హుజూరబాద్ లో పోటీకి నో అంటే నో అంటున్న పొన్నం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీలు టిక్కెటిస్తాం అంటే నాయకులెవరైనా ఎగిరి గంతేస్తారు..కానీ ఈ కాంగ్రెస్ నేత మాత్రం హుజూరాబాద్ లో పోటీకి నో అంటున్నారట. పోటీ చేసేది లేదంటే లేదని తేల్చేశారట. ఈ మాజీ ఎంపీ పోటీచేయనని చెప్పటానికి కారణం ఏంటి?
హుజూరాబాద్ అభ్యర్ధి కోసం ప్రధాన రాజకీయ పార్టీలు వేట మొదలు పెట్టాయి. అధికార పార్టీ ఈ పనిలో వ్యూహరచన చేస్తుంటే, కాంగ్రెస్ ఈ కసరత్తులో కొంత వెనుకబడింది. హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధి ఎంపిక కత్తిమీద సాములాంటిదే అని చెప్పాలి. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన కౌశిక్ trs కండువా కప్పుకుంటున్నారు. అయితే ఈ దశలో కౌశిక్ బయటకు వెళ్ళిపోవడమే బెటర్ అని పిసిసి కూడా భావిస్తోందట.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
కానీ, ఇప్పటి వరకు గెలుపు..ఓటముల మీద అంచనాలు వేసుకునే పరిస్థితి నుండి..అభ్యర్ధి ఎంపిక కోసం తంటాలు పడే పరిస్థికి వచ్చింది కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిపేందుకు మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పేరుని పరిశీలిస్తోంది. అయితే… పొన్నం మాత్రం పోటీ చేసేది లేదని స్పష్టం చేశారట. పిసిసి చీఫ్ రేవంత్… దామోదర రాజనర్సింహలకు కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పారట. అటు పార్టీ ఇంఛార్జి ఠాగూర్ కూడా పొన్నం కి మిత్రుడే…ఆయన కి కూడా పోటీ చేసేది లేదని క్లారిటీ ఇచ్చారట.
బీసీ సామాజికవర్గానికి చెందిన పొన్నంను బరిలో నిలిపితే పార్టీ కి కలిసి వస్తుందని లెక్కలు వేసుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మళ్లీ ఎన్నికల బరిలో నిలబడటం సరి కాదని… తనను ఒత్తిడి చేయొద్దని కూడా పొన్నం తేల్చేశారట. దీంతో ఆయన ఇంతగా వద్దనటానికి కారణం ఏమిటనే చర్చ కూడా నడుస్తోంది. ఓ దశలో పొన్నం పార్టీ మారతారా..? అనే టాక్ కూడా మొదలైంది.
దీంతో ఆ విషయంపై కూడా పార్టీకి క్లారిటీ ఇచ్చారట. పార్టీ మారనూ… పోటీ చేయను అని చెప్పేశాడట.
పొన్నం ప్రభాకర్…2018 ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వత వచ్చిన ఎంపి ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ స్థానంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండు ఓటములతో, రాజకీయంగా దెబ్బతినటమే కాక, అసెంబ్లీకి పోటీ చేయకుండా ఉండాల్సిందని భావించారట.
అయితే వరుసల ఓటముల నుండి తేరుకునేలోపు హుజూరాబాద్ కి ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువని పొన్నంని బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నా… ఫలితాలు అనుకూలంగా రాకుంటే .. పొన్నం ప్రభాకర్ ఖాతాలో రెండున్నర ఏండ్లలో మూడు ఓటములు చేరుతాయి. ఇది రాజకీయంగా… పొన్నంకి నష్టం కలిగించే విషయమే. దీంతో ఈ పరిస్థితిలో మళ్లీ హుజురాబాద్ నుండి బరిలో ఉండటం సరికాదని ఆయన భావిస్తున్నారట. అందుకే హుజూరబాద్ లో పోటీకి నో అంటే నో అంటున్నారట పొన్నం.
హుజూరాబాద్ లో ఎన్నికలు కాంగ్రెస్, బీజెపీకు ప్రతిష్టాత్మకం అని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి చోట పోరాడాలంటే ఆర్ధికంగా కూడా బలంగా ఉండాల్సిందే. ఇప్పుడు పార్టీ కూడా అలాంటి సాహసం చేస్తుందనే కూడా నమ్మకం పొన్నం ప్రభాకర్ కు లేదు. ఇలాంటి పరిస్థితిలో బరిలో దిగి దెబ్బతినడం కంటే .. సైలెంట్ గా ఉంటేనే గౌరవం దక్కుతుందని భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్‌లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న నిఖిల్ మూవీ
-
Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!