OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: గతంలో తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జెడ్పీ ఛైర్‌పర్సన్ అయ్యారు. అధికారం కోల్పోగానే పక్క పార్టీలోకి జంప్ అయ్యారు. అక్కడా… ఇమడలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. హైకమాండ్ అండదండలు ఉన్నా కిందిస్థాయి నేతల సపోర్టు లేక సతమతమవుతున్నారు. ఇంతకీ…ఆ రాజకీయ నేతకు వచ్చిన కష్టాలు ఏంటి?ఎందుకు వరుస వివాదాలు వెంటాడుతున్నాయ్?
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో ZP ఛైర్‌పర్సన్ ప్రొటోకాల్ అంశం హాట్టాపిక్గా మారింది. YCP ప్రభుత్వ హయాంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా గంటా పద్మశ్రీ ప్రసాద్ ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమె టీడీపీలో చేరిపోయారు. బీసీ సామాజికవర్గ మహిళా నేత కావడంతో అధినేత చంద్రబాబు సమక్షంలో ఆమె పసుపు కండువా కప్పుకున్నారు. వైసీపీలో ఉన్న వాళ్లను కూటమిలోకి తీసుకురావడం వెనుక అప్పటి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన MLA బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి ఎంతోమంది ప్రయత్నాలు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీలో ఈజీగా ఎంట్రీ ఇచ్చినా గంటా పద్మశ్రీ ప్రసాద్కు జిల్లాలో పొలిటికల్ జర్నీ మాత్రం ఇప్పటికీ వర్రీగానే మారిందట.
Also Read
OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?
ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ YCP నుంచి టీడీపీలో చేరడాన్ని దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్. YCP అధికారంలో ఉన్న సమయంలో చింతమనేని ప్రభాకర్కు, ఛైర్‌పర్సన్ పద్మశ్రీ భర్త ప్రసాద్కు మధ్య విభేదాలే ఇందుకు ఒక కారణమని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చింతమనేని అనేకసార్లు బహిరంగ వేదికలపైనే ప్రస్తావిస్తూ వచ్చారట. పార్టీ మారిన తర్వాత ఒకరిద్దరు నాయకుల నుంచి వ్యతిరేకత సర్వసాధారణమే అనుకుని సర్దుకుపోతున్న పద్మశ్రీకి ఇపుడు అధికారుల నుంచి కూడా అందుతున్న సహకారం అంతంత మాత్రమేననే టాక్ వినిపిస్తోంది.
ఇటీవల నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశాల్లో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్, జిల్లా ఎమ్మెల్యేలు హాజరైనా అధికారులు మాత్రం ఆ సమావేశానికి హాజరుకాకపోవడం రాజకీయ దుమారం రేపిందనే చర్చ నడుస్తోంది. జిల్లా కలెక్టర్తో సహా అధికారులు సైతం ఆ సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారట. ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలోనూ కలెక్టర్ కీలక అధికారులు లేకుండానే మీటింగ్ ముగించేయాల్సి వచ్చిందని సమాచారం.
ఏలూరు జిల్లా ఇంఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగే జిల్లా సమీక్ష సమావేశాల్లో సైతం జెడ్పీ చైర్పర్సన్ ప్రొటోకాల్ అంశం వివాదాలను రేపుతోందట. డీఆర్సీ సమావేశాలకు వైస్ చైర్మన్గా ఉండే జెడ్పీ చైర్పర్సన్ హోదాతో పాటు తమకు కూడా వేదికపైన సీట్లు కేటాయించాలంటూ ఇటీవల ఎమ్మెల్యేలు పట్టుపట్టడం జిల్లా కలెక్టర్, ఇంఛార్జి మంత్రికి తలనొప్పిగా మారిందట. నిబంధనల ప్రకారం పాటించాల్సిన సమావేశాన్ని వివాదాలు లేకుండా నడపడం కోసం జెడ్పీ చైర్పర్సన్ పక్కనే సీట్లు వేసి సమావేశాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. సమావేశాలకు వెళ్లి అక్కడ అవమానాలు పడే కంటే..దూరంగా ఉండటమే మంచిదని జెడ్పీ చైర్పర్సన్ ఫిక్స్ అయ్యారట.
US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..
శిలాఫలకాలు జెడ్పీ ఛైర్‌పర్సన్ పేరు లేకుండానే ఏర్పాటు చేయడం మరో వివాదానికి కారణం అవుతోందట. దెందులూరు నియోజకవర్గ పరిధిలో జెడ్పీ చైర్మన్ సొంత గ్రామంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపైనా పేరు తొలగించడంపై పద్మశ్రీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారట. దీనిపై స్పందన లేకపోవడం జెడ్పీ ఛైర్‌పర్సన్ కు మరింత అసంతృప్తి కలిగేలా చేస్తోందట. ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి మారినంత మాత్రాన పదవుల్లో ఉండే వాళ్లకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలను టిడిపి అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారాన్ని పార్టీ పెద్దలు సరిచేస్తారో.. లేక YCP నుంచి తమ పార్టీలో చేరిన వాళ్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని సరిపెట్టేస్తారో చూడాలి మరి.
తాజావార్తలు
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!