Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Rare Combination In Ap Politics

Off The Record: ఇదేం కాంబినేషన్ దేవుడా?

Published Date :April 22, 2023 , 9:18 pm
By NTV WebDesk
Off The Record: ఇదేం కాంబినేషన్ దేవుడా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు రాజకీయాల్లో వాళ్లిద్దరూ చాలా పాపులర్. ఒకరు పార్టీ పెట్టి దేశ సేవ చేస్తానంటే…..మరొకరు ఉన్నత ఉద్యోగం వదిలేసి పొలిటికల్ ప్లే గ్రౌండ్లో కష్టపడుతున్నారు. అలాంటి వారిద్దరూ ఇప్పుడు ఒకే వేదిక మీదికొచ్చి కామన్ అజెండా ప్రకటించడం కలకలం రేపుతోంది. ఎవరా ఇద్దరు? ఆ కలయిక వెనక ఆంతర్యం ఏంటి?

తెలుగు రాజకీయాలకు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ముడి సరకుగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సంస్థను పరిరక్షించడంలో ఛాంపియన్స్ అనిపించుకోవాలని పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎంట్రీ ఏపీ పార్టీలను డిఫెన్స్‌లోకి నెట్టేసింది.ఆ తర్వాతి నుంచి ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. కొత్త కలయికలు కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి కలయికే ఒకటి జరగ్గా…..వాళ్ళిద్దరూ పరస్పర విరుద్ధమైన వ్యక్తులు కావడం చర్చకు కారణం అయింది. ఆ ఇద్దరిలో ఒకరు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కాగా….మరొకరు CBI మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.

స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉమ్మడి అజెండా?
ఈ ఇద్దరు తొలిసారి ప్రత్యక్షంగా కలవడమే కాదు… ఉమ్మడిగా ప్రెస్‌మీట్‌ పెట్టడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఆ వేదిక నుంచే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అజెండాగా ప్రకటించారు ఇద్దరూ.ఇప్పటికే EOI కోసం దరఖాస్తు చేసిన లక్ష్మీనారాయణ….ప్రజల భాగస్వామ్యం ద్వారా నిధుల సమీకరణకు పూనుకున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 8 వేల 500కోట్లు సమీకరించడమే లక్ష్యం అంటున్నారాయన. అదే సమయంలో పాల్ సైతం విశాఖ ఉక్కు పరిరక్షణ తన బాధ్యతగా ప్రకటించుకున్నారు. 45 వేల కోట్ల రూపాయల విదేశీ నిధులు తెచ్చి ప్రయివేటీకరణను అడ్డుకుంటానని హడావిడి చేస్తున్నారాయన. పాల్‌ లాంటి వ్యక్తి… లక్షల కోట్ల విలువ చేసే ప్లాంట్‌ను కొనేయడం పెద్ద లెక్క కాదని మాట్లాడడం అంత పెద్ద మేటర్‌ కాదంటున్నారట పరిశీలకులు. అంతకు మించి ఆయనతో లక్ష్మీనారాయణ కలవడాన్నే ఎలా చూడాలో అర్ధంగాక బుర్రలు గోక్కుంటున్నారట.

గత ఎన్నికల్లో లక్ష్మీనారాయణకు 2లక్షల 88వేల ఓట్లు
రాజకీయంగా విశాఖను తన అడ్డాగా మార్చుకున్న మాజీ జేడీ….గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయగా 2లక్షల 88వేల ఓట్లు వచ్చాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో గాజువాకలోనే ఆయనకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అందుకే…. ఆ ప్రాంత ఎదుగుదలకు కారణం అయిన ఉక్కు పరిశ్రమను అమ్మేస్తామంటే సహించేది లేదని ప్రకటించి.. ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న మాజీ జేడీతో కలవడం ద్వారా తాను రేసులోకి రావాలనేది పాల్ లెక్కఅట. దీనితో ఎన్నికలకు ముందు నిద్రావస్తలో ఉన్న ప్రజాశాంతి పార్టీని తట్టి లేపే ప్రయత్నాల్లో ఉన్నారట. లక్ష్మీనారాయణ, పాల్‌ కలయిక వెనుక ప్రత్యేకమైన కారణాలు లేనప్పటికీ ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగినట్టు సమాచారం. తనను తాను అంతర్జాతీయ రాజకీయాలను శాసించే లోకరక్షకుడిగా చెప్పుకునే పాల్…..లక్ష్మీనారాయణతో జరిగిన సమావేశంలోనూ అటువంటి ధోరణే ప్రదర్శించారట.

ప్రజాశాంతి పార్టీలో చేరమని మాజీ జేడీని ఆహ్వానించిన పాల్‌
రాజకీయంగా బలోపేతం కావాలంటే… ప్రజాశాంతి పార్టీలో చేరాలని లక్ష్మీనారాయణను ఆహ్వానించారట పాల్. ఈ ప్రతిపాదనతో.. నవ్వుకున్న మాజీ జేడీ….ముందు ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలను ఉపయోగించి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోండి అప్పుడు చూద్దాం అనేశారట. అంతే కాదు ప్రయివేటీకరణ ఆపుతానంతే పాల్ పార్టీ అయినా… బీజేపీ అయినా నాకు ఒక్కటేనని చెప్పేశారట. అసలు మీటింగ్‌లో పాల్ దూకుడును అడ్డుకోవడం లక్ష్మీనారాయణకు కనాకష్టం అయిందట. లక్షల కోట్లు, విదేశీ నిధులు, ప్రపంచ స్థాయి నేతల పరిచయాలు ఇలా పాల్ ఓ రేంజ్‌లో లెక్కలేసి చెప్పేస్తుంటే… లక్ష్మీనారాయణ కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా మారిపోవాల్సి వచ్చిందట. పాల్‌ లెక్కలను ఎక్కడికక్కడ క్రాస్ ఎగ్జామిన్ చేసేశారట ఆయన. మొత్తంగా భిన్న నేపధ్యాలున్న నాయకుల తొలి సమావేశమే చిత్ర విచిత్రంగా జరిగిపోయిందట. చివరిగా రాజకీయాలు వద్దని, స్టీల్ ప్లాంట్ కోసం అయితే కలిసి పనిచేయడానికి సిద్ధమని లక్ష్మీనారాయణ ముఖం మీదే చెప్పేశారట. మాజీ జేడీ కాస్త గట్టిగానే తన అభిప్రాయాన్ని చెప్పేసరికి పాల్ వాక్‌ ప్రవాహానికి అడ్డుకట్ట పడిందట. మొత్తంగా ఈ మీటింగ్‌ అతి రహస్యం…బట్టబయలు అన్నట్టే జరిగిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • JD Laxminarayana
  • KA Paul
  • off the record
  • steel plant

తాజావార్తలు

  • Nobel Peace Prize: ‘మేము యుద్ధాన్ని ఆపాం.. శాంతి బహుమతి మాకే ఇవ్వండి’: పాక్ ప్రధాని

  • Botsa Satyanarayana Emotional: ఆ మహానేతను తలుచుకొని కంటతడి పెట్టిన బొత్స..!

  • Prabhsimran Singh: బ్యాటింగ్‌లో ఎవరినీ కాపీ కొట్టను.. కీపింగ్‌లో మాత్రం ఆ దిగ్గజంలా ఉండేందుకు ప్రయత్నిస్తా!

  • Bhatti Vikramarka :జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం

  • AP Cabinet: 31 ప్రాజెక్టులు.. రూ.39,436 కోట్లు.. ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు..!

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions