Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Kakinada Politics

వారం రోజుల్లో కాకినాడ రాజకీయాల్లో కీలక మార్పులు…!

Published Date :September 11, 2021 , 12:38 pm
By Manohar
వారం రోజుల్లో కాకినాడ రాజకీయాల్లో కీలక మార్పులు…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అక్కడ పాగా వేయడానికి రెండేళ్లుగా ఎదురు చూస్తోంది అధికారపార్టీ. ఇప్పుడా ముహూర్తం దగ్గర పడిందా? మేయర్‌ పీఠాన్ని కైవశం చేసుకుంటుందా? జరుగుతున్న పరిణామాలు.. వస్తున్న సంకేతాలు.. పొలిటికల్ ఎత్తుగడలను బలపరుస్తున్నాయా? ఇంతకీ ఏంటా కార్పొరేషన్‌.. ఏమా కథ?

15తో నాలుగేళ్లు పూర్తికానున్న పావని మేయర్‌ పదవీకాలం

Also Read

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?
  • Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
  • Off The Record : కాంగ్రెస్ హనుమంతుడికి పవర్ సంజీవని దొరకదా..?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు లేకపోయినా.. మేయర్‌ పీఠంపై అధికారపార్టీ వైసీపీ గురిపెట్టడమే ఆ వేడి సెగలకు కారణం. ఈ నెల 15తో మేయర్‌ సుంకర్‌ పావని పదవి చేపట్టి నాలుగేళ్లు అవుతుంది. ఆమె టీడీపీ నేత. నాలుగేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మేయర్‌ను మార్పు చేసుకునే వెసులుబాటు ఉండటంతో.. ఆ ముహూర్తం కోసమే ఎదురు చూస్తూ ఉంది వైసీపీ. దాంతో 15 తర్వాత జరిగే పరిణామాలు.. కొత్త మేయర్‌ ఎవరన్నదానిపై వాడీవేడీ చర్చ జరుగుతోంది.

జంపింగ్‌ జపాంగ్‌లతో బలం పెంచుకున్న వైసీపీ!

2017లో కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. నాడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా.. ఇక్కడ వైసీపీతో గట్టిపోరే నడిచింది. చివరకు టీడీపీ మెజారిటీ డివిజన్లు గెలుచుకుని కాపు సామాజికవర్గానికి చెందిన సుంకర పావనిని మేయర్‌ పీఠంపై కూర్చోబెట్టింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ఎఫెక్ట్‌ కాకినాడ కార్పొరేషన్‌పై పడింది. టీడీపీ కార్పొరేటర్లు జంపింగ్‌ జపాంగ్‌లుగా మారిపోయారు. 32 మంది టీడీపీ కార్పొరేటర్లలో ఎక్కువ మంది ప్లేట్‌ ఫిరాయించేశారు. నాడు పది మంది కార్పొరేటర్ల బలమే ఉన్న వైసీపీ శిబిరంలో గోడ దూకిన వారితో కలిపి 35 వరకు చేరుకుందని టాక్‌. తమకు 35 మంది కార్పొరేటర్ల బలం ఉందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే తెలిపారు. ఇటీవల జరిగిన రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఆ స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. ఇప్పుడు మేయర్‌ పీఠంపై ఫోకస్‌ పెట్టారు అధికార పార్టీ నాయకులు.

కొత్త కార్పొరేషన్‌ భవనం పనులు వాయిదా?
15 తర్వాత మేయర్‌ పావనిపై అవిశ్వాసం?

అత్యాధునిక హంగులతో 38 కోట్ల స్మార్ట్‌ సిటీ నిధులతో కాకినాడ కార్పొరేషన్‌ కొత్త భవనం పనులు చేపట్టాల్సి ఉంది. పునాది ఎప్పుడో పడాల్సి ఉన్నా.. అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నెల 15న శంకుస్థాపన చేయాలని అనుకున్నా.. మళ్లీ వాయిదా వేశారు. మేయర్‌ కుర్చీ మార్పే దానికి కారణమని టాక్‌. వైసీపీ మేయర్‌ చేతుల మీదుగా పునాది రాయి వేయడానికి చూస్తున్నారట. 15న తర్వాత మేయర్‌ సుంకర్‌ పావనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. వైసీపీ మహిళా కార్పొరేటర్‌ను ఆ స్థానంలో కూర్చోబెడతారని ప్రచారం జరుగుతోంది. అధికారపార్టీ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్‌నే మేయర్‌ను చేస్తారని చర్చ నడుస్తోంది. ఒకసారి ఆ మార్పు జరిగిపోతే.. కాకినాడ కార్పొరేషన్‌పై వైసీపీ జెండా ఎగరేసి.. కొత్త భవనం శంకుస్థాపన పనులు మొదలు పెడతారట.

వైసీపీ నుంచి కొత్త మేయర్‌ ఎవరు?

ప్రస్తుతం అందరి దృష్టీ 15వ తేదీపై నెలకొంది. కొత్త మేయర్‌ ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. వన్స్‌ తమ వ్యక్తి మేయర్‌ కుర్చీలో కూర్చుంటే.. ఏడాది తర్వాత జరిగే ఎన్నికల నాటికి పూర్తిగా పాగా వేయొచ్చన్నది అధికార పార్టీ ఆలోచన. మరి.. ఈ వారం రోజుల్లో కాకినాడలో జరిగే రాజకీయ మార్పులు ఎలా ఉంటాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kakinada
  • kakinada mayor
  • kakinada politics

తాజావార్తలు

  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!

  • GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?

  • Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!

  • LSG vs KKR: కోల్‌కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?

  • Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0” ప్రారంభం.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions