Off The Record: నెల్లూరు జిల్లా టీడీపీలో అంతులేని మౌనం..
- నెల్లూరు జిల్లా టీడీపీలో అంతులేని మౌనం..
- వైసీపీ చెలరేగి విమర్శలు చేస్తున్నా నోరు మెదపని వైనం..
- వైసీపీ ఆరోపణలను కనీసం డిఫెన్స్ చెయ్యని అధికార పార్టీ నేతలు..
- పవర్ మారితే వేటాడతారని నోరు కట్టేసుకున్నారా?..
- వైసీపీని పల్లెత్తు మాటా అనకుంటే పార్టీకే డ్యామేజ్ అని చర్చ..
- నెల్లూరు టీడీపీ సీనియర్ల తీరును పట్టించుకోవాలని హైకమాండ్‌కు క్యాడర్ వినతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: సింహపురిలో అధికార పార్టీ నేతలు సమన్వయ లోపంతో ఇబ్బంది పడుతున్నారట. ఒకరిలో ఒకరికి కోఆర్డినేషన్ లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ నేతల విమర్శలను దీటుగా ఎదుర్కోలేకపోతున్నారట. జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర మొదలుకొని.. మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సైతం వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్న ప్రచారం సైకిల్ పార్టీలో వినపడుతోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయంగా వాడుకునేది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలందరూ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఒకరిద్దరూ నేతలు అధిష్టానంపై అసంతృప్తితో ఉంటే..మరికొందరు మాత్రం నియోజకవర్గాల్లో ఆదాయ వనరులపై దృష్టి పెట్టారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వైసీపీ నేతల పోరాటాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నిజమేనన్న ప్రచారం జిల్లాలో జరుగుతోంది. సింహపురిలో ఒక్క సీటు కూడా గెలవని వైసీపీ..ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్నా.. డిఫెన్స్ చేసే స్థితిలో కూడా అధికార పార్టీ నేతలు లేరట. సీఎం చంద్రబాబుతో పాటు.. లోకేష్ పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఆయనకు కౌంటర్ ఇచ్చే నేతలు అధికార టిడిపిలో కనిపించడం లేదని ప్రచారం సాగుతోంది. మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డితో పాటు నారాయణ సైతం జిల్లా రాజకీయాలను పెద్దగా పట్టించుకోవడం లేదట. నేను నా అమరావతి, నెల్లూరు సిటీ అంటూ మంత్రి నారాయణ వ్యవహరిస్తూ ఉంటే.. మంత్రి ఆనం మాత్రం ఆలయాలు, నైవేద్యాలు అంటూ తిరుగుతున్నారని క్యాడర్ నిట్టూరుస్తోంది.
Also Read
జిల్లా అధ్యక్షునిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రవిచంద్ర కూడా వైసిపి నేతల విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్నారట. వాళ్లు నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంటారు ప్రతిదానికి మనం స్పందించాలా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారట ఇతర నేతలు. ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్ లు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు తప్ప.. రాష్ట్ర రాజకీయాలపై గట్టిగా మాట్లాడటం లేదన్న టాక్ వినిపిస్తోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆనం వెంకటరమణారెడ్డి సైతం సైలెంట్ మోడల్‌లోకి వెళ్లిపోయారట. నెల్లూరు యాసలో వైసీపీ అధినేత జగన్ తో పాటు.. అజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై గతంలో తీవ్ర విమర్శలు చేసేవారు. అయితే, తాను ఆశించిన పదవి రాలేదన్నఅలకతో ఆయన మౌనంగా వున్నారని తెలుస్తోంది.
టీడీపీలో నోరున్న నేతలందరూ వైసీపీని పల్లెత్తు మాటా అనకుంటే పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. నేతలే సైలెంట్‌గా ఉంటే ఇక మాకెందుకు అన్నట్లుగా మండల స్థాయి నేతలు కూడా నోరు మెదపడం లేదట. ఆవేశంతో ఏదేదో మాటలాడేస్తే.. అధికారం మారితే అడ్డంగా బుక్ అవుతామేమో అన్న ఆలోచనలో నెల్లూరు టీడీపీ నేతలు ఉన్నారట. మరికొందరు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనే భావనలో డబ్బు సంపాదనలో నిమగ్నమయ్యారట. ఇలా తమ్ముళ్లందరూ సైకిల్ కి కొత్త బ్రేకులు వేసుకుని.. రాజకీయం నడిపిస్తున్నారట. అయితే, వైసీపీ విమర్శలకు దీటుగా సమాధానమిచ్చేలా నేతలను ఆదేశించాలని అధిష్టానాన్ని కోరుతున్నారట కార్యకర్తలు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!