NTV Telugu Site icon

Oasis Fertility: ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్ 15 వార్షికోత్సవంలో సినీ నటి రమ్యకృష్ణ.. స్కాలర్ షిప్స్ అందజేత

Osis

Osis

Oasis Fertility: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హయత్ ప్లేస్ లో హెల్త్ కేర్ రంగంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అర్హులైన 10 మంది పిల్లలకు ముఖ్య అతిధి రమ్యకృష్ణ స్కాలర్ షిప్ సర్టిఫికెట్లను అందజేసింది. ప్రతిభ, అంకితభావాన్ని ప్రదర్శించే పిల్లలకు మద్దతునివ్వడానికి ఈ సంస్థ చేసిన ప్రయత్నం హైలైట్ గా నిలిచింది. 95,000 మందికి పైగా జంటలు తాము తల్లిదండ్రులు అవ్వాలనే కలను సాకారం చేసుకోవడానికి సహాయపడే ప్రయాణంలో.. ఒయాసిస్ ఫెర్టిలిటీ వైద్యంలో నిరంతరం కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. కాపా ఇన్ విట్రో మెచ్యూరేషన్ (ఐఏఎమ్), అధునాతన జన్యు పరీక్షతో సహా భారతదేశంలో మార్గదర్శకమైన కొత్త ఆవిష్కరణలకు ప్రసిద్ది చెందిన ఈ సంస్థ ఫెర్టిలిటీ చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read Also: Adani- Congress: అమెరికాలో అదానీపై కేసు.. జేపీసీకి కాంగ్రెస్ డిమాండ్

కాగా, ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ డాక్టర్ దుర్గా జీ రావు, నటి రమ్యకృష్ణతో ఐఏఎఫ్ గురించి అపోహలు, ఫెర్టిలిటీ వైద్యంలో శాస్త్రీయ పురోగతి, విజయావకాశాలు ఎక్కువగా ఉండటానికి సాంకేతికతలపై, భారతీయ సంతానోత్పత్తి యొక్క మారుతున్న పద్ధతి, వంధ్యత్వం నిషేధం, అందులో పురుషుల పాత్ర, వాటిని ఒయాసిస్ ఎలా మారుస్తోందో తెలిపారు. ఇక, సంతానోత్పత్తి సంరక్షణ అవసరమైన వారికి ఆరోగ్యకరమైన పిల్లలను ప్రసవించడంలో ఎలా సహాయపడింది. పరిష్కారాల కోసం ఒయాసిస్ లాంటి ఫెర్టిలిటి క్లినిక్ కు రావడం గురించి దంపతులు ఎప్పుడు ఆలోచించాలనే విషయాలపై ఫైర్ సైడ్ చాట్ చేశారు.

Read Also: CV Anand: పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిది..

ఈ కార్యక్రమంలో ఒయాసిస్ ఫౌండర్ అండ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జీ రావు మాట్లాడుతూ.. ఫెర్టిలిటీ సైన్స్ లో గత 15 సంవత్సరాలలో సంస్థ యొక్క పురోగతి గురించి మాట్లాడారు. 15 ఏళ్ల క్రితం సంతానోత్పత్తి చికిత్సలు తప్పుగా భావించబడేవి.. రహస్యంగా ఉండేవి.. ఈ రోజు, సైన్స్ మనకు 1,00,000 కంటే ఎక్కువ విజయవంతమైన ఆరోగ్యకరమైన జననాలను సృష్టించడానికి వీలు కల్పించింది.. వారి కలలను మాకు అప్పగించి వాటిని నిజం చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన కుటుంబాలకు మేము కృతజ్ఞులమని చెప్పారు. ఈ వేడుక మా గత విజయాలకు ప్రతిబింబం మాత్రమే కాదు.. ఫెర్టిలిటీ వైద్యంలో సరిహద్దులను దాటి ముందుకు కొనసాగించడానికి మేము తీసుకున్న ప్రతిజ్ఞ.. ఒయాసిస్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల ద్వారా మాకు మద్దతు ఇచ్చిన సమాజానికి ఒక చిన్న కానుకని అందిస్తున్నామన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ చిన్నారులు.. సమాజంపై సృష్టించే ప్రభావం కోసం మేము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామన్నారు.

Read Also: Indian Railways: నవంబర్ చివరికి 370 రైళ్లలో 1000 కొత్త జనరల్ కోచ్‌లు

ఇక, ముఖ్య అతిథి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ఒయాసిస్ ఫెర్టిలిటీ యొక్క ఈ వేడుకలో భాగమైనందుకు నేను సంతోషంగా ఉన్నాను.. ఈ పిల్లల టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నాను.. ఈ యువ గ్రహీతల అంకితభావానికి నేను నిజంగా ప్రేరణ పొందాను.. భవిష్యత్తులో ఆయా రంగాలలో వారు చేయబోయే సేవల కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. అలాగే, భారతదేశానికి ఇలాంటి పిల్లలు అవసరం.. వారు ఎంచుకున్న రంగాలలో రాణించే ప్రతిభావంతులైన పిల్లలు అవసరం ఉంది.. ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్స్ ద్వారా వారి వద్దకి వచ్చే ప్రతి జంటకు మాతృత్యాన్ని సాకారం చేస్తోంది.

Read Also: Indian Railways: నవంబర్ చివరికి 370 రైళ్లలో 1000 కొత్త జనరల్ కోచ్‌లు

అలాగే, ఈ యువ ప్రతిభావంతులకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం.. వారి గొప్ప భవిష్యత్తును కోరుకుంటున్నామని కో ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గాదెల అన్నారు. ఈ స్కాలర్ షిప్స్ గ్రహీతలు, వారి తల్లిదండ్రులు మా అంబాసిడర్లని మేము నమ్ముతున్నాం.. ఇంత చిన్న వయసులోనే కళలు, క్రీడలు, చదువులు, ఇతర రంగాల్లో ప్రభావం చూపుతున్న ఈ ప్రతిభావంతులైన చిన్నారులను సన్మానించడం గౌరవంగా భావిస్తున్నామని ఒయాసిస్ ఫెర్టిలిటీ సీఈఓ శ్రీ పుష్కరజ్ షెనాయ్ పేర్కొన్నారు.

Read Also: Telangana Olympic: నేడు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు..

అయితే, ఒయాసిస్ సైన్స్ మద్దతు.. వారి శ్రద్ధ, నైపుణ్యంతో చాలా సంవత్సరాల క్రితం మాకు మాతృత్వం అనే బహుమతిని అందించారు. అంతేకాక, ఈ రోజు మా పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో వారు మాకు మద్దతు ఇస్తున్నారు.. ఈ చర్య ఒయాసిస్ కుటుంబంతో మా బంధాన్ని బలోపేతం చేస్తుందని స్కాలర్ షిప్స్ విజేతల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Show comments