Off The Record: పల్నాడు నేతలకు చెమటలు పడుతున్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి గుంటూరు టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు సీనియర్లకు తలనొప్పి తెప్పిస్తున్నాయట. ఎన్నిక ఎన్నికకు ఎవరో ఒకర ఉరావడం ఫ్లెక్సీలు వేయడం…ఈ సారి సీటు నాదే…పోటీ నాదే అంటున్నారట. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఇలాంటి ఎఫెక్ట్ ఇంకోసారి పడిందట. ఈ వ్యవహారంపై ప్రత్యర్థి పార్టీలు …చర్యే అవసరం లేదు. కానీ దీని కథ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంత టీడీపీ నేతలేనట.
Also Read
పల్నాడులో కీలక నాయకులకు చమటలు పట్టిస్తున్నారు చోటామోటా నాయకులు. రాబోయే ఎన్నికల్లో మేము సైతం రంగంలోకి దిగబోతున్నామంటూ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు పెద్ద నాయకులకు చికాకు పుట్టిస్తున్నాయట. అధిష్టానం కీలక నేతలతో ఒకటి రెండు ఫోటోలు దిగటం, ఆ ఫోటోలని తీసుకువచ్చి పెద్దపెద్ద ఫ్లెక్సీలు వేయించడం, రాబోయే ఎన్నికల్లో మేము సైతం ఎన్నికల బరిలో నిలవబోతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా గురజాలలో… ఇటీవల కాలంలో టిడిపి నుంచి పోటీ చేస్తామని ఒకరిద్దరు చోటా నాయకులు రంగ ప్రవేశం చేశారు. ఇది టిడిపి ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి ఇబ్బందులు సృష్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి గురజాల నియోజకవర్గంలో టిడిపి నుండి యరపతినేని అభ్యర్థిగా ఉంటారనేది నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాంటి నాయకుడి ఇలాకాలో కూడా టిడిపి నుంచి వర్గ విధాలు పుట్టుకొస్తున్నాయి. దీనికి పరోక్షంగా జిల్లాలోని కొంతమంది నాయకులు సహకరిస్తున్నారనేది యరపతినేని వర్గీయుల వాదనట.
మరోవైపు అధిష్టానం ఇలాంటి వాటికి చెక్ పెట్టకపోవడంతో నియోజకవర్గంలో కొత్త కొత్త చర్చలు జరుగుతున్నాయట. నియోజకవర్గానికి చెందిన చల్లగుండ్ల శ్రీనివాసరావు…తాను గురజాల సీటు ఆశిస్తున్నానని…త్వరలోనే పోటీ చేస్తానని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నాడట. అంతేకాదు…వెల్‌కమ్ చెబుతూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేశారు. యరపతినేని ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఉండటంతో స్థానికంగా కలకలం రేపింది… ఇదేం అని అడిగితే తనకు యరపతినేనితో సంబంధం లేదని, అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారట. రాబోయే ఎన్నికల్లో గురజాలలో టిడిపి నుంచి పోటీ చేయబోతున్నానని సదరు డాక్టర్ సెలవు ఇచ్చారట. అయితే ఈ డాక్టర్ వెనక డెల్టా ప్రాంతానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నారట. గతంలో టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఉండే నాయకుడు ఒకరు గురజాల ప్రాంతంలో పోటీ చేస్తానని ఇలాగే తిరిగాడు. ఆ సమయంలో కూడా… పార్టీ కార్యాలయంలో ఉన్న కొందరు నేతలు…యరపతినేని టార్గెట్‌గా…అతన్ని రంగంలోకి దింపారట.
యరపతినేనికి వ్యతిరేకంగా వర్గాలు కడుతున్న నేతలు…నియోజకవర్గంలో చిన్న కమ్మ, పెద్దకమ్మ అంటూ టిడిపిలో చీలిక తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. గతంలో కూడా యరపతినేనికి ఇదే అంశంలో కొందరు వ్యక్తులు గురజాలలో పోటీ దిగుతామని ప్రచారం చేసుకున్నారట. ఇప్పుడు తెరమీద కాదు కాదు ఫ్లెక్సీ మీదకు వచ్చిన డాక్టర్ శ్రీనివాసరావు కూడా చిన్న కమ్మ, పెద్ద పేరుతో పోటీ అంటున్నాడట. పలనాడు ప్రాంతం బలమైన నాయకుడిగా…అధిష్టానంతో సంబంధాలు ఉన్న సీనియర్ నేతగా ప్రచారం ఉన్న యరపతినేనికి…స్థానిక నాయకులతో వస్తున్న ప్రచారం చికాకు తెప్పిస్తోందట. యరపతినేని లాంటి నాయకుడికి సీటుపై క్లారిటీ లేకపోవడంతో…నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ పోటీకి రెడీ అవుతున్నామని కార్యకర్తల దగ్గర ప్రస్తావించడం, దీనిని అధిష్టానం సైతం ఖండించలేకపోవటం విశేషం.
యరపతినేనితో పడని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొందరు పార్టీ నేతలే దీని వెనుక ఉండి నడిపిస్తున్నారట. దీనికి అధిష్టానం కూడా ఇతోధికంగా సాయం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. లేదంటే ఇలాంటి వార్తలు వచ్చిన వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకుంటే వ్యవహారం ముదిరేదికాదు. లేదంటే రాబోయే రోజుల్లో టిడిపిలో వర్గ విభేదాలు మరింత రాజుకొని పలనాడు ప్రాంతంలో చీలికలు తెచ్చినట్లుగానే డెల్టా ప్రాంతంలోని కొంతమంది నేతలను టార్గెట్ చేసే వ్యూహాలు రచించుకుంటున్నారట. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం కదా అన్న కామెంట్లతో భవిష్యత్తులో టిడిపిలో పల్నాడు, డెల్టా ప్రాంతాల నాయకుల ఆధిపత్య పోరు కొనసాగే అవకాశం ఉందనేది జిల్లాలో జరుగుతున్న ప్రధాన చర్చ ….మరి చూడాలి ఈ గ్రూపు రాజకీయాలకి టిడిపి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో ? ఎలా క్లారిటీ ఇస్తుందో! …
తాజావార్తలు
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!