Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Ts Municipal Elections Has Bjp Stepped Back From Pawan Kalyans Campaign

TS Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ ప్రచారంపై బీజేపీ వెనక్కి తగ్గిందా?

Published Date :February 7, 2026 , 10:07 pm
By Sampath Kumar
  • పవన్‌ ప్రచారంపై బీజేపీ వెనక్కు తగ్గిందా?
  • ఈనెల 7,8న పవన్‌ ప్రచార షెడ్యూల్‌
  • ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతుదన్న అనుమానాలు
  • బీఆర్‌ఎస్‌ సెంటిమెంట్‌ అస్త్రాన్ని వాడుతుందన్న డౌట్స్‌
  • రాష్ట్రంలో ఉనికిలేని పార్టీ మద్దతు ఎందుకని ఓ వర్గం ప్రశ్న
  • పవన్‌ విషయంలో బీజేపీ బ్యాక్‌ స్టెప్‌ తీసుకున్నట్టేనా?
TS Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ ప్రచారంపై బీజేపీ వెనక్కి తగ్గిందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారంపై బీజేపీ యూటర్న్ తీసుకుందా..? మున్సిపల్‌ ఎలక్షన్స్‌లో ఏపీ డిప్యుటీ సీఎం ప్రచారం ఇక లేనట్టేనా..? అంతా రెడీ… జనసేనాని వచ్చేస్తున్నారంటూ ముందు హంగామా చేసి సడన్‌గా ఎందుకు సైలెంట్‌ అయినట్టు? పవన్ విషయమై తెలంగాణ బీజేపీలో జరుగుతున్న అంతర్మథనం ఏంటి..?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మద్దతు, పవన్‌కళ్యాణ్‌ ప్రచారం విషయంలో కాషాయ పార్టీ వెనక్కు తగ్గిందా అంటే…. అవును, దాదాపుగా అలాగే కనిపిస్తోందని అంటున్నాయి రాజకీయవర్గాలు. ఈ ఎన్నికల్లో సింగిల్‌గానే బరిలోకి దిగుతామని తొలుత చెప్పిన కమల దళం ఆ తర్వాత అనూహ్యంగా జనసేన మద్దతు కోరింది. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పవన్‌ను కలిసి మద్దతు కోరారు. అందుకు ఆయన కూడా రెడీ అన్నారట. అదే ఊపులో… ఈనెల 7, 8న తెలంగాణలో పవన్‌కళ్యాణ్‌ ప్రచారం ఉంటుందని ప్రకటించింది జనసేన. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే సీన్ రివర్స్ అయ్యిందని అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఈ అంశం అస్త్రంగా మారింది. జనసేన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీ అని, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌ ప్రచారానికి వస్తే…. మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని అందుకుని సెంటిమెంట్‌ రగిలించవచ్చని బీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్టు కూడా కమలదళానికి ఉప్పందిందట. అలాగే సొంత పార్టీలోని ఓ వర్గం నేతలు సైతం దీన్ని వ్యతిరేకించినట్టు తెలిసింది.

తెలంగాణలో ఏమాత్రం ఉనికి లేని పార్టీ మద్దతు కోరడం ఏంటంటూ వాళ్ళు పెదవి విరిచినట్టు సమాచారం. దీనికి తోడు రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి కాషాయ పార్టీ పోటీ చేస్తోంది. అలాగే జనసేన సైతం దాదాపు 350 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. గ్లాస్‌ పార్టీ అభ్యర్థులు లేని చోట బీజేపీకి మద్దతిస్తూ పవన్ ప్రచారం చేయడం ఒకేగానీ…రెండూ బరిలో ఉన్న ప్రాంతాల్లో పవన్ ఎవరికి ఓటు వేయాలని కోరుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇలా… ఈ గందరగోళపు పరిస్థితుల్లో…. బీజేపీ రాష్ట్ర నాయకత్వం డైలమాలో పడిందట. ఇక బ్యాక్ స్టెప్ తీసుకుంటే బెటర్ అనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కనిపిస్తున్న వాతావరణం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమైతే…. ఈనెల 7, 8 తేదీల్లో పవన్‌ ప్రచారం ఉంటుంది. కానీ…. దానికి సంబంధించి ఎక్కడా క్లారిటీ లేదు, ఆ దిశగా ఏర్పాట్లు లేవు.

Also Read: Telangana Municipal Election: మున్సిపల్ ఎన్నికలవేళ.. గులాబీ పార్టీలో గొడవ మొదలైందా?

ఒక పార్టీకి అధ్యక్షుడిగా, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్య మంత్రిగా, అలాగే… సినీ గ్లామర్‌ ఉన్న నాయకుడి సభ అంటే… సహజంగానే కాస్త హైప్‌ ఉంటుంది. కానీ… ఇక్కడ అలాంటి వాతావరణం ఏదీ కనిపించకపోవడంతో… ఇక వెనకడుగు వేసినట్టేనన్న అభిప్రాయం బలపడుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈనెల 9న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ప్రచారానికి అతి తక్కువ సమయమే ఉన్నా…. జనసేన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇటు కాషాయ పార్టీ సైతం… ముందు వేరే ఆలోచన చేసినా… తర్వాత మాత్రం జనసేనాని ప్రచారం లేకుంటేనే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన మద్దతుతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశాలున్నట్టు అభిప్రాయపడుతున్నారట తెలంగాణ బీజేపీ నాయకులు. అందుకే యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పవన్‌కళ్యాణ్‌ మీద గంపెడాశలు పెట్టుకున్న జనసేన అభ్యర్థులు మాత్రం డీలా పడే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • pawan kalyan
  • Pawan Kalyan Campaign Telangana
  • Pawan Kalyan Telangana
  • Pawan Kalyan TS Elections

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions