2018 Movie Review : 2018 సినిమా రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Tovino Thomas, Lal, Narain, Aparna Balamurali, Kalayirasan, Aju Varghese, Vineeth Sreenivasan, Kunchacko Boban
- DIRECTOR: Jude Anthany Joseph
- MUSIC: Nobin Paul
- PRODUCER: Venu Kunnappilly, CK Padma Kumar and Anto Joseph
2018 Movie Review : తక్కువ బడ్జెట్ తో నిర్మితమై మళయాలంలో ఏకంగా దాదాపు 150కోట్లు కొల్లగొట్టిన సినిమా ‘2018’. ఇందులో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కథ ఏంటి ఎలా ఉందో ఓ సారి చూద్దాం..
కథ:
2018లో కేరళలో 1924 తర్వాత వందేళ్లలో ఎప్పుడూ లేనంత వరదలు వస్తాయి. ఆ వరద బీభత్సం కథాంశంలో తెరకెక్కిన సినిమా 2018. ఇందులో ఒకరి పాత్ర అంటే ఉండదు. ప్రతి ఒక్కరు హీరోలాగే కనిసిస్తారు. అనూప్ (టొవినో థామస్) ఒక మాజీ సైనికుడు, మరణ భయంతో సైన్యం నుండి వైదొలిగాడు. మథాచన్ (లాల్), అతని కుమారుడు విన్‌స్టన్ (నరేన్) చేపలు పట్టడం ద్వారా జీవనోపాధి పొందుతుండగా, కోషి (అజు వర్గీస్) పర్యాటకుల కోసం టాక్సీ నడుపుతాడు. దుబాయ్‌లో ఐటీ ఉద్యోగి రమేష్ (వినీత్ శ్రీనివాసన్) భారతదేశంలోని తన భార్యతో సంబంధాల సమస్యలను ఎదుర్కొంటాడు. తమిళనాడుకు చెందిన సేతుపతి (కళైరాసన్) ట్రక్ డ్రైవర్‌గా పేలుడు పదార్థాలను కేరళకు రవాణా చేయడానికి అంగీకరిస్తాడు. ఇలా పలువురు ఈ కేరళ వరదల్లో చిక్కుకుంటారు. వీరంతా వరద బీభత్సం నుంచి ఎలా ప్రాణాలతో బయటపడ్డారు అనేదే సినిమా కథ..
Also Read
ప్లస్ పాయింట్లు:
ఈ చిత్రం కథ చాలా సాదాసీదాగా ఉంది, పెద్ద మలుపులు లేవు, కానీ పాత్రలు మరియు కథనం దానిని బాగా ఎలివేట్ చేస్తాయి. కొన్ని చిత్రాలు పాత్రలతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆ కోవకు చెందినదే ‘2018’ చిత్రం. ఈ సినిమా డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ హృదయాన్ని హత్తుకునేలా కథాంశాన్ని రూపొందించాడు. ఫస్ట్ హాఫ్‌లో కాస్తంత ప్రేక్షకులను పాత్రలు తికమక పెట్టినా, సెకండాఫ్‌లో దర్శకుడి ఉద్దేశం స్పష్టంగా ఆవిష్కృతమైంది. అతను కథను ఆకర్షణీయంగా మలిచాడు. భావోద్వేగాల చిత్రీకరణ బాగుంది. చూసిన వారంతా తమకే జరిగిందేమో అనేలా ఫీల్ అవుతున్నారు. టోవినో థామస్‌కు ఈ చిత్రం ద్వారా ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా రెండు మూడు సన్నివేశాలు అయితే మనసుకు హత్తుకుంటాయి. సెకండ్ హాఫ్ లో హీరో ఒక కుటుంబాన్ని కాపాడే సన్నివేశం.. ప్రజలను కాపాడడానికి మత్స్యకారులు బోట్లు తీసుకొచ్చే సన్నివేశం.. 2018 సినిమాకు ప్రేక్షకులు ఎందుకంత కనెక్ట్ అవుతున్నారో ఈ సీన్స్ చూస్తే అర్థమవుతుంది. హ్యూమన్ ఎమోషన్స్ కు దర్శకుడు పెద్దపీట వేశాడు. ప్రతి ఒక్క సన్నివేశం ఒళ్ళు గగ్గుర పొడిచే విధంగా ఉంటుంది. చివరి అరగంట అద్భుతంగా ఉంటుంది.
మైనస్ పాయింట్లు:
‘2018’సినిమాలో కేరళ వరదల క్లిష్ట సమయాల్లో ప్రభుత్వం, మీడియా పాత్ర గురించి ఇది చాలా తక్కువ చూపించారు. దర్శకుడు ప్రధాన కథాంశం కంటే పాత్రలు , వారి సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల సినిమా మొదటి సగం ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తుంది.
సాంకేతిక అంశాలు:
జూడ్ ఆంథోనీ జోసెఫ్ ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ఇబ్బందులను వాస్తవ ధృక్పథంతో కళ్లకు కట్టినట్టు చిత్రీకరించినందుకు మెచ్చుకోవాలి. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రజల భావోద్వేగాలను చూపించిన తీరులో ఆయన స్క్రీన్‌ప్లే బాగా పండింది. ఈ చిత్రం సాంకేతిక అద్భుతం అని చెప్పాలి. స్వరకర్త నోబిన్ పాల్, సినిమాటోగ్రాఫర్ అఖిల్ జార్జ్ మొత్తం ప్రొడక్షన్ డిజైన్ టీమ్ అద్భుతం. చమన్ చక్కో ఎడిటింగ్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, వీఎఫ్‌ఎక్స్ వర్క్ థ్రిల్లింగ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. తెలుగు డబ్బింగ్ ఫర్వాలేదు
ట్యాగ్ లైన్ : ఎమోషన్స్ రేకెత్తిస్తూ ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేసే సినిమా
తాజావార్తలు
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!