OTR: ఎక్కడైనా సరే…. అధికారంలో ఉన్నవాళ్లు చేసింది చెప్పుకోలేకపోవడం ఒక ఎత్తయితే… ప్రతిపక్షం వేసిన ట్రాప్‌లో పడటం మరో ఎత్తు. తెలంగాణలో ప్రస్తుతం ఇదే జరుగుతోందట. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా రెండు రోజుల క్రితం జరిగిన ఎపిసోడ్‌ని చెబుతున్నారు పరిశీలకులు. సవాళ్లు, ప్రతి సవాళ్లు సహజమే అయినా….. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలన్న విషయాన్ని అధికార పక్షం మిస్ అయినట్టు కనపడుతోంది. ఎత్తుగడలు లేకుండా అడుగులు వేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అలాంటి ఇబ్బందే ఎదురైందని అంటున్నారు. ఏ ప్రభుత్వంలోనైనా మంత్రులు, వివిధ శాఖలపై ఆరోపణలు రావడం సహజం. ప్రతిపక్షం ఎప్పుడూ ఇందుకోసం కాచుకుని ఉంటుంది. వచ్చిన ఆరోపణలకు మంత్రులు సమాధానం చెప్పడం… సవాల్ విసరడం కూడా సహజమే. కానీ ప్రత్యర్థి ట్రాప్‌లో పడకుండా ఉండటమే ఇక్కడ టాలెంట్. ఆ లైన్ మిస్ అయితే ఇబ్బందులు తప్పవు. తమ మీద, శాఖల మీద వచ్చే ఆరోపణలకు కచ్చితంగా మినిస్టర్స్ వివరణ ఇవ్వాల్సిందే. అందులో భాగంగా పరిస్థితిని తనకు అనుకూలంగా మల్చుకుంటూ రాజకీయంగా సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి. తాజాగా తెలంగాణ పాలిటిక్స్‌లో అదే మిస్ అయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ప్రత్యేకించి మంత్రులు.. సవాల్ విసిరినప్పుడు చర్చకు అసెంబ్లీని వేదికగా చేసుకోవాలి. కానీ… కాంగ్రెస్ మంత్రులు ఆ లాజిక్ మిస్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక అసెంబ్లీలో చర్చ అంటే.. ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీష్‌రావు మేమే వస్తాం, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాబోరని తేల్చి చెప్తున్నారు. ఈ పాయింట్ మీదే కాంగ్రెస్ వైఖరి విమర్శల పాలవుతోంది. పదేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్… అసెంబ్లీలో చర్చకు రాకపోవడం ఏంటన్న విషయం మీద ఫోకస్ చేయడం మానేసిన మంత్రులు… కేటీఆర్, హరీష్‌రావు మాటలకు రెస్పాండ్ అవడం ఏంటన్న వాదన కొత్తగా తెర మీదకు వచ్చింది. వాళ్లిద్దరూ రోజుకో అంశం మీద ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ… తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారన్నది మంత్రుల భావన. అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ మొత్తాన్ని వాళ్ల చుట్టే తిప్పడం ఎందుకని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్స్. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. పదేళ్లు చేసిన అప్పులు… తప్పులకు సమాధానం చెప్పాల్సింది కేసీఆరే గానీ… ఆ ఇద్దరు కాదంటూ చెప్పేశారాయన. స్థాయి గురించి కేటీఆర్, హరీష్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన కొంత సీరియస్ అయ్యారు. చేసే పనిని బట్టి స్థాయి ఉంటుంది కానీ… పుట్టుకతో రాదంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం తరఫున సభలో చర్చ పెడితే సీఎం స్పందిస్తారు… ప్రతిపక్ష నుంచి ప్రతిపక్ష నేత స్పందించాలి… కానీ ఏ బాధ్యత లేని ఆ ఇద్దరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు భట్టి.
ఇకపై సభలో అయినా, బయట ఆయనా… ఆ ఇద్దరు మాట్లాడే ప్రతి మాటకి స్పందించాల్సిన అవసరం లేదని డిసైడ్ అయ్యారట ప్రభుత్వ పెద్దలు. తప్పుడు సమాచారం ఇచ్చే వాళ్లతో కాదు.. పదేళ్లు తప్పులు చేసిన కేసీఆర్ సభకు రావాలంటూ వత్తిడి పెంచాలని డిసైడ్ అయినట్టు సమాచారం. మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆరే ముఖ్యమంత్రి అని కేటీఆర్, హరీష్‌రావు చెబుతున్నప్పుడు… ఈ ఇద్దరి పాత్ర ఏంటని ప్రశ్నించారు భట్టి. అందుకే వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చేశారాయన. ఈ క్రమంలో…. వాళ్లు వేసే ట్రాప్‌లో మనం పడటం కాదు…. డైరెక్ట్‌గా కేసీఆర్‌నే అటాక్ చేయాలని, ఆయన రియాక్షన్ కోసమే చూడాలని డిసైడయ్యారట కాంగ్రెస్ ముఖ్యులు.

