Off The Record: మంత్రి శ్రీధర్‌బాబు vs ఎంపీ గడ్డం వంశీ.. ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: సీనియర్ మంత్రి, యంగ్ ఎంపీ. ఇద్దరూ కొన్నాళ్లు చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు. అంతలోనే ఏదో పురుగు తొలిచినట్టు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇన్నాళ్లు నడిచిన కోల్డ్‌వార్ ఇప్పుడు ఏకంగా ఓపెన్ లెటర్స్ రాసుకునేదాకా వెళ్లింది. ఎవరా ఇద్దరు కాంగ్రెస్ నాయకులు? ఏంటా పొలిటికల్ టామ్ అండ్ జెర్రీ వార్? పెద్దపెల్లి జిల్లా హస్తం పార్టీలో మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నట్టుగా తయారైంది వ్యవహారం. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీ లాగా కూడా మారుతోందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ హస్తం పార్టీ హవానే నడిచింది. జిల్లాను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ సీటును కూడా కైవసం చేసుకుంది. కానీ… ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రి, ఎంపీ మధ్య తేడాలు వచ్చాయట.
పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి కలిసి ఎంపీతో డిస్టెన్స్ పాటిస్తున్నారన్నది బహిరంగ రహస్యం అని అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఆ క్రమంలో ఎంపీని అయినప్పటికీ కలెక్టర్ తన మాట వినడం లేదని.. కేవలం మంత్రి చెప్పిన మాట వింటున్నాడంటూ గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు ఎంపీ వంశీకృష్ణ. ఇటీవల జరిగిన ఒక సమావేశంతో ఈ విభేదాలు మరింత ముదిరినట్టయింది. కొయ్యూరు మండలం వల్లెంకుంటకు చెందిన నలుగురిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇంతకాలం పార్టీ వేదికల మీద, సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వెళ్లగక్కిన ఎంపీ వంశీకృష్ణ… ఈ మధ్య స్పీడ్ పెంచారు. తనకు ప్రాధాన్యత దక్కకుండా చేస్తున్నారంటూ మంత్రి శ్రీధర్ బాబును టార్గెట్ చేశారట ఆయన. విశాఖ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కోసం మల్హర్ మండలం వల్లెంకుంటలో పర్యటించారు ఎంపీ.
Also Read
ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, వార్డ్ మెంబర్ లకావత్ లక్ష్మితో పాటు.. మరికొందరు కాంగ్రెస్ నాయకులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, కారణమేంటో తెలియదుగానీ.. ఎంపీ వంశీ కార్యక్రమానికి హాజరైన తెల్లవారే ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్‌తోపాటు మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు మండల నేతలు. అదే తీవ్ర వివాదానికి దారి తీసింది. తన కార్యక్రమానికి హాజరైనందుకే ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నవారిపై మంత్రి శ్రీధర్ బాబు అకారణంగా సస్పెన్షన్ వేటు వేయించారని ఆరోపించారు వంశీ. ఇక తాజాగా ఆయన మంత్రి శ్రీధర్ బాబుకు రాసిన ఓ లేఖ కలకలం రేపుతోంది…. కాంగ్రెస్ నేతలపై ఎందుకు సస్పన్షన్ వేటు వేశారో చెప్పాలని… 20 ఏళ్ల నుంచి పార్టీకి సేవ చేసినందుకు అది బహుమానమా… పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ తప్పా.. అంటూ తన లేఖల ప్రశ్నించారు ఎంపీ.
ఇక ఎంపీ వంశీకి ఆయన తండ్రి, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా గొంతు కలపడంతో టాపిక్ మరింత హీటెక్కిందట. మినిస్టర్ శ్రీధర్‌బాబుని ఉద్దేశించి విడుదల చేసిన ఇంకో లెటర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయరమణారావులు హాజరు కాలేదు.. శ్రీధర్ బాబు నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు మంథనికి వెళ్లారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళని ఎమ్మెల్యేల పైన అస్సలు చర్యలు తీసుకోవద్దంటూ శ్రీధర్ బాబును ఉద్దేశించి లేఖలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఎంపీ. కాంగ్రెస్ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు, చిన్న నేతలకు ఒక న్యాయం.. ఎమ్మెల్యేలకు ఒకే న్యాయం ఉండాలన్నది ఆ లెటర్ సారాంశం. అయితే ఎంపీ వంశీకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గ్యాప్ ఇప్పటికిప్పుడు వచ్చిందేమీ కాదంటున్నారు.
గతంలో ప్రోటోకాల్ విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీఎం సభలో చెప్పడంతో వారి మధ్య విభేదాలు బయట పడ్డాయి… అప్పటి నుంచి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో తన తండ్రి వివేక్, తాత వెంకటస్వామి ప్రాతినిధ్యం వహించినప్పటి పాత పరిచయాలను పునరుద్ధరించుకుంటూ… తామంటే పడని ఛోటా మోటా నేతలతో ఎంపీ గ్రూప్స్ తయారు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఇక శ్రీధర్ బాబుతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చిన గ్యాప్ అలాగే పెరుగుతోందట. అదే సమయంలో కొంతకాలం చెట్టపట్టాలేసుకుని తిరగడం… ఆ వెంటనే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారడం వీరికి రొటీన్ అయిందన్న వాదన సైతం ఉంది.
ఈ పరిస్థితుల్లో ఎంపీ రాసిన రెండు లేఖలను చూస్తే.. పార్టీ పెద్దలకు తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పినట్టే కనిపిస్తుందన్న విశ్లేషణలు జోరందుకున్నాయి… ఇంతకాలం ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగంపైనే విమర్శలు చేసిన ఎంపీ… ఒక్కసారిగా మంత్రిని, అదికూడా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న శ్రీధర్ బాబును టార్గెట్ చేయడం వెనక ఏం జరుగుతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఎంపీ లేఖలపై మంత్రి శ్రీధర్ బాబు ఎలా స్పందిస్తారు..? ఒకవేళ లైట్ తీసుకుంటే ఎంపీ వంశీ నెక్స్ట్ స్టెప్ ఏంటి..? అనేది ప్రస్తుతానికి కీలకాంశం.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి శ్రీధర్‌బాబు vs ఎంపీ గడ్డం వంశీ.. ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్.?
-
Milk Adulteration: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. పోచారంలో తయారీ కేంద్రం గుర్తింపు!
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
-
Dhanteras 2026: బంగారం, వెండి కొనలేకపోతున్నారా? ధంతేరస్ రోజు బడ్జెట్లో ఈ 8 వస్తువులు శుభప్రదం
ట్రెండింగ్
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!