Off The Record: తెలంగాణ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరుగుతాయా? ఆగుతాయా? షెడ్యూల్ అయితే ప్రకటించారుగానీ…. సస్పెన్స్‌కు ఎందుకు తెర పడటం లేదు? ఆ విషయంలో ఎప్పటికి క్లారిటీ వస్తుంది? అసలు సర్కార్ వెర్షన్ ఎలా ఉంది? లీగల్ బ్యాటిల్‌లో ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉంది?
Read Also: Jagtial: ప్రాణం తీసిన ప్రేమ.. యువకుడిని కొట్టి చంపిన ప్రియురాలి కుటుంబీకులు..!
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా… నిర్వహణపై నీలి నీడలు మాత్రం తొలిగిపోలేదు. ఎలక్షన్స్ జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి జీవో ఇవ్వడంతోపాటు ప్రాదేశిక నియోజకవర్గంలో కూడా 42 శాతం రిజర్వేషన్ అమలుకు నిర్ణయించింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా షెడ్యూల్ ప్రకటించింది. అంతవరకు అందరికీ క్లారిటీ ఉంది. అయితే… 42 శాతం రిజర్వేషన్స్ జీవో పై హైకోర్ట్‌లో కేసు వేశారు కొందరు. అక్కడే తేడా కొడుతోందట అందరికీ. కోర్ట్‌లో ఏం జరగబోతోంది? తీర్పు ఎలా ఉంటుందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూసుకున్నా… అక్టోబర్ 8 తర్వాతనే నామినేషన్ల పర్వం మొదలవుతుంది. దీంతో… కోర్ట్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది, 42 శాతం రిజర్వేషన్స్‌కు గ్రీన్ సిగ్నల్ పడుతుందా లేక లీగల్‌గా లిటిగేషన్లో పడుతుందా..? అన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.
Read Also: North Korea: అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదు.. అమెరికాకు గట్టి దెబ్బే!
అయితే, బీసీ రిజర్వేషన్స్ మీద అక్టోబర్ 8న విచారిస్తామని స్పష్టం చేసింది హైకోర్ట్. దీంతో ఆ రోజు కోసం ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ పక్షాలు. ఇప్పటికే పిటిషన్‌ను విచారించిన కోర్టు ప్రాధమికంగా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు ఉంది కదా అనే పాయింట్‌ని కూడా మెన్షన్ చేసింది హైకోర్టు. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ల అమలుపై ఒకవేళ కోర్ట్ అభ్యంతరం చెప్తే పరిస్థితి ఏంటి..? ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పి విచారణను కొనసాగిస్తుందా..? లాంటి అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Read Also: Tilak Verma: రేవంత్‌రెడ్డిని కలిసిన తిలక్ వర్మ.. సీఎంకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తిలక్..
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలని గట్టి పట్టుదలతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం.కానీ… రిజర్వేషన్ల పేరుతో… పీటముడి పడితే ఏం చేస్తుందన్నది బిగ్ క్వశ్చన్. సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు తర్వాత 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళండని హైకోర్ట్ సూచిస్తుందా అన్న చర్చ సైతం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం కోర్టులో తమ వాదనని బలంగా వినిపించాలన్న ప్లాన్‌లో ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై కూడా స్పష్టత నివ్వాలనుకుంటున్నారట. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఎందుకు నిర్ణయించామో… సవివరంగా కోర్టు ముందు ఉంచాలనుకుంటున్నారట ప్రభుత్వ పెద్దలు. ఈ విషయంలో గట్టిగా లీగల్ ఫైట్ చేయాలని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇలా… రకరకాల చర్చోప చర్చల నడుమ సస్పెన్స్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఉత్కంఠ అక్టోబర్ 8దాకా తప్పదు. అదే సమయంలో 42 శాతం రిజర్వేషన్స్‌కు కోర్ట్ అభ్యంతరం చెప్తే.. పాత లెక్కల ప్రకారమే ఎన్నికలకు వెళ్తారా..? అన్నది కూడా తేలాల్సి ఉంది.
