Telangana: ఆ పదవిని ఎందుకు భర్తీ చేయటం లేదు? తెరవెనుక రాజకీయం నడుస్తోందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, చీఫ్‌విప్ పోస్టులను ఒకేసారి భర్తీ చేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరినే మరోసారి ఛైర్మన్‌గా చేసి సరిపెట్టేశారు. డిప్యూటీ ఛైర్మన్, చీఫ్‌విప్ పదవుల ఉసే లేదు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పోస్టు బీసీ సామాజికవర్గానికి దక్కుతుందని అప్పట్లో టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. రేపో మాపో పేరు ప్రకటిస్తారని అనుకుంటూనే ఉన్నారు కానీ.. కొలిక్కి రావడం లేదు. దీంతో ఎందుకు భర్తీ చేయడం లేదు? పేరును ఎందుకు ప్రకటించడం లేదు? అనే ప్రశ్నలు చర్చగా మారాయి.
అధికార టీఆర్ఎస్కు తెలంగాణ శాసనమండలిలో ఏకపక్ష బలం ఉంది. మొత్తం 40 మంది ఎమ్మెల్సీలలో టీఆర్ఎస్ సభ్యులే 35 మంది. మిత్రపక్షం MIMకు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ మధ్య గుత్తా పదవీకాలం పూర్తయిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్సీలు శాసనమండలి ప్రొటెం ఛైర్మన్లుగా పనిచేశారు. వారిలో ఒకరు MIM ఎమ్మెల్సీ. గుత్తా మరోసారి ఎమ్మెల్సీ అయ్యాక తిరిగి అదే పోస్టులోకి వచ్చేశారు. ఆ తర్వాతే డిప్యూటీ ఛైర్మన్ పీఠంపై పీటముడి పడినట్టు చెబుతున్నారు. డిప్యూటీ ఛైర్మన్ పోస్టును MIM ఆశించిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు అధికార టీఆర్ఎస్కు సంకేతాలు కూడా పంపినట్టు సమాచారం. అయితే అధికారపార్టీ సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. ఆ వ్యవహారం అంతటితో ఆగిపోయిందని చెబుతున్నా.. మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి భర్తీ విషయంలో జాప్యానికి ఇంకేదో బలమైన కారణం ఉందని గులాబీ శిబిరంలో చెవులు కొరుకుడు ఎక్కువైంది. అదేంటన్నదే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్‌లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
ఆ మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌ను సడెన్‌గా ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేశారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఆయన్ని కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం సాగింది. తర్వాత శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ను చేస్తారని బలంగా ప్రచారం సాగింది. గుత్తాతోపాటే ఆయన పేరును ప్రకటిస్తారని.. ఇద్దరూ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసేస్తారని అనుకున్నారు. కానీ.. బండ ప్రకాష్ ఎమ్మెల్సీగానే మిగిలిపోయారు. అటు మిత్రపక్షం MIM కోరికను మన్నించక.. ఇటు ప్రచారంలో నలిగిన బండ ప్రకాష్ పేరును ప్రకటించక.. ఎందుకు జాప్యం చేస్తున్నారన్నదే ప్రశ్న. మరి.. ఆ కారణం ఏంటో… కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!