Off The Record: పార్టీ నిర్మాణం మీద ఫోకస్ లేదని రాహుల్ అన్నారా?
- ఢిల్లీలో రాహుల్ గాంధీ, మహేష్ గౌడ్ ప్రత్యేక భేటీ
- అర్ధగంట మీటింగ్‌లో ఏం జరిగిందంటూ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ
- పార్టీ నిర్మాణం మీద ఫోకస్ లేదని రాహుల్ అన్నారా?
- లీడర్స్, కేడర్‌కు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయా?
- పక్క రాష్ట్రంలోని ఓ నేతలా పార్టీని నడపాలని సూచించారా?
- అధికారం ఉన్నచోట ఇంకా బలమైన నిర్మాణం జరగాలన్న అభిప్రాయం
- పదవులు రాలేదన్న నిరాశలో రాష్ట్ర నాయకులు
- ముందు నామినేటెడ్ పోస్ట్‌లను భర్తీ చేస్తే కదలిక వస్తుందన్న ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్… ఢిల్లీలో రాహుల్ గాంధీతో సుమారు అర గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారట. రాష్ట్రం నుంచి వెళ్లిన పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా రాహుల్‌ని కలిసినా…. స్టేట్ పార్టీ చీఫ్‌కు ముఖ్యనేత ఏం చెప్పారన్న అంశం చుట్టూ ఉత్కంఠ పెరుగుతోంది. ఆ భేటీలో ఏం చర్చ జరిగింది…? రాహుల్ గాంధీ ఆదేశాలు ఏంటి..? వాటి ప్రకారం మహేష్ గౌడ్ ఇక రంగంలోకి దిగుతారా..? స్పీడ్ పెంచుతారా అన్న చర్చలు మొదలయ్యాయి రాష్ట్ర రాజకీయవర్గాల్లో.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్టీ నిర్మాణం మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట రాహుల్. క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకత్వం బలోపేతం, క్యాడర్ స్థితిగతుల్ని తెలుసుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే.. తెలంగాణలో పార్టీ నిర్మాణం మీద సరిగ్గా ఫోకస్ చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఓబీసీ అజెండాతో పాటు.. అనుకున్న స్థాయిలో పార్టీ నిర్మాణం జరగడం లేదనే ఫీడ్ బ్యాక్ ఏఐసీసీకి ఉందట. దానితో పాటు పార్టీ క్యాడర్, నాయకులకు సంబంధించిన అంశాలను కూడా ఇద్దరూ ఆ అర్ధగంట మీటింగ్‌లో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా పొరుగు రాష్ట్రంలోని ఓ నాయకుడి లేరు ప్రస్తావించి మరీ.. క్యాడర్‌ని, పార్టీని అలా ముందుకు తీసుకెళ్లాలి రాహుల్ సూచించినట్టు తెలిసింది.
Also Read
ఈ మధ్యకాలంలో పూర్తిగా పార్టీ నిర్మాణంపైనే పనిచేస్తున్నారట రాహుల్. అందులో భాగంగానే డీసీసీల నియామకం ఆయన నిర్ణయించినట్టుగానే జరిగింది. ఐతే పార్టీ.. తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి.. ఇంకాస్త బలమైన నిర్మాణంతో పాటు క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాలని సూచించినట్టు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అయినా… ఇంకా తమకు సరైన ఆదరణ దక్కడం లేదంటూ కార్యకర్తలు కొంత నిరాశలోనే ఉన్నారన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. ఒక రకంగా ఇది పార్టీకి సవాలేనని అంటున్నారు. వెంటనే నామినేట్ పోస్టులు భర్తీ చేస్తే.. ఎంతోకొంత కదలిక వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇలాంటి చాలా అంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. దీంతో.. కీలకమైన వ్యవహారాల గురించి రాహుల్ గాంధీ చెప్పాల్సింది చెప్పేశారు. ఇక రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎలా ముందడుగు వేస్తుంది..? నిర్మాణంపై ఫోకస్ చేస్తుందా..? లేదా అనేది చూడాలంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..