Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Otr Telangana Politics Heat Up As Opposition Targets Government Ministers Silent

OTR: ప్రభుత్వం టార్గెట్‌గా పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న ప్రతిపక్షం..!

Published Date :April 8, 2026 , 9:52 pm
By Kothuru Ram Kumar
OTR: ప్రభుత్వం టార్గెట్‌గా పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న ప్రతిపక్షం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

OTR: పొలిటికల్‌ పిడుగులు పడుతున్నా.. పెదవి విప్పరు. ఆరోపణల ఉరుములు ఉరుముతున్నా.. అణు మాత్రం కూడా స్పందించరు. అసలు అనేది నన్ను కాదుకదా… అన్న ధోరణి పెరిగిపోతోంది. తెలంగాణ మంత్రులంతా ఈ ప్రభుత్వం మాది అని ఓన్‌ చేసుకోవడం లేదా? అందుకే ప్రతిపక్షం అనేది నన్నుకాదుకదా…. నా దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారా? ప్రతిపక్షానికి కౌంటర్స్‌ వేయమని మంత్రులకు ముల్లుగర్రలు పెట్టి పొడిచి చెప్పాల్నా? తెలంగాణ కేబినెట్‌లో అసలేం జరుగుతోంది?

సమ్మర్‌ సెగలతో పాటే తెలంగాణలో రాజకీయ వేడి కూడా పెరిగిపోతోంది. గడిచిన వారం రోజులుగా ప్రధాన ప్రతిపక్షం రాష్ట్ర మంత్రులను గట్టిగా టార్గెట్ చేస్తోంది. ఒక రోజు భూములని, ఇంకో రోజు ప్రాజెక్టులను ముందు పెట్టి పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది. కానీ, గవర్నమెంట్‌ వైపు నుంచి వాటిని సరైన కౌంటర్స్‌ ఉండటం లేదు. ఇదంతా చూస్తున్న చాలా మందికి కొన్ని కొత్త డౌట్స్‌ వస్తున్నాయట. ప్రజల్లో ప్రభుత్వాన్ని పలచన చేసే ప్రయత్నం జరుగుతున్నా.. అధికారపక్షం ఎందుకు మౌనంగా ఉంది?, ఎవర్ని విమర్శిస్తే వాళ్లే సమాధానం చెప్పుకోవాలా..? లాంటి సవాలక్ష సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఒక మంత్రిని ప్రతిపక్షం టార్గెట్ చేస్తే.. క్యాబినెట్లో ఉన్న మిగిలిన మంత్రులు ఎవరూ స్పందించే పరిస్థితి లేదు. అందుకే అనుమానాలు పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఒకరిద్దరు మంత్రులే లక్ష్యంగా ప్రతిపక్షం పావులు కదుపుతోంది.

Peddi: ‘జిగేలు రాణి’ని మించిపోయేలా ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్?

కానీ అధికార పక్ష నుంచి దీటుగా సమాధానం రావడం లేదు. ప్రతిపక్షం చేసే ఆరోపణలు వాస్తవమా, అవాస్తవమా అన్న సంగతి పక్కన పెడితే.. కనీసం దాని మీద ఇట్నుంచి రియాక్ట్‌ అయితేనే కదా.. ప్రజలకు వాస్తవాలు తెలిసేది అన్న చర్చ కాంగ్రెస్‌లో మొదలైంది. పార్టీ నేతలు ఒకరిద్దరు స్పందిస్తున్నా.. అది ప్రతిపక్ష నాయకుల స్థాయికి తగ్గట్టు లేకపోవడంతో అధికార పక్షం చెప్పే వాదన ప్రాచుర్యంలోకి రావడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల నుంచి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ప్రతిపక్షం పావులు కదుపుతోంది.

ఈ ముగ్గురు నేతలు పూర్తిగా కేరళ ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నారు. అయినాసరే.. ప్రతిపక్ష ఆరోపణల మీద మిగిలిన మంత్రులు స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా ప్రతిపక్షం వారం రోజుల నుంచి ప్రభుత్వంపై నిందలు మోపుతుంటే.. మళ్లీ అదే మంత్రులు వచ్చి చెప్పుకునేదాకా ఇక్కడ రియాక్షన్ లేదు. సాధారణంగా క్యాబినెట్లో ఒక మంత్రిని టార్గెట్ చేస్తున్నారంటే అది పూర్తిగా ప్రభుత్వంపై యుద్ధం చేయడం లాంటిదే. కానీ ఆ విషయం నాదాక రాదులే అని చాలామంది మినిస్టర్స్‌ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

గతంలో ప్రభుత్వంపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా.. క్యాబినెట్ నుంచి పొన్నం ప్రభాకర్. కొండా సురేఖ, సీతక్క లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు. కానీ… కొన్ని సందర్భాల్లో ఆయా మంత్రులకు అండగా నిలబడలేదన్న కారణంతో మాట్లాడే వాళ్లు కూడా తగ్గించేశారన్న అభిప్రాయం ఉంది. దీంతో…ఇప్పటికైనా ప్రభుత్వం మీద గాని, పార్టీ మీద గాని ఆరోపణలు వస్తే వెంటనే స్పందించేందుకు పార్టీ సీనియర్ నేతలను రంగంలోకి దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. మంత్రులు గాంధీభవన్ కి వచ్చి మీడియా సమావేశాలు పెట్టడమే మర్చిపోయారు.

ఇటీవల జూపల్లి మాత్రం కృష్ణా జలాల వివాదంపై మాట్లాడేందుకు వచ్చారు. మిగిలిన వాళ్ళు గాంధీభవన్ ని వదిలేసి చాలా రోజులైనట్టు కనపడుతోంది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అయినా జోక్యం చేసుకుని మంత్రులకు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీలోని సీనియర్ నేతలను ఇప్పటికైనా రంగంలోకి దించాలని అంటున్నారు. కేవలం ప్రతిపక్షం ఆరోపించిందనే కాకుండా.. ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పుకోవడానికి కూడా గాంధీభవన్ లో మంత్రులు మీడియా సమావేశాలు పెడితే తప్పేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచింది. ఇప్పటికైనా మంత్రులు, పార్టీ నాయకత్వం మరింత దూకుడు పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. అటు Pcc చీఫ్ మహేష్ గౌడ్ కూడా జిల్లా పర్యటనలు శ్రీకారం చుట్టారు. ఐతే మంత్రులు… సీనియర్ నేతలు అలెర్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉందన్నది హస్తం నేతల మాట. ప్రభుత్వం మీద జరిగే దాడిని ఖండించడానికి MLc అద్దంకి దయాకర్, వెంకట్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ చామల కిరణ్ లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు తమకు సంబంధం లేదన్నట్టు ఉంటున్నారన్నది కాంగ్రెస్‌ వాయిస్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress party Telangana
  • Gandhibhavan
  • Opposition vs Government
  • PCC Chief Mahesh Goud
  • Political Heat Telangana

తాజావార్తలు

  • OTR: ప్రభుత్వం టార్గెట్‌గా పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న ప్రతిపక్షం..!

  • OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పాత కొత్త వివాదం

  • Kadiri YSRCP Politics: కదిరి వైసీపీలో మూడు రెక్కలాట.. బాషా, మక్బూల్, పూల మధ్య గేమ్‌!

  • Wankhede Stadium Honors: ముంబైలో భారీ వేడుక.. శాస్త్రి స్టాండ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కు ఫెలిసిటేషన్..!

  • Peddi: ‘జిగేలు రాణి’ని మించిపోయేలా ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions