కెన్యా నుండి వచ్చిన 22 ఏళ్ల మహిళమూడు నెలలుగా కొనసాగుతున్న ఎడమ ప్రక్క నొప్పితో పేస్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ బ్రాంచ్‌ను ఆశ్రయించారు. పేషెంట్‌కు చేసిన పరిశీలనల్లో, ముఖ్యంగా CT-KUB స్కాన్‌లో, ఎడమ మూత్రపిండంలో సుమారు1.5 సెం.మీ పరిమాణంలో రాయిఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల పేషెంట్‌కు రోజువారీ జీవనంలో తీవ్రమైన అసౌకర్యం ఏర్పడిందని వైద్యులు తెలిపారు.పేషెంట్ పరిస్థితిని విశ్లేషించిన పేస్ హాస్పిటల్స్ యూరాలజీ విభాగం,సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు&రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ విశ్వంభర్ నాథ్ గారి…