మలుపులు తిరుగుతున్న రేవంత్, శశిథరూర్ రగడ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీస్థాయి నాయకులు హైదరాబాద్ వస్తుంటే ఇన్నాళ్లూ బీజేపీ నాయకులు టెన్షన్ పడేవారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతల వంతు వచ్చింది. రాష్ట్రంలో టీఆర్ఎస్తో యుద్ధం చేస్తున్న సమయంలో హస్తిన నుంచి వచ్చి ప్రశంసలు కురిపించడం స్థానిక నేతలకు చిర్రెత్తికొస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి గొడవే హైకమాండ్ వరకు చేరి పెద్ద చర్చగా మారి.. రచ్చ రచ్చ అవుతోంది.
శశిథరూర్ కామెంట్స్ రచ్చలో అనేక మలుపులు
Also Read
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
- Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
తెలంగాణలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి. రాష్ట్ర బీజేపీ నేతలు trsని టార్గెట్ చేస్తే.. కేంద్రమంత్రులు వచ్చి రాష్ట్ర సర్కార్‌ను ప్రశంసిస్తారు. ఇది కమలనాథులకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు బీజేపీకే కాదు.. కాంగ్రెస్‌కు కూడా తలనొప్పి వచ్చి పడింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ నేత శశిథరూర్.. ఐటీ రంగంలో హైదరాబాద్‌ని మంత్రి కేటీఆర్ గుర్రం మాదిరి పరుగులు పెట్టిస్తున్నారని కామెంట్ చేశారు. పార్లమెంట్ స్థాయి సంఘం ఛైర్మన్ హోదాలో ఆయన వచ్చినా.. అవి కాంగ్రెస్ నేత చేసిన కామెంట్స్‌గానే జనాల్లోకి వెళ్లడంతో పెద్ద పంచాయితీకి దారితీశాయి.
శశిథరూర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్
శశిథరూర్‌కు క్షమాపణ చెప్పిన రేవంత్
హైకమాండ్‌కు వివరణ ఇచ్చే పనిలో పీసీసీ చీఫ్
టీఆర్ఎస్పై ఒంటికాలిపై లేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి.. శశిథరూర్ కామెంట్స్ మంట పుట్టించాయి. కేటీఆర్ గుర్రమో కాదో కానీ.. శశిథరూర్ మాత్రం గాడిదే అని.. ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపాలని రేవంత్ మండిపడ్డారు. రేవంత్ చేసిన ఈ కామెంట్స్‌కు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో రావడంతో రచ్చ మొదలైంది. ఇది శశిథరూర్‌తోపాటు హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో పరిస్థితి వేడెక్కింది. ప్రైవేట్ చిట్‌చాట్‌లో జరిగిన సంభాషణపై శశిథరూర్‌కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు రేవంత్. దీంతో కాంగ్రెస్‌లో ఈ గొడవ సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో రేవంత్‌కు వ్యతిరేకంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి ఆజ్యం పోశారు. శశిథరూర్‌ను అలా ఎలా అంటారని ఫైర్ అయ్యారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మాత్రం మీడియా తీరును తప్పుపట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా మారిన రేవంత్ మాత్రం.. పార్టీ పెద్దలకు తెలంగాణలో ఏం జరుగుతుందో.. ఏం జరిగిందో చెప్పే పనిలో ఉన్నారట.
శశిథరూర్ రాకపై పీసీసీకి సమాచారం లేదట!
తెలంగాణలో ఐటీ డెవలప్మెంట్కు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని.. దాన్ని కొనసాగిస్తున్నారే తప్ప.. KTR కొత్తగా చేసిందేం లేదన్నది పీసీసీ అభిప్రాయం. కానీ శశిథరూర్ వచ్చి కేటీఆర్‌ను ప్రశంసించి వెళ్లారు. వాస్తవానికి ఆయన తెలంగాణకు వస్తున్న లేదా వచ్చిన సమాచారం పీసీసీకి లేదట. పైగా టీఆర్ఎస్తో ఫైట్ చేస్తున్న సమయంలో శశిథరూర్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ నేతలను ఇరకాటంలో పడేశాయి. దీనిపైనే రేవంత్ అండ్ టీమ్ ఆగ్రహంతో ఉందట.
శశిథరూర్ కామెంట్స్ లోగట్టుపై ఆరా!
శశిథరూర్ ఇక్కడికి వచ్చి అధికారపార్టీని ఎందుకు పొగిడారు అనేది కాంగ్రెస్ నేతల ప్రశ్న. లోగుట్టు ఏదైనా ఉందా..? ఉద్దేశపూర్వకంగా కామెంట్ చేశారా? అనేదానిపై ఆరా తీస్తున్నారట. మొత్తానికి అటు బీజేపీ..ఇటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాలకు జాతీయ నాయకులు పెద్ద తలనొప్పులే తీసుకొస్తున్నారు. మరి.. ఈ రచ్చ నుంచి రేవంత్ ఎలా బయట పడతారో చూడాలి.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?