టీఆర్ఎస్ లో ‘పీకే’దెవరిని ? కునుకులేకుండా చేస్తున్న పీకే సర్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్‌కు పీకే టీమ్ నివేదిక ఇచ్చిందా? కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సర్వేపై చర్చ జరుగుతోంది. పీకే ఎంట్రీతో పార్టీలో ఏం జరగబోతుంది? టీఆర్ఎస్లో మార్పులు చేర్పులపై నేతల మధ్య గుసగుసలు ఉన్నాయి. తాజాగా ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ ప్యాక్… టిఆర్ఎస్ మధ్య ఒప్పందం ఖరారైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీతో కలిసి పనిచేయనుంది ఆ సంస్థ. ఇప్పటికే పని మొదలుపెట్టిన సర్వే బృందాలు.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఇమేజ్ తెలుసుకోవడంతోపాటు.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో వడపోసే పనిలో ఉందట ఐ ప్యాక్ టీం. టీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌కు పలు నియెజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఇప్పటికే నివేదిక ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
ఇన్నాళ్లూ పీకే గురించి.. ఆయన బృందాలు ఇచ్చే సర్వే గురించి కొంత చర్చ జరిగినా.. రెండు రోజులుగా ఆ హీట్ మరింత పెరిగింది. పీకే ఇచ్చే నివేదికలు.. సర్వేలతో తమ రాజకీయ భవిష్యత్ ఏమౌతుందో అనే టెన్షన్లో ఎమ్మెల్యేలు ఉన్నారట. ఇప్పటికే రెండు, మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు ఉన్నారు. అక్కడ కొంత వ్యతిరేకత ఉంటుందని.. అదే ప్రామాణికంగా భావించి నివేదిక ఇస్తే ఎలా అన్నది MLAల ప్రశ్న. ఆ సర్వే ఆధారంగా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎమ్మెల్యేలలో గుబులు పట్టుకుందట. ప్రస్తుతం నియోజకవర్గంలోని గుట్టంతా హైకమాండ్‌కు తెలిసిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన కొందరు సిట్టింగ్‌లు చాలా టెన్షన్లో ఉన్నట్టు సమాచారం. సరిగా నిద్రపోవడం లేదట. కనిపించిన వాళ్లను తమ రాజకీయ భవిష్యత్‌పై ఆరా తీసే పనిలో పడ్డారట.
Also Read
ఒకవైపు.. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఎంట్రీ దాదాపు ఖాయమన్నది కాంగ్రెస్ వర్గాల వాదన. ఆ చర్చలు జరుగుతున్న సమయంలోనే పీకే.. నేరుగా హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఐప్యాక్‌తో కుదిరిన ఒప్పందంపై ఆరా తీస్తూనే.. పొత్తుల విషయం ఏమైనా చర్చకు వచ్చిందా అని కూపీ లాగుతున్నారట. ఒకవేళ అదే జరిగితే తమ సీటు ఎంత వరకు సేఫ్.. జరగబోయే రాజకీయ పరిణామాలపై అంచనా వేసుకునే పనిలో ఉన్నారట కొందరు సిట్టింగ్‌లు. అయితే పొత్తులపై టీఆర్ఎస్తోపాటు పీకే బృందాలు కూడా మౌనంగానే ఉన్నాయి.
ఇదే సమయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారం గులాబీ శిబిరంలో ఆసక్తిగా మారుతోంది. కొన్ని జిల్లాల్లో కొందరు ప్రజాప్రతినిధుల తీరుపై స్పష్టమైన నివేదిక ఇచ్చారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే ఐప్యాక్ సంస్థ ఇప్పటి వరకు టీఆర్ఎస్కు ఎటువంటి నివేదిక ఇవ్వలేదని తెలుస్తోంది. అప్పటి వరకు అధికారపార్టీ నేతలు రిలాక్స్ కావొచ్చని ఊపిరి పీల్చుకుంటున్నారట. మొత్తానికి గులబీ శిబిరంలో సర్వే అంశం ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తుందనే చెప్పాలి.
Watch : https://youtu.be/9uwC3vvxalI
తాజావార్తలు
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!