Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Ap Ycp

పదవి వచ్చిన మూడు నెలలకే మూడాఫ్…?

Published Date :November 12, 2021 , 6:29 pm
By Lakshmi Narayana
పదవి వచ్చిన మూడు నెలలకే మూడాఫ్…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పదవి వచ్చిన మూడు నెలలకే ఆయన మూడ్‌ ఆఫ్‌ అయింది. ఛైర్మన్‌ పోస్ట్‌ ఉన్నట్టా.. లేనట్టా అని ఒక్కటే అనుమానం. కనీసం కుర్చీ కూడా లేదు. దీంతో లబోదిబోమంటున్నారట ఆ నాయకుడు. ఆయనెవరో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

ఛైర్మన్‌ పదవి ఇచ్చారు.. కుర్చీ లేదు..!

రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్‌గా వైసీపీ నేత చందన నాగేశ్వర్‌ను నియమించి మూడు నెలలైంది.
ఇంతవరకు ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఇందుకు కారణం పదవి ఇష్టం లేక కాదు.. పదవి ఇచ్చారు కానీ కుర్చీ కేటాయించలేదు. స్మార్ట్ సిటీ చైర్మన్‌కు కుర్చీ ఎక్కడ వేయాలనేది చర్చగా మారింది. రాష్ట్రంలో అన్ని స్మార్ట్ సిటీ చైర్మన్ల పేర్లుతో చందన పేరును అధికారికంగా ప్రకటించారు. ఆ జాబితాలో ఉన్నవారిలో చందన తప్ప మిగతావారంతా బాధ్యతలు చేపట్టేశారు కూడా.

రాజమండ్రిని స్మార్ట్‌ సిటీగా గుర్తించని కేంద్రం..!

కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీగా రాజమండ్రిని గుర్తించలేదు. స్మార్ట్‌ సిటీని చేయాలనే డిమాండ్‌ ఉంది. అన్ని పక్షాలు ఈ డిమాండ్‌ను తమ అజెండాలో చేర్చుకున్నాయి. ఎంపీ భరత్‌రామ్‌ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం రాజమండ్రిని స్మార్ట్‌ సిటీని చేస్తుందని.. అదిగో..ఇదిగో అంటూ ఎదురు చూడటమే సరిపోతోంది. ఢిల్లీ నుంచి ఎలాంటి ఉలుకు.. పలుకు లేకపోయినా.. స్మార్ట్‌ సిటీ కాని రాజమండ్రికి చందన నాగేశ్వర్‌ ఛైర్మన్‌ అయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడానికి సాంకేతిక అంశాలు అడ్డుగా మారాయి.

పదవి ఉందా.. రద్దు చేస్తారా అని డైలమా?

అసలు లోగట్టు ఇలా ఉంటే.. స్మార్ట్‌ సిటీ ఛైర్మన్‌ హోదాలో చందన నాగేశ్వర్‌కు రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని డిప్యూటీ మేయర్‌ ఛాంబర్‌ను కేటాయించాలని కమిషనర్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయట. 3 నెలలుగా ఈ విషయం ఎటూ తేలడం లేదు. పదవి దక్కినా.. అది ప్రకటనకు పరిమితం కావడం.. కుర్చీ లేకపోవడంతో చందన మూడ్‌ ఆఫ్‌ అయినట్టు సమాచారం. స్మార్ట్‌ సిటీ చైర్మన్‌ పదవి ఉంటుందా? లేక రద్దు చేస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయట.

ఆదిలోనే వికటిస్తున్న చికిత్స..!

సమస్యలతో కునారిల్లుతున్న రాజమండ్రి వైసీపీని గాడిలో పెట్టేందుకు చందన నాగేశ్వర్‌కు నామినేటెడ్‌ పదవి ఇచ్చి చికిత్స చేయాలని చూశారు. ఇప్పటికే ఇద్దరు వైసీపీ కోఆర్డినేటర్లు మారారు. మూడో కో ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వచ్చారు. అనారోగ్యంతో ఆయన యాక్టివ్‌గా లేరు. చందన నాగేశ్వర్‌ రాజమండ్రి రూరల్‌ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన పరిధిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని పది డివిజన్లు ఉన్నాయి. పదవి ఇవ్వడంతో ఇక్కడ పార్టీ ఇంకా బలపడుతుందని వైసీపీ నేతలు లెక్కలేసుకున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో సీన్‌ రివర్స్‌. మరి.. ఈ సమస్యను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో.. మూడ్‌ ఆఫ్ అయిన నేతలో తిరిగి చురుకు పుట్టించడానికి ఏం చేస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhra pradesh ycp
  • off the record
  • ycp

తాజావార్తలు

  • Virat Kohli: “చార్టర్డ్ ఫ్లైట్ కావాల్సిందే”.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!

  • Deputy CM Pawan Kalyan: ప్రధాని మోడీ ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ.. అభినందనలు తెలిపిన పవన కల్యాణ్‌..

  • Teja sajja : తేజ సజ్జ కొత్త స్టెప్ ఆయన కెరీర్‌కు ప్లస్ అవుతుందా? లేక రిస్క్‌గా మారుతుందా?

  • Tollywood : స్ట్రాంగ్ కంబ్యాక్ ట్రై చేస్తున్న ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన ఇద్దరు సీనియర్ హీరోలు

  • MI Captain Change: ‘ముంబై ఇండియన్స్’ కెప్టెన్సీ నుండి ‘హార్దిక్ పాండ్య’ అవుట్..? కొత్త కెప్టెన్ గా..!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions