Site icon NTV Telugu

Off The Record: వైఎస్ జగన్ సెక్యూరిటీ మారబోతుందా..?

New Security

New Security

Off The Record: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సెక్యూరిటీ మారబోతోందా? ఆయన పర్యటనల్లో ఇక నుంచి కొత్త దళం కనిపించబోతోందా? అందుకోసం వైసీపీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందా? ఆఫీసర్స్‌ ఆన్‌ డ్యూటీ అన్నట్టు వాళ్ళు ఆల్రెడీ ఎంటరైపోయారా? ఇంతకీ ఏంటా కొత్త సెక్యూరిటీ వింగ్‌? దాంతో వైసీపీ టెన్షన్‌ తీరిపోతుందా?

Read Also: Off The Record: తెలంగాణ బీజేపీలో పదవుల పంచాయితీ..?

వైసీపీ అధినేత జగన్ వరుస పర్యటనలు వివాదాస్పదం అవుతున్నాయి. జిల్లాలకు వెళ్ళినప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ భద్రతను ప్రభుత్వం కల్పించటం లేదని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. దీంతో.. ఇక తామే సొంతగా ఓ ప్రైవేట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకోబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం పదవీ విరమణ చేసిన సైనికోద్యోగులను నియమించుకోబోతున్నట్టు తెలిసింది. జగన్‌ వెళ్ళిన గుంటూరు, రాప్తాడు, తెనాలి, పొదిలి, సత్తెనపల్లి పర్యటనలకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వాళ్ళని నియంత్రించడం పోలీసులకు కూడా కష్టమవుతోంది. దీంతో పలు ఆంక్షలు విధించటం, వాటిని వైసీపీ నేతలు పట్టించుకోకపోవడం, తర్వాత కేసులు బుక్‌ అవడం సాధారణమైపోయింది ఇటీవలి కాలంలో. మరీ ముఖ్యంగా… సత్తెనపల్లి పర్యటన సమయంలో వైసీపీ కార్యకర్త సింగయ్య.. కారు టైరు కింద నలిగి చనిపోవడం, అది జగన్‌ కారేనంటూ వీడియోలు బయటికి వచ్చి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో ఓ రేంజ్‌లో రాజకీయ రచ్చ జరిగింది.

Read Also: Off The Record: సొంత పార్టీలో ఒంటరి పోరాటం చేస్తున్నారా?

అటు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఇవ్వాల్సిన మాజీ సీఎం విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్రం పాటించడం లేదంటూ హైకోర్టు మెట్లెక్కారు వైసీపీ నాయకులు. పర్యటనల సమయంలో రోప్‌ పార్టీలను కూడా ఇవ్వడం లేదని, జగన్‌కు సేఫ్‌ ల్యాండింగ్‌.. సేఫ్‌ ట్రావెల్‌.. సేఫ్‌ మూవ్‌ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వాదనలు వినిపించారు. వాస్తవానికి ఈ నెల 3న నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లాల్సింది జగన్‌. కానీ, హెలిపాడ్‌ విషయంలో క్లారిటీ లేక మొత్తం టూరే రద్దయిపోయింది. హెలిప్యాడ్‌కు చివరి నిమిషం దాకా అనుమతివ్వలేదని, తాము పిటిషన్‌ వేశాక హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి.. ఇదే హెలిప్యాడ్‌ అన్నారని కోర్ట్‌కు వివరించారు వైసీపీ లీడర్స్‌. హెలిప్యాడ్‌ కోసం ప్రభుత్వం సూచించిన స్థలం మనుషులు నడవడానికి కూడా వీల్లేకుండా తుప్పలు, డొంకలతో ఉందని చెప్పారు. ప్రధానంగా రోప్ పార్టీని నియమించకపోవడం వల్ల జగన్ పర్యటనల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని కోర్ట్‌ దృష్టికి తీసుకువెళ్లారు వైసీపీ లీడర్స్‌. జూన్‌ 18న రెంటపాళ్ల పర్యటన సమయంలో రోప్ పార్టీ లేకపోవడం సింగయ్య అనే కార్యకర్త కారు కింద పడి చనిపోయాడన్నది వైసీపీ నేతల వెర్షన్‌.

Read Also: Nidhhi Agerwal: మీ అమ్మగారి నెంబర్ ఇస్తే సంబంధం మాట్లాడతానన్న నెటిజన్.. నిధి షాకింగ్ రియాక్షన్

అయితే, ప్రభుత్వం మాత్రం తమవైపునుంచి ఎలాంటి లోపం లేదని మాజీ సీఎంకి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సినంత భద్రత ఇస్తున్నామని హైకోర్ట్‌కు నివేదించింది. ఈ పరిస్థితుల్లో బుధవారంనాడు మామిడి రైతుల పరామర్శ కోసం జగన్‌ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు సిద్దం కావటంతో ఆయన భద్రత అంశం మరోసారి తెర మీదికి వచ్చింది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌కు వైసీపీ శ్రేణలు, రైతులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తోంది వైసీపీ. కనీసం 10 వేల మంది వస్తారన్న అంచనాతో…. అందుకు అనుగుణంగా భద్రత కల్పించాలని పోలీసుల్ని కోరారు వైసీపీ నాయకులు. ఆ విషయంలో పోలీసుల స్పందన ఎలా ఉన్నా… నిమిత్తం లేకుండా…తమ సొంత భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని డిసైడైనట్టు సమాచారం. జగన్‌ భద్రత కోసం ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగులతో ఒక ప్రైవేట్‌ సెక్యూరిటీ వింగ్‌ని ఏర్పాటు చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

Read Also: Old Temples Lift: జాకీల సాయంతో వందేళ్ల నాటి ఆలయాలు లిఫ్ట్.. ఎక్కడో తెలుసా?

ఇక, ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగులైతే.. ఆయుధాలు, ఇతరత్రా విషయాల్లో ఇబ్బందులు రావని, కొంత వరకూ తమకు ఉపశమనం ఉంటుందని భావిస్తున్నారట. వాళ్ళు పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుని ఉంటారు కాబట్టి… జగన్ పర్యటన సమయంలో ఆయనకు రక్షణగా ఉండటంతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతోందో కూడా నిరంతరం మానిటర్ చేస్తారన్నది వైసీపీ లెక్కగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్లు ఎక్కడా బయటికి కనిపించకున్నా…జగన్‌ బంగారుపాళ్యం టూర్‌ నుంచే రంగంలోకి దిగబోతున్నట్టు తెలిసింది. ప్రైవేట్ సెక్యూరిటీ ఎంట్రీతో వైసీపీ టెన్షన్ తగ్గుతుందా..లేక కొత్త సమస్యలు వస్తాయా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. మ్యాంగో మార్కెట్‌ టూర్‌ తర్వాతే ఈ విషయంలో క్లారిటీ వస్తుందని అంటున్నారు.

Exit mobile version