KONAR-MF: హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ కన్సల్టెంట్ మరియు పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగ అధిపతి డా. నాగేశ్వర రావు కోనేటి, తాను రూపొందించిన వినూత్న పరికరం KONAR-MF™️ (మల్టీఫంక్షనల్) ఆక్లూడర్‌కు యునైటెడ్ స్టేట్స్ పేటెంట్‌ను అందుకున్నారు. ఈ పరికరం పిల్లలు మరియు పెద్దలలో గుండెలోని సెప్టల్ లోపాలను సరిచేయడానికి ఎంతో ఉపయోగపడనుంది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గుర్తింపు:
కోనార్-MF™️ పరికరానికి లభించిన అంతర్జాతీయ గుర్తింపులన్నిటిలో U.S. పేటెంట్ లభించడం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2021 నుండి 2023 మధ్య భారత్, యూరప్ (EC), యూరో-ఆఫ్రికా దేశాలు మరియు దక్షిణ కొరియాలో ఇప్పటికే పేటెంట్లు మంజూరు అయ్యాయి. ఫిబ్రవరి 2023లో భారత పేటెంట్,ఎన్నో కఠినమైన క్లినికల్ మరియు సాంకేతిక పరీక్షల అనంతరం లభించింది, ఇవి ఈ పరికరం యొక్క నాణ్యత, విశ్వసనీయలను చాటిచెబుతున్నాయి.
స్ట్రక్చరల్ హార్ట్ డిఫెక్ట్ క్లోజర్‌లో కొత్త ప్రమాణం:
KONAR-MF™️ ఆక్లూడర్, దీర్ఘకాల క్లినికల్ అవసరాలను పూర్తి చేస్తూ, వివిధ రకాల లోపాలను పరిష్కరించేందుకు అనుకూలమైన చికిత్సా విధానాన్ని అందిస్తుంది. అందులో..
– పెరిమెంబ్రానస్ మరియు మస్కులర్ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్స్ (VSDs)
– శస్త్రచికిత్స అనంతరం మిగిలిన లోపాలు
– కరోనరీ ఆర్టీరియోవీనస్ ఫిస్టులాస్
– ఎంపిక చేసిన ఆర్టోపల్మనరీ విండోస్
– పారావాల్వులర్ లీక్స్
– సిస్టమిక్-టు-పల్మనరీ ఆర్టరీ కొలాటరల్స్ వంటి అనేక సమస్యలను పరిష్కరించేందుకు ఈ పరికరం ఉపకరించనుంది.
కేవలం ఒకే ప్రయోజనం కోసం రూపొందించబడిన సాంప్రదాయ ఆక్లూడర్‌ల వలె కాకుండా, కోనార్-MF™️ అనేక లోపాల యొక్క ఆకృతి మరియు ప్రవాహ ప్రొఫైల్‌కు డైనమిక్‌గా సర్దుబాటు చేస్తుంది, వివిధ శరీర నిర్మాణ దృశ్యాలలోనూ మరింత కచ్చితమైన మరియు సురక్షితమైన అమరికలను చేస్తుంది. ఈ పరికరం సమస్యల ప్రమాదాన్ని తగ్గించి, రోగి త్వరగా కోలుకునేందుకు అవసరమైన ఫలితాలను అందిస్తుంది.
ప్రపంచవ్యాప్త విస్తరణ, స్థానిక ప్రభావం:
కోనార్-MF™️ ఆక్లూడర్ ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా మరియు ఆఫ్రికా అంతటా ఉపయోగంలో ఉంది, దాని భద్రత మరియు ప్రభావాన్ని ధృవీకరిస్తూ 20కి పైగా పీర్-రివ్యూడ్ అధ్యయనాలు ప్రచురించబడ్డాయి. లైఫ్‌టెక్ సైంటిఫిక్ ద్వారా తయారు చేయబడిన దీని ధర భారతదేశంలో కేవలం ₹50,000 కాగా, పాకిస్థాన్‌లో ₹1.2 లక్షలు మరియు ఆసియా, యూరప్‌లోని ఇతర ప్రాంతాలలో ₹2.5–6 లక్షలుగా ఉంది. ఆ ప్రాంతాలతో పోలిస్తే భారత్ లో దీని ధర తక్కువగానే ఉంది. అతి తక్కువ ధరలో లభ్యమయ్యే ఈ పరికరం సహజసిద్ధ గుండె లోపాల భారాన్ని తగ్గించడంలో మరియు చికిత్సను విస్తరించడంలో కీలక సాధనంగా నిలుస్తుంది.
అంతే కాకుండా ఈ KONAR-MF™️ పరికరం వల్ల చికిత్స ఖర్చు గణనీయంగా తగ్గడం ద్వారా పేద మరియు మధ్య-ఆదాయ దేశాలలోని పిల్లలలో సహజసిద్ధ గుండె లోపాల వ్యాధి భారాన్ని తగ్గించే సామర్థ్యాన్ని పరికరం కలిగి ఉంది.
యూఎస్ పేటెంట్ సాధించడం అనేది ఎంతో కఠిన పరీక్షలతో కూడుకున్నది. అందులో భాగంగా గత డేటా ధృవీకరణ మరియు ఇప్పటికే ఉన్న డివైస్‌లు మరియు ప్రచురణల సమీక్షను కలిగి ఉన్న కఠినమైన ప్రక్రియ. 20కి పైగా ప్రచురించబడిన పత్రాలతో, కోనార్ పరికరం ఇప్పుడు FDA ఆమోదం పొందటానికి సిద్దంగా ఉంది. ఇది ఉత్తర అమెరికా అంతటా విస్తృతంగా విస్తరించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ గొప్ప మైలురాయి పరికరం ప్రపంచ వ్యాప్త గుర్తింపును, భద్రత మరియు ప్రభావాన్ని ధృవీకరించడమే కాకుండా, క్లిష్టమైన కేసులలో సానుకూలంగా ఉపయోగంచేందుకు మార్గం చూపనుంది.
ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వర రావు కొనేటి మాట్లాడుతూ, “కోనార్-MF™️ పరికరం యూఎస్ పేటెంట్ సాధించడం నాకు మాత్రమే కాదు, భారతీయ వైజ్ఞానిక శాస్త్రానికి గర్వకారణం. భారత్‌లో రూపొందించిన ఆవిష్కరణలు అత్యున్నత ప్రపంచ ప్రమాణాలను అందుకోగలవని మరియు ప్రపంచవ్యాప్తంగా రోగులకు అవసరమైన వైద్య సేవ చేయగలవని ఇది నమ్మకాన్ని కలిగించింది. ఈ గుర్తింపు పీడియాట్రిక్ కేర్‌లో అందరికీ అందుబాటులో ఉండి మరింత విస్తరింపగలిగే పరిష్కారాల కోసం నిరంతరం పనిచేయడానికి ప్రేరణనిస్తుంది.” అని తెలిపారు.
రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ గురించి:
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ దేశంలోనే అత్యుత్తమ పిల్లల ఆసుపత్రులలో ఒకటిగా గుర్తింపు పొందింది మరియు మహిళలు మరియు పీడియాట్రిక్ కేర్‌లో లీడర్ గా ఉంది. తన సేవలను మరింత విస్తరిస్తూ, ఈ గ్రూప్ ఇప్పుడు రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించింది, ఇది సహజసిద్ధ మరియు ఇతర గుండె సమస్యలతో బాధపడే పిల్లలకు సమగ్ర చికిత్సను అందించే ఒక ప్రత్యేక హార్ట్ సెంటర్. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నైపుణ్యంతో కూడిన కార్డియాక్ నిపుణుల బృందం ద్వారా నడిచే RCHI, మీ బిడ్డకు అత్యుత్తమ చికిత్సను అందిస్తుంది. మరింత సమాచారం కోసం, లాగిన్ అవ్వండి: https://www.rainbowhospitals.in/rchi/
మరింత సమాచారం కోసం సంప్రదించండి:
Media@rainbowhospitals.in
M – +91 – 8978673555