Oasis Fertility : కాబోయే తల్లిదండ్రుల కోసం Oasis Fertility కాకినాడలో గ్రాండ్ బేబీ షవర్
- కాబోయే తల్లిదండ్రుల కోసం హృదయపూర్వక బేబీ షవర్
- ఆధునాతన ఫెర్టిలిటీ చికిత్సలతో నమ్మకాన్ని గెలుచుకున్న సంస్థ
- వైద్య నిపుణుల సందేశం: ఆశ, సంరక్షణ, విజ్ఞాన సమన్వయం
- రీప్రొడక్టివ్ హెల్త్‌కేర్‌లో మరింత విస్తరణ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
16 సంవత్సరాల విశ్వాసంతో, భారతదేశంలో ప్రముఖ ఫెర్టిలిటీ సంరక్షణ సంస్థగా నిలిచిన ఒయాసిస్ ఫెర్టిలిటీ, తల్లితండ్రులు అయ్యే ప్రయాణంలో ఉన్న కాబోయే తల్లులు, మరియు వారి జీవిత భాగస్వాముల గౌరవార్థం హృదయపూర్వక బేబీ షవర్ వేడుకను నిర్వహించింది. అమ్మానాన్నలు అయ్యే దిశగా వారి ప్రయాణంలో వారు కనబర్చిన స్థైర్యం, సానుకూలత, మరియు నమ్మకాన్ని అభినందించేందుకు ఈ వేడుక నిర్వహించబడింది.
ఒయాసిస్ ఫెర్టిలిటీ కాకినాడ సెంటర్ ప్రారంభమైనప్పటి నుండి, IUI, IVF, CAPA – IVM, PGT, ERA, TESA వంటి అధునాతన చికిత్స విధానాలతో పాటు మైక్రోఫ్లూయిడిక్స్ వంటి ఆధునిక స్పెర్మ్ సెలెక్షన్ పద్ధతులు, అండం మరియు వీర్యకణాల క్రయోప్రిజర్వేషన్ అలాగే ఫెర్టిలిటీ ని మెరుగుపరిచే శస్త్రచికిత్సల ద్వారా అనేక దంపతుల తల్లిదండ్రులు అవ్వాలనే తమ కలల్ని నెరవేర్చడంలో విజయవంతంగా తోడ్పడింది. PGT వంటి అత్యాధునిక ఫెర్టిలిటీ చికిత్సలను ప్రవేశపెట్టడంతో, ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ ప్రాంతంలో రీప్రొడక్టివ్ హెల్త్‌కేర్ రంగంలో ముందంజలో నిలిచింది. నాణ్యతా ప్రమాణాలు మరియు పేషెంట్ కేర్ లో అత్యుత్తమతకు కట్టుబడి ఉండటంతో, ఈ సెంటర్ వివిధ గుర్తింపులు మరియు ప్రశంసలను అందుకుంది.
Also Read
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
- Padmam Silver Jewellery: అనకాపల్లిలో పద్మం సిల్వర్ జువెలరీ ఘనంగా ప్రారంభం

ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ, కో-ఫౌండర్ మరియు మెడికల్ డైరెక్టర్, డా. దుర్గా జి. రావు, మాట్లాడుతూ, ‘‘ఒయాసిస్ ఫెర్టిలిటీలో ప్రతి విజయం, ఆశ, సంరక్షణ, మరియు నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ దంపతుల అసాధారణ ధైర్యాన్ని, మరియు వారు ఎంతోకాలంగా ఎదురుచూసిన కొత్త ఆరంభాలను సంబరంగా జరుపుకోవడానికే ఈ బేబీ షవర్ వేడుకను నిర్వహిస్తున్నాము. ఫెర్టిలిటీ చికిత్సల సహాయంతో తల్లిదండ్రులుగా మారే అనుభవం ఎంతో ప్రత్యేకమైనది; వారి ఈ ప్రయాణంలో తోడుగా నిలవడం మా భాగ్యంగా భావిస్తున్నాము.” అని అన్నారు.
ఒయాసిస్ ఫెర్టిలిటీ, సీఈఓ, పుష్కరాజ్ షెనాయ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఒకప్పుడు ఎంతో ఆశతో మా వద్దకు వచ్చిన జంటలు నేడు తల్లిదండ్రులుగా మారడం నిజంగా మాకెంతో ఆనందంగా ఉంది. కరుణతో కూడిన వైద్యం మరియు ఆధునిక ఆవిష్కరణలు కలిసి కొత్త జీవితం అందించే ఇన్ ది గుడ్ హ్యాండ్స్ అఫ్ సైన్స్ పై వారి నమ్మకాన్ని సంబరంగా జరుపుకునే వేడుక ఈ బేబీ షవర్. ఒయాసిస్ ఫెర్టిలిటీలో తల్లిదండ్రులు అవ్వాలనే ప్రతి జంట కలను సాకారం చేయడానికి సహానుభూతితో కూడిన ఫెర్టిలిటీ సేవలను అత్యుత్తమ వైద్య నైపుణ్యంతో కలిపి అందించడం కొనసాగిస్తాము.” అని తెలిపారు

ఒయాసిస్ ఫెర్టిలిటీ, కాకినాడ, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, డా. రామినీడి దీప్తి ప్రియదర్శని, ఈ సందర్భంగా మాట్లాడుతూ, “బేబీ షవర్ వంటి సందర్భాలు ఫెర్టిలిటీ సంరక్షణ అనేది కేవలం సైన్స్ లేదా టెక్నాలజీ మాత్రమే కాదని, ఇది ఆనందంతో మరియు ఆశతో నిండిన కొత్త జీవితాలను సృష్టించడం గురించి అని మనకు గుర్తుచేస్తాయి. ఈ బేబీ షవర్ వేడుక ఫెర్టిలిటీ సమస్యలను ధైర్యంగా అధిగమించి, తమ కలలను నిజం చేసుకున్న జంటలను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. నేడు ఇక్కడ వారి ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం మాకందరికీ ఒక గొప్ప బహుమతి’’ అని అన్నారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఒయాసిస్ ఫెర్టిలిటీ శాస్త్రీయ ప్రావీణ్యాన్ని పెంపొందిస్తూ, మరియు కరుణతో కూడిన పేషెంట్-కేంద్రిత సంరక్షణను అందించడం ద్వారా రీప్రొడక్టివ్ హెల్త్‌కేర్ రంగంలో తన ప్రభావాన్ని మరింతగా పెంచడానికి కట్టుబడి ఉంది. సాధించే ప్రతి మైలురాయితో, సంస్థ తన లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, జంటలకు ఆశ, నమ్మకం, అలాగే తల్లిదండ్రులుగా మారాలనే వారి స్వప్నం విశ్వసనీయ చేతుల్లో ఉందనే భరోసాను అందిస్తోంది.
ఒయాసిస్ ఫెర్టిలిటీ గురించి:
2009లో స్థాపించబడిన ఓయాసిస్ ఫెర్టిలిటీ, భారతదేశవ్యాప్తంగా 34 కేంద్రాలతో అగ్రగామి రీప్రొడక్టివ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్. శాస్త్రీయ నైపుణ్యం, నైతిక వైద్యపద్ధతులు, అత్యున్నత IVF విజయశాతాలతో ప్రసిద్ధి చెందిన ఓయాసిస్, ఇన్నాళ్లుగా అనేక కుటుంబాలకు ఆరోగ్యకరమైన బిడ్డలను అందించింది. పురుషులు మరియు మహిళల కోసం IVF, IUI, ICSI, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ వంటి విస్తృత సేవలను ఆధునిక ల్యాబ్ టెక్నాలజీ, వ్యక్తిగత సంరక్షణ, సంపూర్ణ వెల్‌నెస్ సహకారంతో అందిస్తోంది. మరిన్ని వివరాలకు దయచేసి సందర్శించండి: www.oasisindia.in
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!