Site icon NTV Telugu

Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజేపీ వ్యూహం మారబోతోందా..?

Tbjp

Tbjp

Off The Record: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజేపీ వ్యూహం మారబోతోందా? ఈసారి గతానికి భిన్నంగా ఉండబోతోందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే… స్థానిక ఎన్నికల్ని ట్రయల్‌ రన్‌గా భావిస్తోందా? వీలైనన్ని ఎక్కువ స్థానిక సంస్థల్ని గెల్చుకుని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు బిగించాలనుకుంటోందా? ఇంతకీ కాషాయ పార్టీ నయా ప్లాన్‌ ఏంటి? కొత్త సారథి మదిలో ఏముంది?

Read Also: Off The Record: ఒకప్పుడు కామ్రేడ్స్‌ అంటే నిత్యం ఉద్యమాలు, సమస్యలపై పోరాటాలు కానీ ఇప్పుడు..!

స్థానిక ఎన్నికల సమరానికి అస్త్ర శస్త్రాలతో… సరికొత్త ఊపు, ఉత్సాహంతో సిద్ధమవుతోందట తెలంగాణ బీజేపీ. పార్టీకి కొత్త సారధి వచ్చాక ఎదుర్కోబోయే తొలి ఎన్నిక కావడంతో…. ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు చెప్పుకుంటున్నాయి బీజేపీ శ్రేణులు. తన నాయకత్వ పటిమను నిరూపించుకోవడానికి రామచంద్రరావుకు కూడా స్థానిక ఎన్నికలు కీలకం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటిదాకా.. లోకల్ బాడీస్‌ ఎలక్షన్స్‌లో ఎప్పుడూ… ప్రభావం చూపలేకపోయింది బీజేపీ. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం చాలా తక్కువగా ఉండటమే అందుకు కారణం అంటారు. అయితే… లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, తెలంగాణలో చేసిన సభ్యత్వాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈసారి స్థానిక ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డాలని, ప్రభావం చూపించాలని డిసైడ్‌ అయ్యారట పార్టీ పెద్దలు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీల్ని కూడా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

Read Also: Shine Tom Chacko: బహిరంగంగా క్షమాపణలు చెప్పిన ‘దసరా’ విలన్‌.. వివాదానికి ముగింపు!

ప్రతి రాష్ట్రంలో అన్ని ఎన్నికలని బీజేపీ సీరియస్‌గానే తీసుకుంటుందని, చివరికి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా తమ వారిని బరిలో ఉంచుతుందని, ఇక నుంచి తెలంగాణలో కూడా అలానే ముందుకు వెళ్తామని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అమిత్‌ షా చెప్పినా… పెట్టలేక పోయామని, ఇక నుంచి అలా ఉండబోదని అంటున్నారాయన. ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ బలపడ్డడానికి కారణం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమేనని, తెలంగాణలో సైతం క్షేత్ర స్థాయిలో బలపడాలంటే…ఈసారి గట్టిగా కొట్లాడాల్సిందేనన్న ప్లాన్‌లో ఉన్నారట పార్టీ పెద్దలు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇక నుంచి స్థానిక సమస్యల మీద రెగ్యులర్‌గా ఆందోళనలు చేయాలన్న ప్లాన్‌లో ఉందట తెలంగాణ బీజేపీ. పార్టీ కేడర్‌ను కూడా ఆ దిశగా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

Read Also: Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌!

లోకల్‌ బాడీస్‌ ఎన్నికలంటే….ప్రత్యేకించి కేడర్‌కు సంబంధించినవి కాబట్టి…నేలతంతా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తోందట అధిష్టానం. రాష్ట్ర పార్టీలోని ముఖ్య నేతలకు లోకల్ బాడీస్‌ ఎన్నికల బాధ్యతలు అప్పగించే ఆకాశం ఉందని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు సానుకూల వాతావరణం లేదని, స్థానిక సంస్థలు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో కూడా ఉందన్నది బీజేపీ భావనగా చెప్పుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు నిధులు రావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్న నినాదంతో… ప్రజల్లోకి వెళ్తామని అంటున్నారు పార్టీ నేతలు. అయితే… ఇక్కడే రకరకాల విశ్లేషణలున్నాయి రాజకీయవర్గాల్లో. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం అంత సులువు అయితే కాదన్నది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం చూసుకుంటే… గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకే పూర్తి పట్టు ఉందని, బలపడేందుకు బీజేపీ అనుసరించబోతున్న కొత్త వ్యూహాలు ఎంతవరకు ఫలితం ఇస్తాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version