OTR: తెలంగాణ బీజేపీలో ఆ నేతలెవరు?
- బీజేవైఎం జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి నలుగురికి చోటు
- లిస్ట్‌లోని పేర్లు చూసి షాకవుతున్న రాష్ట్ర నాయకులు
- బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షురాలిగా మాలోత్ కోమలి నాయక్
- పాలసీ&రీసెర్చ్ ఇన్‌ఛార్జ్‌గా అఖిల, కో-ఇన్ఛార్జ్ కమల్ మడిశెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: వాళ్ళ పేరు పక్కన… స్టేట్ తెలంగాణ అని ఉందిగానీ…. ఇక్కడి వాళ్ళకు వాళ్లెవరో తెలియదు. అసలు రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఎప్పుడు పని చేశారన్న క్లారిటీ లేదు. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అయ్యారబ్బా…. అంటూ రాష్ట్ర కాషాయదళం బుర్ర గోక్కుంటోందట. ఏ విషయంలో పార్టీ లోకల్ నాయకులు అంతలా గందరగోళ పడుతున్నారు? స్టేట్ లీడర్స్‌కి కూడా తెలియని ఫేస్‌లను ఇంపోర్ట్ చేసుకుని తెలంగాణ కోటాలో ఇచ్చిన ఆ పదవులేంటి? పార్టీ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 20న యువ మోర్చా జాతీయ కమిటీని, జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించింది బీజేపీ. మోర్చా కమిటీలో వివిధ రాఫ్ట్రాలకు చెందిన యువ నేతలను ఆయా పోస్టుల్లో నియమించింది. అందులో భాగంగానే… తెలంగాణ నుంచి కూడా నలుగురికి చోటు దక్కింది. ముగ్గురు జాతీయ కమిటీలో ఆఫీస్ బేరర్స్‌గా, ఒకరు జాతీయ కార్యవర్గ అభ్యులుగా అపాయింట్ అయ్యారు. మన రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కింది, జాతీయ మోర్చాలో మంచి పోస్ట్‌లు వచ్చాయంటూ సంబరపడ్డ స్టేట్ లీడర్స్… లిస్ట్‌లోని ఆ పేర్లు చూసి షాకవుతున్నారట. అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడి వాళ్లు, రాష్ట్రంలో పార్టీ కోసం ఏం చేశారంటూ ఎవరికి వారు క్వశ్చన్ మార్క్ ఫేస్‌లు పెడుతూ దిక్కులు చూస్తున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ యువమోర్చా (BJYM) కమిటీలో తెలంగాణ నుంచి మాలోత్ కోమలి నాయక్ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఇక పాలసీ & రీసెర్చ్ ఇన్‌ఛార్జ్‌గా అఖిల, పాలసీ & రీసెర్చ్ కో-ఇన్ఛార్జ్ గా కమల్ మడిశెట్టికి పోస్ట్‌లు దక్కాయి. ఇలాగే… BJYM జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధు రెడ్డి అపాయింట్ అయ్యారు. అయితే….ఇందులో కొంత మంది పేర్లు చూసి తెలంగాణ బీజేపీ నేతలు అవాక్కవుతున్నారట. వాళ్ళను స్టేట్ కోటాలో చూపించడం తప్ప టీజీ బీజేపీతో ఏ సంబంధమూ లేదని చెప్పుకుంటున్నారు. అసలు వాళ్ళు తెలంగాణలో ఎప్పుడు. ఎక్కడ పని చేశారంటూ ఆరా తీస్తున్నారు చాలామంది. ఒక్క కసిరెడ్డి సింధు రెడ్డి తప్ప మిగతా ముగ్గురికీ తెలంగాణతో పెద్దగా సంబంధం లేదని, వాళ్ళు రాష్ట్రంలో పార్టీ కోసం కష్టపడ్డ దాఖలాలు కూడా లేవని అంటున్నారు. ABM టీమ్‌లో పనిచేసిన అఖిల… ఆ తర్వాత డిల్లీ వెళ్ళిపోయారు. ఇక్కడ పార్టీలో మాత్రం పనిచేయలేదట.
Also Read
ప్రస్తుతం బీజేపీ తెలంగాణ యువ మోర్చాలో ఉన్న చాలా మందికి ఆమె ముఖమే తెలియదట. ఇక మాలోత్ కోమలి నాయక్ది కూడా తెలంగాణ నేటివ్ కాదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా మాత్రమే ఆమె ఇక్కడ ఉంటున్నారంటూ గుర్తు చేస్తున్నారు. అలాగే… ఆ పేరు వింటే స్పురించే సామాజికవర్గం కూడా ఆమెది కాదన్నది కమలం నేతల ఇంటర్నల్ టాక్. కమల్ కూడా తెలంగాణలో పార్టీ కోసం ఎప్పుడు పనిచేశారో తెలియదంటూ గుసగుసలాడుకుంటున్నారు. సాధారణంగా… వివిధ జాతీయ కమిటీల్లో పదవుల కోసం రాష్ర్ట పార్టీనే ఎంపిక చేసిన పేర్లు పంపిస్తుంది. మరి ఈ విడతలో రాష్ట్రం నుంచి వెళ్ళిన లిస్ట్‌ను పరిగణలోకి తీసుకున్నారా? లేదా? అన్న అనుమానాలు బీజేపీ వర్గాల్లోనే పెరుగుతున్నాయట. అసలా పేర్లను ఎవరు రికమండ్ చేశారన్న డిస్కషన్ కూడా పార్టీలో జరుగుతోందట. ఒకవేళ ఇక్కడి వాళ్ళతో సంబంధం లేకుండా… ఢిల్లీ పెద్దలే తెలంగాణ కోటాను డిసైడ్ చేసి ఉంటే… అసలు పూర్తిగా అక్కడి వాళ్ళ పేర్లే రాసేసుకుంటే పోయేదిగా అంటూ… నిష్టూరాలాడుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళను వదిలేసి…. ప్యారాచూట్ లీడర్స్‌ని దింపే కల్చర్ కరెక్ట్ కాదంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. మొత్తం మీద బీజేవైఎం జాతీయ కమిటీ తెలంగాణలో అసంతృప్తికి బీజం వేసిందన్నది కాషాయవర్గాల మాట.
తాజావార్తలు
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
-
OTR: తెలంగాణ బీజేపీలో ఆ నేతలెవరు?
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!