Site icon NTV Telugu

Off The Record: చంద్రగిరి టీడీపీలో సీటు కోసం అప్పుడే హీటు పుట్టిస్తున్న మహిళా నేత

Chandragiri

Chandragiri

Off The Record: చంద్రగిరి పాలిటిక్స్‌లో కొత్త కేరక్టర్‌ ఎంటరవబోతోందా? ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ టైం ఉండగానే… అప్పుడే టీడీపీ సీటు కన్ఫర్మేషన్‌ కోసం ట్రయల్స్‌ మొదలయ్యాయా? మరొకరు రేస్‌లోకి రాకుండా ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ బిల్డ్‌ చేసుకునే ప్లాన్‌లో ఉన్నారా? మరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పులివర్తి నాని ఏం చేస్తారు? ఆయన స్క్రీన్‌ మీది నుంచి సైడైపోతారా? లేక సీటు పోటీలో ఉంటారా? అసలు చంద్రగిరి టీడీపీలో ఏం జరుగుతోంది?

Read Also: Murder Case : గోల్డ్ వ్యాపారీ మిస్టరీ హత్య..

ఆంధ్రప్రదేశ్‌ పొలిటికల్ స్క్రీన్‌ మీద చంద్రగిరి సీన్స్‌ ఎప్పుడూ కాస్త డిఫరెంట్‌గానే ఉంటాయి. సీఎం చంద్రబాబు స్వగ్రామం ఈ సెగ్మెంట్‌లోనే ఉంది. దాంతో సంబంధం లేకున్నా…ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా… ఎప్పుడూ… ఏదో ఒక గొడవతో రగులుతూనే ఉంటుంది. దీటైన ప్రత్యర్థుల కారణంగా…. పొలిటికల్ హీట్‌ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుందే తప్ప కాస్త కూడా తగ్గదు. చంద్రగిరి నుంచి 2014,19లో వరుసగా రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక గత ఎన్నికల్లో ఆయన కొడుకు మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానితో తలపడినా ఫలితం మాత్రం చెవిరెడ్డి కుటుంబానికి దక్కలేదు‌‌. దాదాపు ముప్పైఏళ్ళ తర్వాత చంద్రగిరిలో నలభై ఐదువేల మెజారిటీతో గెలిచింది టీడీపీ. ఎన్నికలు ముగిసి.. అధికారం మారినప్పటికీ.. ఇక్కడి రాజకీయ వాతావరణంలో ఏ మాత్రం మార్పు లేదు. చెవిరెడ్డి, పులివర్తి సై అంటే సై అంటూ ఎప్పటికప్పుడు కాక రేపుతూనే ఉన్నారు.

Read Also: Temple : మాయమైన హుండీ డబ్బులు ప్రత్యక్షం.. అంతా మిస్టరీ

ఎన్నికల టైంలో పులివర్తి నాని మీద హత్యాయత్నం కావచ్చు, దొంగ ఓట్ల వివాదం, లంచాలు, అవినీతి ఆరోపణలు… ఇలా చెప్పుకుంటే పోతే ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. అలాంటి హై ఓల్టేజ్‌ నియోజకవర్గంలో తాజాగా ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి పొలిటికల్‌ ఇంట్రస్ట్‌ చూపించడం లేటెస్ట్‌ హాట్‌. చంద్రగిరి రాజకీయాల్లో తాను యాక్టివ్‌ అవ్వాలని భావిస్తున్నారట ఆమె. అదేంటి…. భర్త ఎమ్మెల్యేగా ఉన్నారు కదా… మరి ఆమెకు స్థానం ఎక్కడని అంటే… అసలు ట్విస్ట్‌ అక్కడే ఉందన్నది లోకల్‌ టీడీపీ వర్గాల మాట. ఎట్టి పరిస్థితుల్లో చంద్రగిరిలో చెవిరెడ్డికి చెక్‌ చెప్పాలని భావిస్తున్నారట సుధారెడ్డి. అంతలా అమె ఫోకస్ పెట్టడానికి కూడా ప్రత్యేక కారణాలున్నాయంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు, ఫలితాల వెల్లడికి మధ్యలో పులివర్తి నానిపై దాడి జరిగింది. ఆ సందర్భంలో అమె కాలుకు కూడా గాయాలయ్యాయి. అయితే అసలు అటాక్‌ జరగలేదని, సుధారెడ్డి మహానటి అంటూ… తీవ్రంగా విమర్శించారు చెవిరెడ్డి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా… నానితో పాటు సుధారెడ్డిని కూడా గట్టిగానే టార్గెట్‌ చేసింది లోకల్‌ వైసీపీ. ముఖ్యంగా ఓ పంచాయతీ ఈవో పోస్ట్‌ కోసం ఎమ్మెల్యే భార్య 50 లక్షలు లంచం తీసుకున్నారని వైసీపీ ఆరోపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దాంతో ఫైరైపోయిన సుధారెడ్డి చెవిరెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు.

Read Also: Off The Record: వైఎస్కు కేవీపీలా.. రేవంత్కు నేను అన్న వ్యక్తి ఎవరు?

చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మరీ…. రోడ్డు మీదే మాజీ ఎమ్మెల్యేకి బహిరంగంగా ఫోన్ చేశారామె. అప్పుడాయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో… తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ చెవిరెడ్డికి సుధారెడ్డి సవాల్ విసిరడమే కాకుండా… వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచే పోటీ చేస్తా‌‌‌‌….. కాస్కో అని హెచ్చరించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనే నేను పోటీ చేస్తా… చంద్రబాబు ఖచ్చితంగా మహిళగా నాకు అవకాశం ఇస్తారంటూ అప్పట్లో ఆమె చెప్పినా… ఎక్కువ మంది పెద్దగా పట్టించుకోలేదు. అదంతా అప్పటి ఆవేశం అనుకున్నారట. కానీ.. తాజాగా చంద్రగిరి నియోజకవర్గ స్త్రీ శక్తి విజయోత్సవ సభలో మరోసారి తన మనసులోని మాటను సుధారెడ్డి బయట పెట్టడంతో… అదేదో ఆవేశంలోనో, కాకతాళీయంగానో అన్న మాట కాదు.. మేడమ్‌ పిచ్చ క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నాయి చంద్రగిరి టీడీపీ వర్గాలు. కాకుంటే… అదెలా సాధ్యం అన్నదే అంతు చిక్కడం లేదట. పైగా నియోజకవర్గాల పునర్విభజన గురించి కూడా ఆమే చెప్పేశారు. అది జరుగుతుందో లేదో మనకు అనవసర విషయమని కూడా అన్నారామె. 2029 తర్వాత కూడా నానీనే ఎమ్మెల్యే అంటూనే…. నేను రేస్‌లో ఉన్నానని చెప్పడం ఏంటో అర్ధంకావడం లేదట కేడర్‌కు.

Read Also: Dharmavaram Murder: పడగ విప్పిన ఫ్యాక్షన్ .. ధర్మవరంలో అచ్చం సినిమా తరహా మర్డర్

అయితే, ఏంటీ గందరగోళం అనుకుంటూ… కాస్త లోతుగా ఆలోచించగలిగిన వాళ్ళు ఓహో… అదా ఆమె ఉద్దేశ్యం అంటున్నారట. ఇంతకూ అసలు విషయం ఏంటంటే….వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్‌ కచ్చితంగా అమలవుతుందన్నది సుధారెడ్డి అంచనా అట. అదే జరిగితే…
చంద్రగిరి మహిళా కోటాలోకి రావచ్చని, అప్పుడు టీడీపీ అభ్యర్థిగా తానే ఉంటానన్నది ఆమె లెక్కగా చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే…. ఇప్పటి నుంచే… నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ….మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారట. అలా కాకుండా ఒకవేళ అన్నీ తాము ఆశిస్తున్నట్టు జరిగి తిరుపతి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడితే ఇంకా తేలికవుతుందని కూడా లెక్కలేసుకుంటోందట పులివర్తి ఫ్యామిలీ. వైసీపీ తరపున చెవిరెడ్డి ఫ్యామిలీ మెంబర్స్‌ ఎవరు పోటీ చేసినా…. తనకు కూడా రెడ్డి ఫ్యాక్టర్‌ కలిసి వస్తుందని సుధారెడ్డి అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్న సుధారెడ్డి… తాను లెక్కలేసుకుంటున్న పరిణామాలు జరిగితే… పార్టీ తరపున మరో లీడర్‌ ప్రొజెక్ట్‌ అవకుండా…. ముందే కర్చీఫ్‌ వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మేడమ్‌ ముందు చూపు ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి.

Exit mobile version