Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?

  • విపక్షానికి కౌంటర్స్‌ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్‌?
  • ఎల్‌నినో నుంచి యాదాద్రి ప్లాంట్‌ వరకు దూకుడుగా బీఆర్ఎస్‌
  • ప్రతిదానికి ముఖ్యమంత్రే రియాక్ట్‌ కావాల్సి వస్తోందన్న ఫీలింగ్‌
  • ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్న
  • యాదాద్రి పవర్‌ ప్లాంట్‌కు బొగ్గు దిగుమతిపై పేపర్లు బయటపెట్టిన సీఎం
  • మొదట్లో ఐదారుగురు మంత్రులు మాట్లాడినా ఇప్పుడు తగ్గిన సంఖ్య
  • సీఎంని, పార్టీని తిడితే మాకేం సంబంధమని మంత్రులు వదిలేస్తున్నారా?
  • సీఎం స్వయంగా చెప్పాక ఇకనైనా స్పందిస్తారా? లేక పాత పాటేనా?
Telangana Politics

Telangana Politics

Off The Record : తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, కేబినెట్‌ మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. విపక్షం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్స్‌ ఇచ్చే విషయంలో పార్టీ నాయకులకు ఒక రకంగా క్లాస్ తీసుకున్నారాయన. ఎల్‌నినో కరువు మొదలుకుని… యాదాద్రి పవర్ ప్లాంట్‌కు విదేశీ బొగ్గు దిగుమతి ఒప్పందం వరకు అన్నిటి మీద దూకుడుగా ప్రచారం చేస్తోంది బీఆర్‌ఎస్‌. కానీ… అధికారపక్షం నుంచి అంతే ధీటుగా కౌంటర్ ఉండటం లేదన్నది పొలిటికల్‌ ఓపెన్ టాక్. సమస్య ఏదైనాసరే…. ప్రతిదానికి సంబంధించి CM రేవంత్ రెడ్డే మాట్లాడుకోవాల్సి వస్తోందన్న అభిప్రాయం సైతం ఉంది. సీఎంకు కుదిరి, ఆయన మాట్లాడేలోపు… జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అయినాసరే… దీన్ని పార్టీగానీ.. మంత్రులుగానీ గుర్తించడం లేదా..? అంటే…. వాళ్ళు అంత అమాయకులేం కాదన్నది విస్తృతాభిప్రాయం. అయితే…. అదే సమయంలో వాస్తవాలు చెప్పడానికి కూడా అధికార పార్టీలో ఉన్న MLAలు… కేబినెట్ ఉన్న మంత్రులు ఎందుకు ముందుకు రావడం లేదన్నది బిగ్‌ క్వశ్చన్‌. ఈ పరిస్థితుల్లో…. బయటకు రండి, వాస్తవాలు చెప్పండంటూ అందరికీ నేరుగానే చెప్పేశారు సీఎం.

యాదాద్రి పవర్ ప్లాంట్‌కి విదేశీ బొగ్గు దిగుమతి ఒప్పందం పై… మీడియా సమావేశంలో డాక్యుమెంట్స్‌తో సహా ముఖ్యమంత్రి బయట పెట్టే వరకు బయట క్లారిటీ లేదు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తాలూకు పత్రాలను నేరుగా రేవంత్ బయట పెట్టిన తర్వాతనే దానిపై బీఆర్‌ఎస్‌ మాట్లాడ్డం మానేసిందన్నది కాంగ్రెస్‌లోని ఓ వర్గం వాదన. అలాగే… కరెంట్ కోతలు, శాఖల వారీగా brs చేస్తున్న మాటల దాడికి సంబంధించిన మంత్రులు కూడా సరిగా రియాక్ట్ అవ్వడం లేదని అంటున్నారు. గతంలో ఆరోపణలు వచ్చిన వెంటనే ఐదారుగురు మంత్రులు అలర్ట్‌ అయిపోయి దీటుగా సమాధానం ఇచ్చే వాళ్ళు. కానీ ఇప్పుడా సంఖ్య బాగా పడిపోయిందన్న అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. ఇక MLAలు ఐతే… ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారట. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ లు వేముల వీరేశం, ఆది శ్రీనివాస్.. కౌన్సిల్ లో ప్రభుత్వ విప్‌లు బల్ముూరి వెంకట్, అద్దంకి దయాకర్.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్ప… మిగతా ఎవరూ పెద్దగా రియాక్ట్ అవడంలేదన్న అభిప్రాయం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు కదా అంటూ…. శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. వచ్చి అసెంబ్లీ ఆవరణలో మీడియా సమావేశం పెట్టారు.

సీఎంకి సన్నిహితులైన మంత్రులు కూడా బయటకు వచ్చి ప్రతిపక్షం నుండి వచ్చే విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదన్నది కాంగ్రెస్‌ వర్గాల మాట. మంత్రులంతా ఎవరి శాఖ వాళ్ళు.. ఎవరి పని వాళ్ళదే అన్నట్టు ఉంటున్నారు తప్ప… పార్టీ, ప్రభుత్వం అన్న ధ్యాస లేకుండా పోయిందని చెప్పుకుంటున్నారు. అపోజిషన్‌ వాళ్ళు తిడితే…. CMనో, పార్టీనో తిట్టారు గానీ….. దాంతో నాకేం సంబంధం అన్నట్టు మినిస్టర్స్‌ వదిలేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలకు సమష్టి బాధ్యత ఉంటుందన్న సంగతి తెలంగాణ మినిస్టర్స్‌ చాలా మంది మర్చిపోయినట్టున్నారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా సీఎం చెప్పిన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి ఆయన మాటల ప్రకారం ఇకనైనా… మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తారా…? లేదంటే మళ్ళీ అదే టీం స్పందించాలా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా పార్టీ లో సమన్వయం.. కేబినెట్‌ మంత్రులు కొసరు పనులు వదిలేసి..అసలు పనిలో పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నాయి హస్తం వర్గాలు.