Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Kodumur Ycp Politics

కోడుమూరు వైసీపీలో ఆగని రగడ..!

Published Date :November 11, 2021 , 10:02 pm
By Manohar
కోడుమూరు వైసీపీలో ఆగని రగడ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏదైనా గొడవ జరిగితే పోలీసులకు చెబుతా.. కేసు పెడతా అంటారు కొందరు. దీంతో ఎదుటి పక్షం భయపడుతుందనేది వాళ్ల అభిప్రాయం. ఆ నియోజకవర్గంలోనూ అంతే..! కాకపోతే ఖాకీల పేరు చెప్పి కాసులు వెనకేసుకుంటున్నారట అధికారపార్టీ నేతలు. వర్గపోరు శ్రుతి మించి రోడ్డెక్కుతున్నారు.

పోలీసుల పేరుతో పార్టీ నేతల వసూళ్లు?

కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌. ఇదే నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్‌ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి. ఎవరి వర్గం వారిదే. మొదటి నుంచి అస్సలు పడటం లేదు. ఈ వర్గపోరు కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పుంజుకుందని ఇప్పటికీ చెప్పుకొంటారు. ఆధిపత్యపోరును వీడి.. కలిసి పనిచేసే పరిస్థితి లేదన్నది స్థానికంగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు
అక్రమ మద్యం, అక్రమ ఇసుక తవ్వకాలు, పోలీసుల పేరుతో మామూళ్ల వసూళ్లు వీరి మధ్య మరింత చిచ్చు పెట్టాయి. పోలీసులపై దాడులు చేసే వరకు వెళ్లాయి కూడా.

ఎమ్మెల్యే పాదయాత్రలో రెండు వర్గాల ఘర్షణ

కోడుమూరు వైసీపీ విభేదాలు గతంలో పార్టీ పెద్దల దృష్టికి వెళ్లాయి. వారు సర్దిచెప్పినా.. సుధాకర్‌, కోట్ల హర్ష వర్గాలు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా కోడుమూరు మండలం గోరంట్లలో SI వేణుగోపాల్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం కలకలం రేపింది. జగన్‌ పాదయాత్ర పూర్తయ్యి నాలుగేళ్లు అయిన సందర్భంగా గూడూరులో ఎమ్మెల్యే నిర్వహించిన యాత్రలో వైసీపీలో రెండువర్గాలు ఘర్షణ పడ్డాయి. పోలీస్‌ ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారంతో గోరంట్లలో అక్రమ మద్యం విక్రేతలను PSకు తీసుకొస్తే ఎమ్మెల్యే సుధాకర్‌ రాత్రి 11 గంటలకు SIకి ఫోన్‌ చేసి వారిని విడిపించుకుని వెళ్లారట.

పోలీసుల పేరు చెప్పి మద్యం వ్యాపారుల నుంచి రూ.2వేల చొప్పున వసూళ్లు..!

గోరంట్ల గొడవలోనే SIని వీఆర్‌కు పంపారని టాక్‌. పోలీసులకు మామూళ్లు ఇవ్వాలని గోరంట్లలో ఎమ్మెల్యే అనుచరుడు మద్యం వ్యాపారుల నుంచి 2 వేల చొప్పున డబ్బులు వసూళ్లు చేస్తున్నారట. ఆ విషయం తెలిసిన ఉన్నతాధికారులు వారిని పట్టుకుని రావాలని SIని పంపితే.. ఆ ఎస్‌ఐపైనే ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారట. దాడి చేయాలని ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న ప్రజాప్రతినిధి.. స్థానికులను రెచ్చగొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడటంపై ఖాకీ బాస్‌లు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.

విభేదాలు శ్రుతి మించి రోడ్డెక్కుతున్నా పార్టీ పెద్దలు మౌనం..!

వైసీపీలో విభేదాలు.. అక్రమ దందాలతో కోడుమూరులో పార్టీ వీక్‌ అవుతోందన్నది కేడర్ ఆందోళన. ఈ సమయంలో ఎమ్మెల్యే, ఇంఛార్జ్‌ ఇద్దరూ మౌనంగా ఉండటం.. వర్గపోరుకే ప్రాధాన్యం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందని కేడర్‌ చెవులు కొరుక్కుంటోంది. శ్రుతిమించి రోడ్డెక్కుతున్న శ్రేణులను గాడిలో పెట్టడానికి పార్టీ పెద్దలు చొరవ తీసుకోవాలని కోరుతున్నారట. మరి.. ఎప్పటిలా చెప్పి ఊరుకుంటారో.. కేడర్‌ ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Kodumur
  • Kodumur YCP politics
  • YCP Politics

తాజావార్తలు

  • Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?

  • Islamabad: ఇరాన్-అమెరికా చర్చల వేళ ఇస్లామాబాద్‌లో హై-టెన్షన్.. భారీగా కమాండోలు మోహరింపు

  • Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

  • Modi-Rahul Gandhi: పార్లమెంట్ దగ్గర మోడీ-రాహుల్‌గాంధీ సంభాషణ.. వీడియో వైరల్

  • Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్‌ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌.. కోరిక తీర్చాలని వేధింపులు..!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions