Off The Record: కేడర్ చేజారుతున్నా ప్రేక్షకపాత్రేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేనుకు పెత్తనం ఇస్తే.. ఇంకేదో చేసినట్టుగా ఉందట ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి. కేడర్ చేజారిపోతున్నా.. నాయకులది ప్రేక్షకపాత్రే. ఏజెన్సీలో కీలక సెగ్మెంట్ కావడం.. అధిష్ఠానం నాన్చుడు ధోరణి తమ్ముళ్లలో బీపీ పెంచుతోందట.
Also Read
2004 నుంచి రంపచోడవరంలో టీడీపీ డల్..!
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ST రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. ఆమె ఒంటెద్దు పోకడలకు పోతున్నారనేది కేడర్ ఆరోపణ. మూడున్నరేళ్లుగా శ్రేణులు చెల్లాచెదురవుతున్నా పట్టించుకోవడం లేదట. వంతలతో పడని మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నం బాబు రమేష్‌లు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు రంపచోడవరం టీడీపీకి కంచుకోట. టీడీపీ పోటీలో లేకపోతే సైకిల్ పార్టీ మద్దతుతో ఇక్కడ వామపక్షాలు బరిలో ఉండేవి. 2004 నుంచి సీన్ మారింది. 2004, 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. తర్వాత వైసీపీకి పట్టం కట్టారు రంపచోడవరం ఓటర్లు.
అధిష్ఠానం పిలుపిచ్చిన కార్యక్రమాల ఉసూ లేదా?
2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజేశ్వరి తర్వాత కండువా మార్చేశారు. 2019 ఎన్నికల్లో సీనియర్లను కాదని రాజేశ్వరికే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్ఠానం. దాంతో మాజీ ఎమ్మెల్యేలు అలిగినట్టు చెబుతారు. దీనికితోడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకే టీడీపీలో ప్రాధాన్యం ఇస్తున్నారని రాజేశ్వరిపై ఆరోపణలు ఉన్నాయి. అధిష్ఠానం పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాల ఊసే లేదట. ఏదైనా చేస్తే మొక్కుబడిగా ఉంటోందనేది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల కోసం కొందరు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు.
పార్టీ కార్యక్రమాలు పట్టవు.. పోటీకి నేతలు సై
మరోసారి పోటీకి రాజేశ్వరి ఆసక్తితో ఉండగా.. టీడీపీ నేత గొర్లె సునీత సైతం కర్చీఫ్ వేస్తున్నారట. మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ.. మాజీ మంత్రులతో టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నారట. టిడిపి టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది క్వశ్చన్ మార్క్ కావడంతో నేతలు సైలెంట్ అయ్యారు. ఒకరంటే ఒకరికి గిట్టక కార్యకర్తలు సైతం గ్రూపులుగా విడిపోయారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నేతలే కాకుండా.. శీతంశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నం బాబు రమేష్ కూడా టీడీపీ ఛాన్స్ ఇస్తే పోటీకి సై అంటున్నారట. అయితే అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పార్టీ జెండా మోస్తారని.. మిగిలిన వాళ్లు దూరంగా ఉంటారని ప్రచారం మొదలైంది. గడిచిన 4 ఎన్నికల్లో ఓడినా.. ఇక్కడి నేతలు గుణపాఠం నేర్చుకోలేదన్న కామెంట్సూ వినిపిస్తున్నాయి. మరి.. రంపచోడవరం టీడీపీకి పార్టీ పెద్దలు చికిత్స చేస్తారో లేక నాన్చుతారో చూడాలి.
తాజావార్తలు
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!