కుప్పంలో దూకుడు పెంచిన వైసీపీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్న పంచాయతీలు.. నిన్న పరిషత్‌లు.. తర్వాత మున్సిపాలిటీలు.. ఇప్పుడు కుప్పంలో బాబు పీఠం కదల్చడమే టార్గెట్‌గా పెట్టుకున్నారట అధికారపార్టీ నేతలు. ఫార్టీ ఇయర్స్ సీనియర్‌ను ఢీకొట్టడానికి ఓ యువనేతను బరిలో దించుతారనే టాక్ చిత్తూరు జిల్లా వైసీపీలో ఓ రేంజ్లో ఉంది. ఇంతకీ వైసీపీ వ్యూహం ఏంటి? ఎవరిని పోటీకి పెట్టబోతోంది?
కుప్పంలో వైసీపీ దూకుడు పెంచుతుందా?
Also Read
కుప్పం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అన్ని ఎన్నికలు ముగిసినా కుప్పం ఇంకా వార్తల్లోనే ఉంటోంది. ఈసారి అధికారపార్టీ వైసీపీ కేంద్రంగా కీలమైన డెవలప్మెంట్ జిల్లా రాజకీయాల్లో చర్చకు కారణమైంది. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు టీడీపీ కంచుకోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్లో వైసీపీ జెండా ఎగరేశారు. అక్కడితో సరిపెట్టుకోకుండా మరింత దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారని టాక్.
కుప్పంలో బరిలో నిలిచే అభ్యర్థిపై క్లారిటీ వచ్చిందా?
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డుల్లో 19చోట్ల గెలిచి సత్తాచాటి.. వచ్చే సార్వత్రిక ఎన్నికలే మా టార్గెట్ అని మాటల తూటాలు పేల్చారు మంత్రి పెద్దిరెడ్డి. 2024లో కుప్పం తమదేనని ప్రకటించారు. పాపం చంద్రబాబు అని సెటైర్లు వేశారు మంత్రి. అధికారంలో ఉండటంతో వైసీపీ కుప్పం లోకల్ ఎన్నికల్లో గెలిచిందని చంద్రబాబు అండ్ కో భావించినా.. వైసీపీ నేతలు మాత్రం పక్కా ప్లాన్ అమలు చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో కుప్పం బరిలో నిలిచే అభ్యర్ధి వేటను పంచాయతీ ఎన్నికల తర్వాత మొదలుపెట్టినా.. మున్సిపల్ ఫలితాల తర్వాత క్లారిటీకి వచ్చారట.
బరిలోకి మంత్రి పెద్దిరెడ్డి తమ్ముడు కుమారుడు సుధీర్‌రెడ్డి..!
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళి అనారోగ్యంతో చనిపోవడంతో ఆ స్థానాన్ని ఆయన కుమారుడు భరత్‌కు అప్పగించారు. ఇప్పుడు భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి.. కుప్పం కొత్త సారథి కోసం సీరియస్‌గా దృష్టి పెట్టారట. ఆ కొత్త సారథి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచే ఉంటారనే చర్చ పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి మధ్య రాజకీయ సెగలు రేగుతున్నాయి. అలాంటిది ఏకంగా పెద్దిరెడ్డి కుటుంబం నుంచే చంద్రబాబుపై ఒకరు పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతుండటంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు కుమారుడైన సుధీర్‌రెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది. సుధీర్‌రెడ్డి ప్రస్తుతం పుంగనూరు సదుం, సోమల మండలాల ఇంఛార్జ్‌గా ఉన్నారు.
భరత్ బరిలో దిగితే.. పీలేరు లేదా పలమనేరులో సుధీర్‌రెడ్డి పోటీ..!
మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఇప్పటికే ఆయన కుమారుడు మిధున్‌రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. అలాగే పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరందరి శిక్షణలో సుధీర్‌రెడ్డి కుప్పంలో రాటుదేలుతారని అనుకుంటోంది పార్టీ కేడర్. త్వరలోనే సుధీర్‌రెడ్డిని కుప్పం వైసీపీ ఇంఛార్జ్‌గా ప్రకటించి స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీగా ఉన్న భరత్ అసెంబ్లీ ఎన్నికల నాటికి తన పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతారనే వాదన కూడా ఉంది. ఒకవేళ అధిష్ఠానం భరత్‌వైపు మొగ్గు చూపితే.. సుధీర్‌రెడ్డి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ వర్గాలు దీనికీ సోషల్ మీడియాలో సమాధానాలు చెప్పేస్తున్నాయి. పీలేరు లేదా పలమనేరు నుంచి సుధీర్‌రెడ్డి బరిలో దిగొచ్చనే చర్చను తీసుకొస్తున్నారు. కుప్పంలో వైసీపీ ఆపరేషన్‌పై సంక్రాంతి నాటికి క్లారిటీ వస్తుందనే లెక్కల్లో ఉన్నాయి పార్టీ వర్గాలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!