కొన్ని రొటీన్ అంశాలు ఉన్నప్పటికీ, రా అండ్ రస్టిక్ తరహా క్రైమ్ డ్రామాలను, తీవ్ర భావోద్వేగాలతో కూడిన ముగింపులను ఇష్టపడే ప్రేక్షకులకు ‘అనకాపల్లి’ వన్ టైం వాచ్.
ఫైనల్లీ ఈ అనకాపల్లి రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ
తాజావార్తలు
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!