కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను వెండితెరపై ఆవిష్కరించాలని చాలామంది దర్శకులు ఎంతో కాలంగా కలలు కంటున్నారు. అయితే.. దాన్ని సాకారం చేసుకుంటోంది మాత్రం ప్రముఖ దర్శకుడు మణిరత్నమే. ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తొలిభాగానికి సంబంధించిన నయా పోస్టర్ ను సోమవారం విడుదల…