Off The Record: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, మాజీ సీఎం జగన్‌కు అస్సలు పడదు. ఛాన్స్ దొరక్కున్నా… దొరకబుచ్చుకుని మరీ… జగన్‌ను ఏకిపారేస్తుంటారు పవన్. అట్నుంచి కూడా అంతే. పవన్ కళ్యాణ్‌ను పూచికపుల్లతో సమానంగా తీసేస్తారు వైసీపీ లీడర్స్. జగన్ మీద పవన్ ఒక్క కామెంట్ చేస్తే చాలు….. మా నేతను అంత మాట అంటావా అంటూ రాష్ట్రం నలులమూల నుంచి విరుచుకుపడే వాళ్లు ఫ్యాన్ పార్టీ నాయకులు. వెంటనే ప్రెస్మీట్లు పెట్టే వారు.…