Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Sathupalli Congress Internal Rift Illegal Sand Smuggling Cases Ap Sand Policy

OTR: సత్తుపల్లి నేతలకు వరంగా మారిన ఏపీ ఉచిత ఇసుక పాలసీ

Published Date :April 8, 2026 , 9:00 pm
By Shiva Ganesh
  • సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్‌లో ఇసుక దుమారం?
  • నియోజకవర్గ ముఖ్య నేతకు కావాల్సిన వాళ్ళ మీద కేసులు
  • నిందితుల్లో ఓ మహిళ పేరు ఉండటంతో పెరుగుతున్న ఆరాలు
  • అధికార పార్టీలోని వర్గ విభేదాలే కేసులకు కారణమా?
  • సత్తుపల్లి నేతలకు వరంగా మారిన ఏపీ ఉచిత ఇసుక పాలసీ
  • గత ఆరు నెలల్లో అక్రమ రవాణాతో కోట్లు వెనకేసుకున్నారా?
  • సత్తుపల్లి నియోజకవర్గంలోకి రోజూ 50 లారీల ఏపీ అక్రమ ఇసుక?
  • ఇన్నాళ్ళు చూసీ చూడనట్టు వదిలేసిన పోలీసులు
  • నా దగ్గరికి రావద్దని సత్తుపల్లి నేతలకు ఓ మంత్రి చెప్పేశారా?
  • కాంగ్రెస్‌ పార్టీలోని విభేదాల కారణంగానే గొడవ రచ్చకెక్కిందన్న అభిప్రాయం
OTR: సత్తుపల్లి నేతలకు వరంగా మారిన ఏపీ ఉచిత ఇసుక పాలసీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

OTR: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇసుక దుమారం రేగుతోంది. అక్రమ రవాణాకు సంబంధించి నాలుగు రోజుల క్రితం ఒక ప్రధాన ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుల మీద కేసులు బుక్ అయ్యాయి. ఈ వ్యవహారంలో 8 మందిపై కేసులు పెడితే… అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. భార్యాభర్తలు, కొడుకు…. ఇలా ఆ ముగ్గురూ సత్తుపల్లిలోని అధికార పార్టీ ముఖ్యనేతకు కావాల్సిన వాళ్ళు అవడం ఇంకా సంచలనమైంది. కొద్ది రోజులుగా సత్తుపల్లి ఏరియాలో ఇసుక అక్రమ రవాణా అడ్డసుడిగా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. పోలీసులు కేసులు బుక్‌ చేస్తున్నా… అవి చిన్న వాళ్ళమీదే ఉంటున్నాయి. కానీ… మొట్టమొదటిసారి ఇప్పుడు నియోజకవర్గ ముఖ్యనేత అనుచరుడి పైనే కేసు నమోదవడంతో… అందరి దృష్టి ఒక్కసారిగా ఇటువైపు మళ్ళింది. అంతకు మించి మహిళను కూడా నిందితురాలిగా చేర్చడంతో సత్తుపల్లి కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందంటూ ఆరాలు పెరిగిపోతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడి ప్రజాప్రతినిధులు భారీ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేశారు. అక్రమాలను సహించేది లేదని, ఇసుక, మట్టి దందాల్లో ఎవ్వరున్నా ఒప్పుకోబోమని బహిరంగ వేదికల మీదే ప్రకటించేశారు. తీరా… ఇప్పుడు అలాంటి నాయకుల అనుచరుల మీదే కేసులు నమోదవడం చర్చనీయాంశమైంది.

READ ALSO: OTR: ప్రభుత్వం టార్గెట్‌గా పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న ప్రతిపక్షం..!

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

ఇందుకు అధికార పార్టీలోని వర్గ విభేదాలే కారణమా అన్న డౌట్స్‌ కూడా వస్తున్నాయట చాలామందికి. అదే సమయంలో సత్తుపల్లి పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళడం కూడా మరో రీజన్‌ అయి ఉండవచ్చంటున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం ఏపీ సరిహద్దులో ఉంటుంది. అక్కడ ఇసుక ఉచితం. దీన్ని ఆసరా చేసుకుని టిప్పర్ల ద్వారా ఇసుకను ఆంధ్రప్రదేశ్‌ నుంచి అక్రమ మార్గాల్లో సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు మండలాలకు తరలిస్తున్నారు కొందరు. తాజాగా సీజ్‌ అయిన టిప్పర్లు కూడా ఆ బాపతువే. మూడు వాహనాలను సీజ్‌ చేసి 8 మందిపై కేసు పెట్టారు అధికారులు. ఏపీలోని కొవ్వూరు ర్యాంప్‌ నుంచి ఈ ఇసుక వచ్చినట్టు గుర్తించారు. గడిచిన ఆరు నెలల్లో ఇలా కోట్ల రూపాయల విలువైన ఇసుకను సరిహద్దు దాటించి తెలంగాణకు అక్రమంగా తరలించినట్టు లెక్కలు కడుతున్నారు ఆఫీసర్స్‌. తూర్పు గోదావరి జిల్లాలోని ఎర్రగుంటపల్లి, విస్సన్నపేట నుంచి రోజుకు 50 లారీల గోదావరి ఇసుక ఇక్కడికి వస్తోందట.

ప్రాథమికంగా దీని బేస్‌ సత్తుపల్లే అయినా… ఈ నెట్‌వర్క్‌ హైదరాబాద్‌ దాకా విస్తరించినట్టు చెబుతున్నారు. ఈ అక్రమ రవాణాలో అధికార పార్టీ నాయకుల ప్రధాన అనుచరులే కీలకంగా ఉండటంతో…. పోలీసులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్నది ఖమ్మం జిల్లాలో వినిపిస్తున్న మాట. అందుకే కొంత మంది ఆకాశ రామన్న ఫిర్యాదులు చేయడంతో వరంగల్ జిల్లా యూనిట్ విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన నేత అనుచరుడుగా ఉన్న దొడ్డా శ్రీనివాసరావు భార్య మీద కూడా.. నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం చూస్తుంటే… ఇక ఎవ్వరికీ మినహాయింపు ఉండబోదని సంకేతాలిచ్చినట్టయిందని అంటున్నారు. ఆమెను తప్పించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఒక మంత్రి దగ్గరికి ఆఘమేఘాల మీద పరుగులు పెట్టారట. కానీ…. ఇలాంటి వాటిలో నేను జోక్యం చేసుకోను, ఇక మీదట కూడా ఇలాంటివి నా దగ్గరికి తీసుకురావద్దని సూటిగా, సుత్తిలేకుండా చెప్పేశారట సదరు మినిస్టర్‌. ఆ సంగతి ఎలా ఉన్నా….సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత ప్రధాన అనుచరుడి మీద పోలీసులు కేసు పెట్టడానికి మాత్రం కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత విభేదాలే కారణమన్న వాదన బలంగా ఉంది. దీని పర్యవసానాలు ఎట్నుంచి ఎలా మారతాయో చూడాలి.

READ ALSO: OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పాత కొత్త వివాదం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Free Sand Policy Impact
  • Dodda Srinivasa Rao Case
  • Illegal Sand Transport Khammam
  • Khammam Congress Internal Issues
  • Minister Reaction on Sathupalli Scandal.

తాజావార్తలు

  • Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?

  • Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!

  • Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..

  • Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?

  • Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!

ట్రెండింగ్‌

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions