OTR: కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ డ్రైవ్.. తెలంగాణ శాఖల్లో భారీ లీకులు బట్టబయలు..
- ఫేక్ లెక్కలు తీసేందుకు స్పెషల్ డ్రైవ్
- మైనింగ్‌లో లీకులు అరికట్టేసరికి 22శాతం ఆదాయం పెరుగుదల
- అన్ని డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్కలు బయటికి
- 15వేల మంది ఉద్యోగులు మిస్ అయినట్టు నివేదిక
- ఆ 15వేల మంది ఎవరు? నకిలీ ఉద్యోగులా?
- జీతాలు డ్రా చేసి వేరే ఎవరో నొక్కేస్తున్నారా?
- పదేళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగుల చిట్టా అధికారుల చేతిలో
- నొక్కుడులో ఉన్నది అధికారులా? రాజకీయ నాయకులా?
- అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సీఎం టేబుల్ మీదికి రిపోర్ట్?
- ఆ 15వేల మంది వెనక ఉన్నది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉన్న లీకులకు సీలేసే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. ఒక్కో డిపార్ట్మెంట్లో అనధికారికంగా పక్కదారి పడుతున్న ప్రభుత్వ సొమ్ముకు అడ్డుకట్ట వేసే పని మొదలైంది.ఇప్పటికే మైనింగ్ డిపార్ట్మెంట్ లీక్స్‌కు ఎమ్‌సీల్ వేసేశారట. దాంతో ఈ ఏడాది ఏకంగా 22 శాతం ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. ఇక ఆ ఇన్స్పిరేషన్తో ఎక్కడెక్కడ ప్రభుత్వ ధనం వృధా అవుతోందో లెక్కలు తీసి పూర్తిగా కట్టడి చేయాలని నిర్ణయించారు ప్రభుత్వ పెద్దలు. అందులో భాగంగానే… అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను తేల్చాలని డిసైడ్ అయ్యింది సర్కార్.
READ ALSO: Vidadala Rajini: ఎమ్మెల్యే కుమారుడే డ్రగ్స్ తీసుకుంటూ దొరకటం సిగ్గుచేటు!
Also Read
డిసెంబర్ 31 వరకు పూర్తి లెక్కలు తీస్తే… ఆ వివరాలు చూసి అంతా షాక్ తిన్నట్టు తెలుస్తోంది. దాదాపు 15వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు మిస్ అయినట్టు తెలుస్తోంది. వాళ్ళు ఎవ్వరూ అస్సలు ఆధార్ కార్డులు ఇవ్వలేదని సమాచారం. ఇన్నాళ్ళు వీళ్ళ పేరుతో జీతాలైతే డ్రా చేస్తున్నారుగానీ… గవర్నమెంట్ దగ్గర పూర్తి వివరాలు లేవు. ఈ డిటైల్స్ చూసి స్వయంగా ఆర్థిక శాఖ అధికారులే కంగుతిన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో…. ఇంతకీ ఆ 15 వేల మంది ఉద్యోగులు ఎవరు..? నిజంగానే ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తుంటే… ఎందుకు సమాచారం ఇవ్వలేదు..? వాళ్ళ పేరుతో వేరే ఎవరైనా డబ్బులు డ్రా చేసి నొక్కేస్తున్నారా..? అనే చర్చ మొదలైంది సచివాలయవర్గాల్లో. గత పదేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు సేకరించిన క్రమంలో ఈ అక్రమ చిట్టా బయటపడిందట. దాంతో.. కాంట్రాక్టు ఉద్యోగుల పేరుతో… డబ్బులు నొక్కింది ఎవరు..? అందులో అధికారుల పాత్ర ఉందా..? లేక రాజకీయ నాయకుల పాత్ర ఉందా అన్నది తేల్చే విషయంలో ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ముగిసిన వెంటనే ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందించేందుకు అధికార వర్గాలు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగుల పేరుతో దోపిడీ జరిగిందని, అన్నిటినీ బయటకు తీస్తామని గతంలో ప్రకటన కూడా చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. దానిపై ఆడిట్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన 15 వేల మంది ఉద్యోగుల సంగతి ఏంటి..? వెనకాల ఉన్నది ఎవరు..!? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ విభాగాల్లో… 15 వేల ఉద్యోగాలంటే అదేం చిన్న విషయం కాదు. అందుకే దీనిపై సర్కార్ ఏం చేయబోతుంది..!? లెక్కలు సరిచేస్తారా..? వెనక ఉన్న వాళ్ళని బయటికి లాగుతారా అంటూ ఆసక్తిగా చూస్తున్నాయి తెలంగాణ రాజకీయవర్గాలు.
READ ALSO: YouTube: యూట్యూబ్‌లో కొందరికి కోట్లు.. మరికొందరికి జీరో! అసలు కారణం ఇదే..
తాజావార్తలు
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
-
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
-
Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
-
Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..