Padmam Silver Jewellery: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా లలో పలు ప్రదేశాలలో తమ శాఖలు నిర్వహిస్తున్న పద్మం సిల్వర్ జ్యువలరీ వారు తమ 11వ శాఖను కరెంట్ ఆఫీస్ ఎదురుగా శ్రీకాకుళం లో ఈ రోజు కుమారి రితికా నాయక్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రితికా నాయక్ మాట్లాడుతూ.. పద్మం సిల్వర్ జ్యువలరీ వారి 11వ శాఖను, శ్రీకాకుళం లో తాను ఈ రోజు ప్రారంభించడం చాల ఆనందంగా ఉందన్నారు. మాల్ లో ఉన్న అన్ని రకాల ఆభరణాలను పరిశీలించి తమకు చాలా నచ్చాయి అన్నారు. ప్రారంభోత్సవ సందర్భంగా స్టోర్ వారు అద్భుతమైన ఆఫర్లుగా ఒక లక్ష రూపాయల కొనుగోలు పై యాభై వేల రూపాయల సిల్వర్ నగలు ఉచితంగాను, యాభై వేల రూపాయల కొనుగోలు పై ఇరవై ఐదు వేల రూపాయల సిల్వర్ నగలు ఉచితంగా, ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలు పై పన్నెండు వేల ఐదు వందల సిల్వర్ నగలు ఉచితంగా అందించడం ఎంతో అభినందనీయం అన్నారు. ఇప్పుడు సిల్వర్ జ్యువలరీ చాలా మంది కొనుగోలు చేస్తున్నారని, తనకు కూడా సిల్వర్ జ్యువలరీ లో తనకు ట్రెడిషనల్ అండ్ మోడరన్ రెండు ఇష్టమేనని, కొనుగోలు చేసానని తెలియచేసారు.
CMR గ్రూప్ సంస్థల అధినేత శ్రీ మావూరి వెంకట రమణ మాట్లాడుతూ, సిల్వర్ జ్యువలరీ కి కూడా చాలా డిమాండ్ పెరిగిందని, పద్మం సిల్వర్ జ్యువలరీలో సీజెడ్ జ్యువలరీ, టెంపుల్ జ్యువలరీ, యాంటిక్ జ్యువలరీ, విక్టోరియా కలెక్షన్, కుందన్ కలెక్షన్, మోజో నైట్ కలెక్షన్ వంటి విభిన్న ఆభరణాలతో పాటు, అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయని తెలియచేసారు.