Site icon NTV Telugu

OTR: పవన్‌పై వైసీపీ మాస్టర్ ప్లాన్..!!

Otr

Otr

OTR: ముద్రగడ పద్మనాభం అలియాస్‌ పద్మనాభరెడ్డి. అన్న అడుగేస్తే మాస్‌ అన్నట్టుగా… ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా పొలిటికల్‌ సంచలనం అవుతూనే ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ని గత ఎన్నికల్లో పిఠాపురంలో ఓడిస్తానని శపథం చేసి మరీ షాక్‌ తిన్నారాయన. చివరికి మరో ఛాయిస్‌ లేకుండా అన్న మాట ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. సరే… జరిగిందేదో జరిగిపోయింది…. ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్‌ చేద్దాం…. పవన్‌ మీదికి పద్మనాభాస్త్రాన్ని డైరెక్ట్‌గా, సరికొత్తగా ప్రయోగిద్దామని భావిస్తున్నారట వైసీపీ పెద్దలు. ఇదే ఇప్పుడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో, ప్రత్యేకించి కాపు సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో హాట్‌ టాపిక్‌ అవుతోంది.

గత ఎన్నికల్లో పవన్‌ను ఓడిస్తానని శపథం చేసినా… ముద్రగడ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. ఈసారి అలా కాకుండా… ఆయన్ని పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్‌గా ముందే ప్రకటించి డైరెక్ట్‌గా ఢీ కొట్టించేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు ముద్రగడ. అంతకు ముందు 2009 ఎన్నికల్లో చివరిసారి పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక 2024 ఎన్నికల ముందు కొడుకు పొలిటికల్ కెరీర్‌ కోసం రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఎన్నికల తర్వాత పద్మనాభం కుమారుడు గిరిబాబుకు వైసీపీ ప్రత్తిపాడు బాధ్యతలు అప్పగించారు. ఆ వ్యవహారం అలా నడుస్తుండగానే… పద్మనాభరెడ్డిని పిఠాపురం ఇన్ఛార్జ్‌ ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ప్రస్తుతం మాజీ ఎంపీ వంగా గీత ఉన్నారు. అయితే మారుతున్న పరిణామాలు, ప్రాధాన్యతలతో అక్కడ ఆమె కరెక్ట్‌ కాదని భావిస్తున్నారట ఫ్యాన్‌ పెద్దలు. అందుకే…. పార్టీ పిఠాపురం బాధ్యతలు ముద్రగడ ఫ్యామిలీకి అప్పగిస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో… కులంలో అత్యంత సీనియర్‌ అయిన ముద్రగడలాంటి నాయకుడు డైరెక్ట్‌గా పార్టీకి సారధ్యం వహిస్తే… ఆ ప్రభావం వేరుగా ఉంటుందని లెక్కలేస్తున్నట్టు తెలిసింది. ఆ లెక్కల ప్రకారమే వర్కౌట్‌ చేయాలనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇన్ఛార్జ్‌గా ఉన్న వంగా గీత పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ గతంలో ఆమె పీఆర్పీలో ఉండటం, వ్యక్తిగతంగా సాఫ్ట్ పర్సన్‌ కావడం లాంటివి లోకల్‌గా పార్టీకి నెగెటివ్‌ అవుతున్నాయన్న భావన ఉందట. అలాగే….. కాపులు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్‌లో అదే సామాజికవర్గానికి చెందిన పవన్‌లాంటి పర్సనాలిటీని ఢీ కొట్టాలంటే… టఫ్‌ ఫైట్‌ ఇచ్చే నేత కావాలిగాని, సాఫ్ట్‌గా ఉండేవాళ్ళు పనికిరారన్న వాదన కూడా వైసీపీ వర్గాల్లో ఉన్నట్టు తెలిసింది. పవన్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటేనే మాంఛి కిక్కు వస్తుందని, లోకల్‌ టీడీపీ నాయకుడు వర్మ అలా చేయడం వల్లే ఇక్కడ ప్రతిపక్షం కంటే ఆయనే ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతున్నారన్న అభిప్రాయం సైతం ఉంది వైసీపీలో.

ఆ వ్యాక్యూమ్‌ని ఫిల్‌ చేయాలంటే ముద్రగడే కరెక్ట్‌ అన్న అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇటీవల ముద్రగడను కలిశారు. ఆ సమావేశంలో ఈ అంశం కూడా ప్రస్తావనకి వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో వంగా గీతకు పార్టీ పీఏసీలో అవకాశం ఇచ్చారు. తనను తప్పించారని ఆమె హర్ట్‌ అవకుండా ప్లాన్‌ ప్రకారం ముందే అలా సెట్‌ చేశారన్నది పార్టీ ఇంటర్నల్ టాక్‌. పద్మనాభం పిఠాపురం నియోజకవర్గానికి దూరమై దశాబ్దాలు కావడంతో… ముందే నిర్ణయం తీసుకుని ఫుల్‌ రీఛార్జ్‌ మోడ్‌లోకి తీసుకురావాలన్నది ఫ్యాన్‌ పెద్దల ఆలోచన అట. అలాచేస్తే… కాపు కమ్యూనిటీలో కూడా పట్టు తగ్గకుండా ఉంటుందన్నది లెక్క. అయితే… ఈలెక్కలన్నీ పార్టీ హైకమాండ్‌ పరంగా వేసుకుంటున్నవే. దీనికి ముద్రగడ ఊ కొట్టారా, లేక ఊహూ అన్నారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అటు అనుచరుల్లో కూడా పిఠాపురం విషయంలో పెద్దాయన కంఫర్ట్‌గానే ఉన్నారా అన్న చర్చ జరుగుతోందట. మొత్తం మీద ఈసారి పవన్‌ను ఢీ కొట్టడానికి వైసీపీ అధిష్టానం పెద్ద స్కెచ్చే వేస్తోంది. అది ఎంతవరకు వర్కౌట్‌ అవుతుంది, ఎప్పటికి క్లారిటీ వస్తుందన్నది చూడాలి.

Exit mobile version