Site icon NTV Telugu

Off The Record: టీటీడీలో ఆ పోస్ట్ అంటే పిచ్చ క్రేజ్..! కల్తీ నెయ్యి వ్యవహారం తర్వాత మారిపోయిన సీన్

Ttd

Ttd

Off The Record: ఒకప్పుడు టీటీడీలో ఆ పోస్ట్‌ అంటే పిచ్చ క్రేజ్‌. పైరవీలు చేసుకుని మరీ ఆ సీట్లో కూర్చునేవారట. కానీ… ఇప్పుడు రా… రమ్మని పిలిచి హారతి ఇచ్చి కూర్చోబెట్టినా… మావల్ల కాదు బాబోయ్‌ అంటూ పారిపోతున్నారట. కాదు కూడదంటే మెడికల్‌ లీవ్ పెట్టి పారిపోతున్నారట. ఇంతకీ ఏంటా పోస్ట్‌? ఎందుకా పరిస్థితి వచ్చింది?

Read Also: Congress BC Leaders: రేపు తెలంగాణ గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ బీసీ నేతలు..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండెక్కిన ప్రతి భక్తుడు తృప్తిగా శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరిచేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. నిత్యాన్నదానంతోపాటు దర్శనాంతరం ఆలయంలో ప్రసాదాలు పంపిణీ చేస్తుంది దేవస్థానం. లడ్డు, వడలాంటి వాటిని భక్తులుకు విక్రయిస్తుంది. ఇలా… ఏడాదికి రెండున్నర కోట్ల మందిదాకా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటే… నెలకు కోటి వరకు లడ్డూలను విక్రయిస్తోంది టీటీడీ. ఇదంతా పైకి కనిపించే వ్యవహారం. ఆ స్థాయిలో ప్రసాదాలను తయారు చేయడం ఒక ఎత్తయితే… అందుకు సంబంధించిన నాణ్యమైన సరకులను కొనడం, ఎక్కడా తేడా రాకుండా చూసుకోవడం మరో ఎత్తు. ముడి సరకుల్ని టెండర్స్‌ ద్వారా సేకరిస్తుంది తిరుమల తిరుపతి దేనవస్థానం బోర్డ్‌. టిటిడి వార్షిక బడ్జెట్‌ 5వేల258 కోట్లు అయితే…. అందులో జీతాల చెల్లింపునకు 1,773 కోట్లు పోతుంది. ఆ తర్వాత ఎక్కువ కేటాయింపులు జరిగేది ముడి సరుకుల కొనుగోళ్ళకే. ఇందుకోసం 768 కోట్లు కేటాయిస్తుంది దేవస్థానం. ఆ తరువాత ఇంజనీరింగ్ పనుల కోసం 350 కోట్ల బడ్జెట్‌ ఉంటుంది.

Read Also: CBG Plant: ఏపీలో సీబీజీ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆర్వెన్సిస్‌ గ్రూప్‌!

ఇక, ముడి సరకులు కోనుగోలుకు ప్రత్యేకంగా మార్కెటింగ్‌ విభాగం ఉంటుంది. ఇందులో అధికారులను మాత్రం ఎక్కువగా ఇంజనీరింగ్ శాఖ నుంచే నియమిస్తూంటారు. ఈఈ స్థాయి అధికారిని మార్కెటింగ్‌ మేనేజర్‌గా నియమిస్తారు. దశాబ్దాల తరబడి ఆ పోస్ట్‌కు డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ఎందుకంటే… 15 మంది వరకు ఈఈలు వుండే ఇంజనీరింగ్ శాఖ వార్షిక బడ్జెట్‌ 350 కోట్లుకాగా…ఒకే ఒక్క ఈఈ వుండే మార్కెటింగ్‌ విభాగం బడ్జెట్‌ 768 కోట్లు. అలాంటి డిపార్ట్‌మెంట్‌లో ఇప్పుడు పరిస్థితి వేరుగా వుందట. ఒకప్పుడు మాకంటే మాకంటూ మార్కెటింగ్‌ ఈఈ పోస్ట్‌ కోసం ఎగబడి… పైరవీలు సైతం చేసుకునే అధికారులు ఇప్పుడు మాత్రం… ఆ పోస్టా… మాకొద్దు బాబోయ్‌ అంటున్నట్టు సమాచాకం. శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదం తర్వాత సీన్‌ మొత్తం మారిపోయిందట. నిరుడు జులైలో కల్తీ నెయ్యి అంశం వెలుగులోకి రావడంతో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్ రాకతో మార్కెటింగ్ విభాగం అధికారుల్లో గుబులు మొదలైందట. దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ చేస్తూండడం, గతంలో విధులు నిర్వహించిన వారిని కూడా బాధ్యుల్ని చేస్తుండటంతో…. వాతావరణం టెన్షన్‌గా ఉందని చెప్పుకుంటున్నారు. గతంలో నిజాయితీకి మారు పేరుగా గుర్తింపు ఉన్న అధికారులు కూడా చిన్న చిన్న గిప్టులకు పడిపోయిన అంశాలు సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయట.

Read Also: Pakistan: కరాచీ, లాహోర్ ఎయిర్‌స్పేస్‌ని పాక్షికంగా మూసేసిన పాకిస్తాన్..

అయితే, ఇలా పాత వ్యవహారాలన్నిటినీ తవ్వుతుండటంతో…. కొత్తగా ఈ పోస్టు అంటేనే భయపడిపోతున్నారు అయ్య బాబోయ్‌ అంటున్నారట ఇంజనీర్లు. అసలు కల్తీ నెయ్యి అంశంపై పోలీస్ స్ఠేషన్‌లో ఫిర్యాదు చేసిన అధికారే ముందుగా లాంగ్ లీవ్ పెట్టి అమెరికాలో వున్న కుటుంబసభ్యులకు దగ్గరకు వెళ్లిపోయారు. ఆ తరువాత వచ్చిన అధికారికి నిజాయితీ ముద్ర ఉంది. టీటీడీలో మంచి ట్రాక్ ఉన్న సదరు ఆఫీసర్‌….సిట్ విచారణ శైలితో వీఆర్‌ఎస్‌ తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఈ టెన్షన్‌ మాకు వద్దంటూ మెడికల్ లీవ్ లో వెళ్లిపోయ్యారట ఆయన. అంతకు ముందు బదిలీ కోసం విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి మెడికల్ లీవ్ పెట్టేసినట్టు సమాచారం. కీలకమైన ఆ పోస్టులో సంభందిత అధికారి లేకపోతే రోజువారి కార్యకలాపాలకు ఇబ్బందులు వస్తాయి. కానీ… ఎంత చెబుతున్నా… మార్కెటింగ్‌ ఈఈ బాధ్యతలు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదట. గడిచిన పది నెలల్లో… ఇద్దరు ఇంజనీర్లు ఈ పోస్టు మాకొద్దని శెలవులో వెళ్లిపోతే.. చివరికి ప్రమోషన్‌ని ఎరగా వేసి డిప్యూటీ ఈఈని ఆ పోస్టులో ఇంచార్జ్ గా నియమించారు. వాస్తవానికి కోర్టు వివాదం కారణంగా గత ఐదేళ్ళ నుంచి టీటీడీలో ఉద్యోగుల ప్రమోషన్ ప్రకియ నిలిపోయింది. అలాంటిది మార్కెటింగ్ మేనేజర్ గా డిప్యూటి ఈఈని ఇన్ఛార్జ్‌గా నియమించే పరిస్థితి ఏర్పడింది. ఈయనన్నా ఉంటారా? లేక వద్దు మొర్రో అని వెళ్ళిపోతారా అన్నది చూడాలన్న చర్చ జరుగుతోంది టీటీడీలో.

Exit mobile version